హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Girl Gets Real Tail : తోకతో పుట్టిన పాప..అవాక్కయిన డాక్టర్లు..ఫొటో వైరల్

Girl Gets Real Tail : తోకతో పుట్టిన పాప..అవాక్కయిన డాక్టర్లు..ఫొటో వైరల్

తోకతో పుట్టిన చిన్నారి

తోకతో పుట్టిన చిన్నారి

Girl Gets Real Tail :జంతువులకు తోకలుంటాయన్న(Tail) విషయం తెలిసిందే. కానీ మనుషులకు తోక ఉండదు. అయితే తాజాగా మెక్సికో(Mexico)లో ఓ పాప 2 అంగుళాల పొడవు ఉన్న తోకతో పుట్టింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Girl Gets Real Tail :జంతువులకు తోకలుంటాయన్న(Tail) విషయం తెలిసిందే. కానీ మనుషులకు తోక ఉండదు. అయితే తాజాగా మెక్సికో(Mexico)లో ఓ పాప 2 అంగుళాల పొడవు ఉన్న తోకతో పుట్టింది. మెక్సికోలో చోటుచేసుకున్న ఈ అత్యంత అరుదైన సంఘటన చూసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. పాప తోక ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ పసికందు పూర్తి ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

న్యూవో లియోన్లోని ఆసుపత్రిలో ఓ మహిళ..ఆడపిల్లకు జన్మనిచ్చింది. డాక్టర్ జోస్యు రుయెడా నేతృత్వంలోని వైద్యులు పురుడు పోశారు. శిశువు పూర్తి కాలం గర్భంలో ఉన్నాకే జన్మించింది.గర్భధారణ సమయంలో ఎటువంటి సమస్యలు లేవు. అయితే పుట్టిన శిశువుకు రెండు అంగుళాలు (5.7 సెంటీమీటర్లు) తోక ఉంది. అది చూసి మెక్సికన్ డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇలాంటి కేసు మెక్సికోలో ఎప్పుడూ నమోదు కాలేదని డాక్టర్లు తెలిపారరు. పాప, పాప తల్లి కూడా ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్లు వెల్లడించారు. "శిశువు తోక మృదువుగా.. చక్కటి వెంట్రుకలతో నిండి ఉంది. ఎటువంటి నొప్పి లేకుండా అది కదులుతుంది. కానీ సూదితో చిన్నగా పొడిచినప్పుడు పాప ఏడ్చింది." అని డాక్టర్లు చెప్పారు. పాపకు రెండు నెలల వయస్సు వచ్చిన తర్వాత చిన్న ఆపరేషన్ తో తోక తొలగించబడిందని... బాలిక అదే రోజు డిశ్చార్జ్ చేయబడింది ఎటువంటి సమస్యలు లేవని డాక్టర్లు తెలిపారు. . సాధారణంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లల్లో తోక ఏర్పడుతుందని, కానీ తొమ్మిది నెలల తర్వాత అది ఎముకగా మారి లోపలికి వెళ్లిపోతుందని,కొన్ని అరుదైన కేసుల్లో మాత్రం తోకతో పుడతారని వైద్య నిపుణులు తెలిపారు. కాగా,ప్రపంచవ్యాప్తంగా 2017 నాటికి ఇలాంటి కేసులు కేవలం 195 గుర్తించబడ్డాయి. పొడవైనది 20 సెంటీమీటర్లు (7.9 అంగుళాలు) ఉన్న తోకను గుర్తించారు. ఇవి చాలా తరచుగా అబ్బాయిలలో కనిపిస్తాయి. తోక ఉన్న 17 మంది శిశువులలో ఒకరు కూడా మెదడు లేదా పుర్రె పెరుగుదల రుగ్మతలతో బాధపడుతున్నారు. అయితే ఎక్కువగా మగ శిశువుల్లోనే ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి కానీ, మెక్సికోలో ఇలా ఓ ఆడ శిశువు తోకతో జన్మించడం కూడా చాలా అరుదని వైద్య నిపుణులు అంటున్నారు.

Prabhas: అతి త్వరలో ప్రభాస్ ఎంగేజ్‌మెంట్! ఇది ఆఫీసియల్.. ఫిలిం క్రిటిక్ పోస్ట్ వైరల్

ఇటీవల నేపాల్ల్ లో దేశాంత్ అధికారి (16) అనే కుర్రవాడికి ఏకంగా 70 సెంటీ మీటర్ల పొడవున్న తోక ఉంది. దేశాంత్ పుట్టిన కొన్ని రోజులకే తల్లిదండ్రులు తోకను గుర్తించారు. దానికోసం చాలా ఆస్పత్రులకు తిరిగారు. కానీ ప్రయోజనం లేకపోయింది. తర్వాత దేశాంత్ హనుమంతుడి పునర్జన్మ అని ఓ పూజారి చెప్పడంతో తల్లిదండ్రులు ఆనందించి.. తోకను అలాగే వదిలేశారు. కానీ ఆ తోక వల్ల దేశాంత్ అధికారి చాలా ఇబ్బందులు పడ్డాడంట. తర్వాత ఆ భయాన్ని అధిగమించానని చెప్పుకొచ్చాడు. దేశాంత్ తోక గురించి యూట్యూబ్ ఛానళ్ల ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది. జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ కేస్ రిపోర్ట్స్ లో తోకతో పుట్టే శిశువులు అరుదైన వారిగా గుర్తించారు.

First published:

Tags: Mexico, Viral photo

ఉత్తమ కథలు