నడిరోడ్డుపై పోలీస్‌తో తలపడిన జిమ్ ట్రైనర్... ఎవరు గెలిచారంటే...

ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేదాని కంటే... ఇద్దరూ కలిసి ఈ ఛాలెంజ్ స్వీకరించడాన్ని నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

news18-telugu
Updated: July 6, 2020, 2:06 PM IST
నడిరోడ్డుపై పోలీస్‌తో తలపడిన జిమ్ ట్రైనర్... ఎవరు గెలిచారంటే...
పోలీస్, జిమ్ ట్రైనర్ మధ్య పుషప్స్ ఛాలెంజ్... గెలిచిందెవరు?... వైరల్ వీడియో (credit - twitter)
  • Share this:
ఉత్తర అమెరికాకు తోకలా ఉండే దేశం మెక్సికో. ఇప్పుడు అక్కడ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో... ఓ జిమ్ ట్రైనర్, పోలీస్ మధ్య పుషప్స్ ఛాలెంజ్ నడిచింది. దీన్ని వీడియో తీసి... ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు యూజర్ సాగర్ సింగ్ కల్సీ. ఈ వీడియోలో... చుట్టూ పోలీసులూ, ప్రజలూ ఉండగా... జిమ్ ట్రైనర్, పోలీస్ రోడ్డుపై పుషప్స్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఫ్రెండ్లీ ఛాలెంజ్‌గా ఉండాలనే ఉద్దేశంతో... ప్రతి పుషప్‌కీ ఇద్దరూ చేతుల్ని కలుపుతూ... చేశారు. అసలీ ఛాలెంజ్ ఎందుకొచ్చిందంటే... ఆ దేశ జిమ్ ట్రైనర్లు... తిరిగి పనికి వెళ్లే విషయమై ఆందోళనకు దిగి... ధర్నా చేపట్టారు. దాంతో... వాళ్లను శాంతింపజేయడానికి ఈ ఛాలెంజ్ తీసుకున్నారు పోలీసులు.

పోలీసులపై కోపంతో ఉన్న జిమ్ ట్రైనర్... పోలీసులకు ఫిట్‌నెస్ లేదని అన్నాడు. దమ్ముంటే తనతో పుషప్స్ చెయ్యాలని ఛాలెంజ్ విసిరాడు. దాంతో పోలీసుల్లో ఒకరు ముందుకొచ్చారు. మిగతా పోలీసులు... వద్దొద్దు... వాళ్లు మనల్ని కావాలనే రెచ్చగొడుతున్నారు అంటే... ఆ పోలీస్... మరేం పర్లేదు సార్... ఏం పోయింది... ఓసారి చేసి చూపిద్దాం అంటూ ముందుకొచ్చారు.


ఇద్దరూ పుషప్స్ చేసిన తర్వాత... జిమ్ ట్రైనర్లలో కోపం తగ్గింది. పోలీసుల పట్ల అంకితభావం పెరిగింది. దాంతో... ఈ ఛాలెంజ్‌లో తాను ఓడిపోతున్నట్లు జిమ్ ట్రైనర్ ప్రకటించారు. దాంతో... పోలీస్ మరింత జోష్‌తో పుషప్స్ చేశారు. ఇక్కడ మరో గొప్ప విషయం ఉంది. ఆ పోలీసుకు ఒక కాలే ఉంది. మరొకటి కృత్రిమ అవయవం. అయినప్పటికీ ఎంతో జోష్‌తో ఛాలెంజ్ స్వీకరించడం నెటిజన్లకు బాగా నచ్చింది. అఫ్‌కోర్స్ మన పోలీసులు కూడా ఇలాంటివి చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు.
Published by: Krishna Kumar N
First published: July 6, 2020, 1:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading