HOME »NEWS »TRENDING »mercedes benz bursts into flames after burnout goes wrong in australia hsn gh

Car burnout viral video: విఫలమైన కారు బర్నవుట్ స్టంట్... మంటల్లో కాలిపోయిన బెంజ్ కారు

Car burnout viral video: విఫలమైన కారు బర్నవుట్ స్టంట్... మంటల్లో కాలిపోయిన బెంజ్ కారు
మెర్సిడెస్ బెంజ్ కారు కాలిపోతున్న దృశ్యం

సిడ్నీలోని చెస్టర్ హిల్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈ బెంజ్ కారుతో రోడ్డుమీదకు వచ్చాడు. బర్న్‌అవుట్ సెషన్ విఫలమవ్వడంతో లక్ష డాలర్ల విలువైన కారు కాలిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

  • Share this:
మెర్సిడెస్ బెంజ్ కారుతో స్టంట్స్ చేద్దామనుకున్న వ్యక్తికి అనుకోని అనుభవం ఎదురైంది. విలువైన తన లగ్జరీ కారును ప్రజలకు చూపించాలనుకున్న అతడి ప్రయత్నం విఫలమైంది. బర్నౌట్ ఫీట్‌లో విలువైన మెర్సిడెజ్ బెంజ్ ఏఎమ్‌జీ సీ63ఎస్ (Mercedes Benz AMG C63S) కారు మంటల్లో చిక్కుకున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ప్రమాదంలో కారు ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించాయి. విషయం బయటకు రావడంతో రోడ్డుమీద యాక్సిడెంట్ జరిగిందని కారు యజమాని పోలీసులకు చెప్పాడు. కానీ ఆ వ్యక్తి కావాలనే స్టంట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. సిడ్నీలోని చెస్టర్ హిల్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈ బెంజ్ కారుతో రోడ్డుమీదకు వచ్చాడు. బర్న్‌అవుట్ సెషన్ విఫలమవ్వడంతో లక్ష డాలర్ల విలువైన కారు కాలిపోయింది. కానీ కారులో ఉన్నవారు ప్రమాదం లేకుండా బయటపడగలిగారు.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కానీ అప్పటికే కారు మొత్తం కాలిపోయింది. ముందు పోలీసులు ఇది యాక్సిడెంట్‌అనే భావించారు. కానీ కారుతో బర్నింగ్ స్టంట్ చేసిన వీడియోను ఎవరో ఫేస్‌బుక్‌లో పెట్టడంతో, దీని గురించి పోలీసులకు తెలిసింది. కారులో కూర్చున్న వ్యక్తులు తీసిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





వీడియోలో ఏముందంటే..
కారు ఇంజిన్‌పై భారం పడేలా బర్న్‌అవుట్ స్టంట్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. కొన్ని సెకన్ల తరువాత కారు వెనుక నుంచి పొగ, మంటలు వ్యాపించాయి. దీంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు వెంటనే బయటకు వచ్చారు. కారు మాత్రం మంటల్లో పూర్తిగా కాలిపోయింది. తమ లగ్జరీ కారును చూస్తున్న కొంతమంది వ్యక్తుల ముందు ఈ స్టంట్ చేసేందుకు ప్రయత్నించామని దాని యజమాని జీన్ పెర్రి తెలిపాడు. గత సంవత్సరం రఫ్లే అనే ఒక గ్యాంబ్లింగ్ పోటీల్లో ఈ కారును అతడు గెల్చుకున్నాడు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో పాటు ప్రమాదానికి కారణమైనందుకు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Published by:Hasaan Kandula
First published:January 23, 2021, 13:42 IST

टॉप स्टोरीज