భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్పదనం. మన దేశంలో ఎన్నో భాషలు, ఎన్నో మతాలు ఉంటాయి. అయినప్పటికీ ప్రజలంతా కలిసిమెలిసి ఉంటారు. దైవ కార్యకలాపాల్లో అందరూ కలిసి పాల్గొంటారు. అయోధ్య రామాలయ నిర్మాణం విషయంలో... ముస్లింలు కూడా సుప్రీంకోర్టు తీర్పును గౌరవించారు. తద్వారా భారతదేశంలో మత సామరస్యాన్ని చాటిచెప్పారు. తాజాగా.. ఒడిశాలో జరిగిన శ్రీరామనవమి శోభాయాత్రలో ముస్లింలు కూడా పాల్గొన్నారు.
ఒడిశాలోని భద్రక్ ఏరియాలో ఈ శోభాయాత్ర జరిగింది. ఇందులో రామభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐతే.. ఇందులో ముస్లింలు కూడా పాల్గొనడంతో.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. "శోభా యాత్రకు స్వాగతం పలికేందుకు ఇక్కడికి వచ్చాం. అందరికీ రామ నవమి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఉన్నారు. మేము ఇక్కడ అందరం కలిసి ఇది జరుపుకుంటున్నాము" అని భద్రక్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ గుల్మాకి దలావ్జీ హబీబ్ తెలిపారు.
ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)
#WATCH | Showcasing communal harmony, members of the Muslim community participated in the #RamNavmi procession in Bhadrak area of Odisha pic.twitter.com/gWZ5wkiCiz
— ANI (@ANI) March 30, 2023
ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. "మత సామరస్యం, భిన్నత్వంలో ఏకత్వం అనేవి భారతదేశ శాశ్వత అంశాలు. భారతదేశం కులం, మతం, జాతి, మతం, భాషలతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడికి చెందినది" అని ఓ యూజర్ కామెంట్ ఇచ్చారు.
ఈ వీడియోని కొందరు నెటిజన్లు తప్పు పడుతున్నారు. "మోసపోవద్దు. వారు మీకు హింసను చూపించరు.. రంజాన్ జరుపుకునే హిందువులను వారు చూపించరు" అని ఓ యూజర్ కామెంట్ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Srirama navami