Home /News /trending /

METHOD OF MAKING COW DUNG NOT LESS YHAN JAVELIN THROW A WOMAN SEEN THROWING IT FROM THE GROUND TO THE HEIGHT OF THE CEILING PVN

Viral Video : ఆమె టాలెంట్ కు సోషల్ మీడియా ఫిదా..ఆ ఫ్లో చూస్తే ఆశ్చర్యపోతారు

ఆమె టాలెంట్ కు నెటిజన్లు ఫిదా

ఆమె టాలెంట్ కు నెటిజన్లు ఫిదా

Woman throwing cow dung : నేటి ఇంటర్నెట్ కాలంలో ఎప్పటికప్పుడు అనేక ఇంట్రెస్టింగ్ వీడియోలు వెలుగులోకి వస్తూ నెటిజన్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ దాగి ఉంటుంది. అయితే కొందరిలో ఉండే అద్భుతమైన టాలెంగ్ ఒక్కోసారి ఆలస్యంగా బయటకి వస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో వ్యక్తులలో దాగి ఉన్న ప్రతిభ వేగంగా బయటి ప్రపంచానికి ఈజీగా తెలిసే అవకాశం కలుగుతోంది.

ఇంకా చదవండి ...
    Woman throwing cow dung : నేటి ఇంటర్నెట్ కాలంలో ఎప్పటికప్పుడు అనేక ఇంట్రెస్టింగ్ వీడియోలు వెలుగులోకి వస్తూ నెటిజన్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ దాగి ఉంటుంది. అయితే కొందరిలో ఉండే అద్భుతమైన టాలెంగ్ ఒక్కోసారి ఆలస్యంగా బయటకి వస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా(Social Media) అందుబాటులోకి రావడంతో వ్యక్తులలో దాగి ఉన్న ప్రతిభ(Talent) వేగంగా బయటి ప్రపంచానికి ఈజీగా తెలిసే అవకాశం కలుగుతోంది. ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తులను ప్రపంచానికి పరిచయం చేసే పనిని కూడా ఈ ఇంటర్నెట్ ప్రపంచం చేస్తుంది. రాత్రికి రాత్రే చాలా మందిని స్టార్‌ని చేస్తుంది. అలాంటి మరో వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆవు పేడతో(Cow Dung) ఓ మహిళ గోడపై పిడకలు కొడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్(Viral) అవుతోంది. గోడ ఎత్తులో ఉన్నప్పటికీ చాలా ఈజీగా వరుస క్రమంలో అతికేలా పేడ ముద్దలను విసురుతున్న మహిళను చూపి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

    ఆ మహిళ ఉన్న చోటు నుంచి చాలా పైకి విసరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గోడకు పైకి ఆమె వేసే పచ్చి పిడకలు ఒక ఫ్లోలో వెల్లి పడుతున్నాయి. ఆమె విసిరిన విసురుడికి పైనుంచి కిందకు వరుసగా పేడ ముద్దలు అతుక్కుంటుండం చూసి వావ్ అంటున్నారు నెటిజన్లు. ఆమె నైపుణ్యన్ని చూసి నెటిజన్లు ఆహా అంటూ కామెంట్లు రూపంలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా,ఇండియన్ బాస్కెట్ బాల్ టీమ్ ఈమె కోసం వెతుకుతోంది అనే క్యాప్షన్ తో ఛత్తీస్ గఢ్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్,లైక్ లు వస్తున్నాయి. ఈ వీడియో ద్వారా ఆవు పిడకలు తయారు చేయడం అంత ఈజీ కాదనే విషయం అందరికీ సులభంగా అర్థమవుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా..భారత్ లో టాలెంట్ కు కొదవే లేదు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రోత్సాహం, వనరుల కొరత కారణంగా గ్రామాల్లో ఇలాంటి ప్రతిభావంతులు అలాగే ఉండిపోతున్నారని... వారికి సరైన శిక్షణ ఇస్తే వారు కూడా ఎవరికీ తక్కువ కాదని నిరూపించుకుంటారని మరికొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.





    Pigeon Travel To USA : 6వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ అమెరికా వెళ్లిన పావురం

    అమెరికాలో కూడా 
    నిజానికి ఆవు పిడకల తయారీ చాలా ఏళ్లుగా జరుగుతోంది. నేటికీ, గ్రామీణ ప్రాంతాల్లో లేదా గోవుల పెంపకం ఉన్న చోట ఆవు పేడను విసిరే బదులు, దానిని అదే విధంగా గుండ్రంగా లేదా పొడవుగా తయారు చేస్తారు, దానిని ఎండబెట్టి, ఒక రకమైన ఇంధనంగా ఉపయోగిస్తారు. ఆవు పేడను చాలా చోట్ల కంద మరియు గోయితా అని కూడా పిలుస్తారు. ఇది గ్రామానికి అత్యంత ముఖ్యమైన ఇంధనం. కొన్ని గ్రామాల్లోని ఇళ్లలో వీటిపైనే ఆహారం వండుతారు. యాగం, హవనం వంటి పనుల్లో వీటిని వాడుతారు. ఈ ఆవు పిడకలకు ఆన్ లైన్ లో,అమెరికాలో కూడా డిమాండ్ ఉందండోయ్. చాలామంది భారత్ నుంచి అమెరికాకు వెళ్లేటప్పుడు ఆవు పిడకలు కూడా తీసుకెళ్తుంటారు.
    Published by:Venkaiah Naidu
    First published:

    Tags: Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు