హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

No Shave November: నో షేవ్ నవంబర్ చాలెంజ్.. ట్రెండ్ కోసం కాదు ఫండ్ కోసం

No Shave November: నో షేవ్ నవంబర్ చాలెంజ్.. ట్రెండ్ కోసం కాదు ఫండ్ కోసం

ప్రతీకాత్మక చిత్రం (Image: @IrfanHaizar/Twitter)

ప్రతీకాత్మక చిత్రం (Image: @IrfanHaizar/Twitter)

నయా ట్రెండ్ ను ఫాలో అవుతూ నయా లుక్ లో కనిపించే ఛాన్స్ ఇచ్చే నో షేవ్ నవంబర్ పై కుర్రాళ్లకు కాస్త క్రేజ్ ఎక్కువే మరి. తమ మీసాలు (moustache), గడ్డాలను (beard) ట్రిమ్ (shaving)చేసుకోకుండా సగర్వంగా చూపుకోవడం పెద్ద సవాలు.

నవంబరు మాసమంటే చాలామంది పురుషులకు ఇటీవలి కాలంలో అత్యంత ఇష్టమైన నెలగా మారింది. నయా ట్రెండ్ ను ఫాలో అవుతూ నయా లుక్ లో కనిపించే ఛాన్స్ ఇచ్చే నో షేవ్ నవంబర్ పై కుర్రాళ్లకు కాస్త క్రేజ్ ఎక్కువే మరి. తమ మీసాలు (moustache), గడ్డాలను (beard) ట్రిమ్ (shaving)చేసుకోకుండా సగర్వంగా చూపుకోవడం పెద్ద సవాలు. ఈ సవాలును అంగీకరించేది ఏదో ట్రెండ్ కోసం మాత్రం కాదు కానీ ఫండ్ కోసం (trend for fund). ఆశ్చర్యంగా ఉన్నా ఇది ఓ పెద్ద ఉద్యమం. ఆసక్తికరంగా ఉన్న ఆ విషయాలు మీకోసం ప్రత్యేకంగా.

నవంబర్ చాలెంజ్

కోవిడ్ కారణంగా ఇప్పుడెలాగూ వర్క్ ఫ్రం హోమ్ నడుస్తోంది కనుక ఈ ఏడాది నో షేవ్ నవంబర్ చాలెంజ్ లో పాల్గొనేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వైల్డ్ గా కనిపించే అవకాశం కావాలంటే నవంబర్ లో వచ్చే ఈ సవాలును స్వీకరించాల్సిందే. రగడ్ లుక్ లో సెల్ఫీలు, కొత్త మేకోవర్ లో మ్యాన్లీగా కనపబడేందుకు ఈ ఏడాది పోటీ మామూలుగా లేదు.

నెట్ లో నవంబర్ సందడి

'మువెంబర్' (November )గా ఈ 'నో షేవ్ మంత్' (no shave november )ను పిలుస్తారు. ఇందులో భాగంగా ఈనెలంతా స్వచ్ఛందంగా షేవింగ్ చేసుకోకుండా అలాగే ఉండిపోతారు. అంటే డిసెంబర్ 1వ తేదీవరకూ ఇంతేనన్నమాట. కేవలం 16 ఏళ్లలో ఈ ఉద్యమం మారుమూల గ్రామాలకు కూడా విస్తరించిందంటే అందుకు కారణం సోషల్ మీడియా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా వాట్సాప్ వచ్చాక మరింత వైరల్ గా మారింది. కాలేజీ కుర్రాళ్లు మొదలు సీనియర్ సిటిజెన్స్ వరకూ ఈనెలంతా గ్రూమింగ్ కు గుడ్ బై (goodbye to grooming) చెప్పి హ్యాపీగా గడిపేస్తారు.

క్యాన్సర్ పై అవగాహన కోసమే..

అసలు ఈ 'మువెంబర్' ఎలా మొదలైందంటే ఏదో సోషల్ మీడియా ట్రెండ్, సోషల్ మీడియా ఫన్ అనుకుంటే మీరు పొరబడ్డట్టే. 2004 లో ప్రారంభమైన ఈ ఉద్యమం నిజానికి పురుషుల్లో క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు ఉద్దేశించింది. ఆస్ట్రేలియాలోని 'మువంబర్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో ఇది ప్రారంభమై దేశవిదేశాల్లో ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రొస్టేట్ క్యాన్సర్ (Prostate cancer), టెస్టిక్యులర్ క్యాన్సర్ కారణంగా ఏటా ఎంతోమంది మగవారు (men) ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇక క్యాన్సర్ పేషంట్లు అనగానే చికిత్సలో భాగంగా వారికి జుట్టు విపరీతంగా రాలిపోతుంది కనుక ఈ మాసంలో జుట్టు, మీసాలు కత్తిరించకూడదని నియమం విధించారు.

అంతేకాదు నెలంతా షేవింగ్, హెయిర్ కట్, గ్రూమింగ్ కు అయ్యే ఖర్చును ఫౌండేషన్ కు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ దీనికయ్యే ఖర్చెంత అని తక్కువ అంచనా వేయకండి ఎందుకంటే గ్రూమింగ్ మెటీరియల్ అయిన రేజర్స్, బ్లేడ్స్, షేవింగ్ క్రీం, ఆఫ్టర్ షేవింగ్ లోషన్, మీసాలు, గడ్డాలు ట్రిమ్ చేయించుకునేందుకు అయ్యే ఖర్చు, సెలూన్ కు చెల్లించే మొత్తం ఇలాంటివి అన్నీ కలుపుకుంటే చాలానే అవుతుంది. ఇలా పురుషులంతా తలా ఓ చెయ్యి వేస్తే, అది కూడా ప్రపంచవ్యాప్తంగా మగవారి చేతులన్నీ కలిస్తే ఎంత పెద్ద మొత్తం అవుతుందో ఊహించగలరా?

మెల్ బోర్న్ లో మువెంబర్ మెరుపులు..

'మువెంబర్' మెరుపులు మొదట మొదలైంది మెల్ బోర్న్ మహానగరంలో. ఇద్దరు స్నేహితులు కలిసినప్పుడు వారి మాటల్లోంచి పుట్టిన ఈ ఆలోచన ఆతరువాతి కాలంలో ఓ ఫినామినాగా మారిపోయింది. ఇక నోషేవ్ నవంబర్ అంటూ నెట్లో చక్కర్లో కొడుతున్న హ్యాష్ ట్యాగ్ ఉద్యమం ఇప్పుడు గ్రామాలకు కూడా పాకడం విశేషం. సాధారణంగా పురుషులకు ఆరోగ్యంపై ( mens health) పెద్దగా ఆసక్తి ఉండదు, వారు బిజీ రొటీన్ గడపడం కూడా దీనికి కారణం. అయితే నవంబరు నెల రాగానే తమ ఆరోగ్యంపై కనీస దృష్టి నిలిపేలా చేస్తున్న ఈ ఉద్యమం మగవారి మంచికోసమే.

First published:

Tags: Cancer, Trending

ఉత్తమ కథలు