ఆకాశం నుంచి పడిన ఉల్క... ఏలియన్స్ మాస్క్ అంటూ నెటిజన్ల జోక్స్...

ఓ భారీ రాయి... ఆకాశం నుంచి పడటంతో... స్థానికులు ఆశ్చర్యపోయారు. "వార్నీ... ఇదెక్కడి నుంచి వచ్చింది... తలపై పడి ఉంటే... ఇంకేమన్నా ఉందా" అని అనుకున్నారు.

news18-telugu
Updated: June 22, 2020, 6:10 AM IST
ఆకాశం నుంచి పడిన ఉల్క... ఏలియన్స్ మాస్క్ అంటూ నెటిజన్ల జోక్స్...
ఆకాశం నుంచి పడిన ఉల్క... ఏలియన్స్ మాస్క్ అంటూ నెటిజన్ల జోక్స్... (credit - twitter)
  • Share this:
మన అంతరిక్షం అద్భుతమైనది. అక్కడి నుంచి మంచు పడుతుంది, వర్షం పడుతుంది... చేపలు పడతాయి... అప్పుడప్పుడూ ఉల్కలూ పడతాయి. అది రాజస్థాన్‌లోని జలోర్ జిల్లా... సంచోర్ పట్టణం. శుక్రవారం ఉదయం... 7 గంటల సమయం. ప్రజలు అప్పుడప్పుడే మాస్కులతో బయటకు వస్తున్నారు. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు. ఇంతలో దబ్ మని పెద్ద శబ్దం వచ్చింది. రెండు కిలోమీటర్ల దూరం వరకూ వినిపించింది. ఎవరైనా ఏదైనా బాంబు పేల్చారేమో అనుకున్నారు. తీరా చూస్తే... నేలపై ఓ గొయ్యి ఏర్పడింది. అడుగు లోతు ఉంది. ఏంటా అని లోపలికి చూశారు. లోపల ఓ పెద్ద వింత రాయి కనిపించింది. అది పై నుంచి పడింది... నేను చూశాను అన్నాడొకతను. అవునా... ఇంకా నయం... అది నా నెత్తిపై పడలేదు... చచ్చేవాణ్ని అన్నాడు ఇంకొకతను. అలా అక్కడున్నవారంతా... దాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.


పకోడీలా వేడివేడిగా ఉన్న ఆ రాయిని అక్కడి ఓ షాపులో బరువు తూచారు. 2.8 కేజీలుంది. పెద్దరాయే... కోడి కంటే బరువైనదే అన్నాడొకతను. ఎవరో పోలీసులకు విషయం చెప్పారు. అంతే పోలీసులు వెంటనే వచ్చేశారు. ఊ ఊ... దూరం దూరం... అంటూ ప్రజలను పక్కకు జరిపేసి... ఆ వేడి రాయిని... గుడ్డతో... ఓ జార్‌లో వేసి... పోలీస్ స్టేషన్‌కి పట్టుకుపోయారు.


అది ఉల్కలా అనిపిస్తోంది. మేం దర్యాప్తు చేస్తున్నాం. దాన్ని స్వాధీనం చేసుకున్నాం. సేఫ్‌గా ఉంచాం. దాన్ని ల్యాబ్‌కి పంపి పరీక్షలు చేయిస్తాం అన్నారు పోలీసులు. అనడమే కాదు... సంచోరర్‌లోని ఓ ప్రైవేట్ ల్యాబ్‌కి పంపారు కూడా. ఆ ల్యాబ్ శాస్త్రవేత్తలు దాన్ని పరిశీలించి... "ఇదో ఉల్క. ఇందులో చాలా ఖనిజాలు ఉన్నాయి. అంటే... జెర్మానియం, ప్లాటినం, నికెల్, ఇనుము ఉన్నాయి" అని చెప్పారు. భారత జియాగ్రాఫికల్ సర్వే వారు దీనిపై ఆరా తీశారు. ప్రస్తుతం ఆ రాయి సంచోర్ పోలీస్ స్టేషన్‌లో చల్లారిపోయి ఉంది.





2020లో ఎన్నో ఆశ్చర్యాల్లో ఇది ఒకటి అని నెటిజన్లు కామెంట్ చేశారు. పీకే2 మన భూమికి వచ్చింది అని ఓ నెటిజన్ జోక్ చేశారు. ఏలియన్స్ వచ్చారు. అది వాళ్ల మాస్కే అని మరో నెటిజన్ అన్నారు.
First published: June 22, 2020, 6:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading