Mercedes India CEO Travells in Auto : అత్యంత ఖరీదైన కార్లు తయారు చేసే కంపెనీ మెర్సిడెజ్ బెంజ్ ఇండియా(Mercedes Benz India)సీఈవో మార్టిన్ ష్వెంక్ కి ఇండియాలో వింత అనుభవం ఎదురైంది. పుణెలో ఖరీదైన తన కారులో ప్రయాణిస్తున్న ఆయనకు అక్కడి ట్రాఫిక్ చుక్కలు చూపించింది. ట్రాఫిక్ సమస్య కారణంగా ఆయన తన కారుని వదిలి ఓ కిలోమీటరు నడిచి వెళ్లి తర్వాత అందుబాటులో ఉన్న ఓ ఆటో రిక్షిసాధారణ ప్రయాణికుడిలా ఆటోలో గమ్యస్థానానికి చేరుకున్నాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఫొటోను ఆయన తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.
సెప్టెంబర్ నెలాఖరున రాత్రి సమయంలో పూణేలో తన ఎస్ క్లాస్ కారులో మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈవో మార్టిన్ ష్వెంక్ ప్రయాణిస్తున్నారు. అయితే తేలికపాటి వర్షం కురుస్తోంది. ఇదే సమయంలో ఆయన ప్రయాణిస్తున్న రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమయం గడుస్తున్నా ట్రాఫిక్ క్లియర్ కాలేదు. దీంతో ఇలాగే అయితే తెల్లారిపోతుందని భావించిన మార్టిన్..కారు దిగి ఓ కిలోమీటరు నడుచుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత ఓ ఆటో ఎక్కి గమ్యస్థానానికి చేరుకున్నాడు. తర్వాత తనకెదురైన వింత అనుభవాన్ని ఫోటోలతో సహా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దాంతో పాటు అద్భుతమైన పుణె రోడ్లపై మీ ఎస్ క్లాస్ కారు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే మీరు ఏం చేస్తారు? కారు దిగి కిలోమీటర్ దూరం నడిచి ఆటో ఎక్కుతారా? అని కామెంట్ చేశాడు. ఇది కాస్తా వైరల్ అవడంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. అట్లుందటి ఇండియాలో అని, ఆటో డ్రైవరు మీటరు మార్చలేదా? అని, నెటిజన్లు ఫన్నీగా స్పందించారు.
Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రకు 30 రోజులు..జోరు వర్షంలోనూ తగ్గని రాహుల్ హుషారు
2006లో మెర్సిడెస్ బెంజ్‌లో జాయిన అయిన మార్టిన్.. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 2018 వరకు మెర్సిడెస్ బెంజ్ చైనా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పని చేశారు. 2018 నుంచి బెంజ్ కంపెనీ సీఈవోగా కొనసాగుతున్నారు. భారతదేశంలో మెర్సిడెస్ తన లగ్జరీ కార్ల అమ్మకాలను పెంచడానికి కొత్త రిచ్ క్లాస్‌పై దృష్టి సారిస్తోంది. భవిష్యత్తులో కార్ల వినియోగంలో గణనీయమైన మార్పును తీసుకురానున్నట్లు మార్టిన్ తెలిపారు. దేశంలో మిలియనీర్ల సంఖ్య విస్తరిస్తున్నందున అమ్మకాలలో వేగవంతమైన వృద్ధికి కారణమవుతోందని మార్టిన్ ఏప్రిల్ లో అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mercedes-Benz, Pune