Meteorite on Earth : అది అమెరికా లోని ఉత్తర కాలిఫోర్నియా. రాత్రి సమయం. ఆకాశం చీకటిగా ఉంది. అంతలో.. ఆకాశం నుంచి.. వెలుగుతూ ఒకటి (fireball) భూమివైపు వచ్చింది. క్షణాల్లో అది భూమిని తాకింది. ఆ సమయంలో.. భారీ కాంతి ప్రసరించింది. ఆ దృశ్యాన్ని చాలా మంది చూశారు. రోడ్లపై కార్లలో వెళ్తున్న వారు చూసి ఆశ్చర్యపోయారు. కార్లలోని కెమెరాలు ఆ దృశ్యాన్ని రికార్డ్ చేశాయి. ఆ దృశ్యాల వీడియోలు (viral videos) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫైర్ బాల్ ఎక్కడ పడింది? అదేంటి అనే ప్రశ్నకు ఓ రైతు సమాధానం చెప్పాడు.
అదో ఉల్క. ఆకాశంలో తోకచుక్క నుంచి విడిపోయి.. భూ వాతావరణంలోకి వచ్చి... ఓ రైతు ఇంటిపై పడింది. మండే ఆ బండరాయి పడటంతో అతని ఇల్లు ధ్వంసమైంది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యాయి.
డస్టిన్ ప్రోసిటా అనే రైతు దీనిపై కొంత వివరణ ఇచ్చాడు. ఏమన్నాడంటే.. "భారీ పేలుడు శబ్దం వినిపించింది. పొగ వాసన రావడం మొదలైంది. ఇంట్లోంచీ బయటకు వచ్చి చూశాను. ఇల్లు కాలిపోతూ కనిపించింది. వెంటనే మంటల్ని ఆర్పాను" అని అతను తెలిపాడు. ఆ రైతుకు కాలిఫోర్నియాలోని నెవాడాలో పొలం ఉంది.
Anyone else just see this crazy flash light up the sky? Captured by my dashcam in El Dorado Hills, CA. pic.twitter.com/4BlzOB5ISD
— Derek Schnell (@DerekKCRA) November 5, 2022
నిజానికి తన ఇంటిపై ఉల్క పడిందనే విషయం ఆ రైతుకి తెలియదు. అది అగ్ని ప్రమాదం అనుకున్నాడు. కానీ ప్రజలు ఈ తోకచుక్క విషయం చెప్పడంతో.. అసలు విషయం అతనికి తెలిసింది. ఇలా ఆకాశం నుంచి ఓ రాయి మండే అగ్నిగోళంలా వచ్చి.. అతని ఇంటిపై పడిందనే విషయం తెలిసి షాక్ అయ్యాడు.
Memes : తాజా మీమ్స్ .. ట్రెండీ ట్రోల్స్ .. వాళ్లను టార్గెట్ చేశారుగా..
ఈ ఘటనపై స్థానిక అధికారులు స్పందించారు. ఎలా జరిగిందో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదృష్టం కొద్దీ ఈ ఘటనలో ఎవరికీ ఏ హానీ కలగలేదు. కానీ రైతు ఇల్లు కొంతవరకూ దెబ్బతింది.
నాసా స్పందన :
ఈ ఘటనపై అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా (NASA) స్పందించింది. ఇవి సదరన్ టారిడ్స్ ఉల్కాపాతం (southern taurids meteor shower 2022)గా తెలిపింది. ఈ ఉల్కలు.. సెప్టెంబర్ నుంచి పడుతున్నాయి. నవంబర్లో వీటి జోరు పెరిగింది. మన దేశంలో ఇలా జరిగే సందర్భాలు చాలా తక్కువ. విదేశాల్లో మాత్రం తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఇదో పీడకల లాంటిదే. ఎప్పుడు ఏమవుతుందో ఊహించడం కష్టమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.