Home /News /trending /

MAA Elections: ‘మా’ ఎన్నికల ఫలితాల అనంతరం మెగా బ్రదర్​ నాగబాబు సంచలన నిర్ణయం.. ప్రాంతీయవాదం ఉన్న మాలో ఉండలేనంటూ..

MAA Elections: ‘మా’ ఎన్నికల ఫలితాల అనంతరం మెగా బ్రదర్​ నాగబాబు సంచలన నిర్ణయం.. ప్రాంతీయవాదం ఉన్న మాలో ఉండలేనంటూ..

ప్రకాశ్​రాజ్​తో నాగబాబు (ఫైల్​)

ప్రకాశ్​రాజ్​తో నాగబాబు (ఫైల్​)

మా ఎన్నికలు పూర్తయ్యాయి. ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ఘనవిజయాన్ని సొంతంచేసుకున్నారు. అయితే ప్రకాశ్​రాజ్​ ప్యానెల్​కు మద్దతు తెలిపిన నటుడు, మెగా బ్రదర్​ నాగబాబు (naga babu) సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మా (MAA) ఎలక్షన్లు గత కొద్దిరోజులుగా టాలీవుడ్ (Tollywood)​నే కాదు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేశాయి. జనరల్‌ ఎలక్షన్స్‌ మించి సభ్యుల మధ్య మాటలయుద్ధం..అదంతా ఇప్పుడు ముగిసింది. మా ఎన్నికలు పూర్తయ్యాయి. ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు (Manchu Vishnu) ఘనవిజయాన్ని సొంతంచేసుకున్నారు. అయితే ప్రకాశ్​రాజ్​ ప్యానెల్​కు మద్దతు తెలిపిన నటుడు, మెగా బ్రదర్​ నాగబాబు (Naga babu) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎన్నికల హడావిడి మొదలైన దగ్గర నుంచి నాగబాబు ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ (Prakash Raju) ఓడిపోవడంతో నాగబాబు మా (MAA) ప్రాథమిక సభ్యత్వానికి (Primary membership) రాజీనామా చేశారు. నాగబాబు మా కు రాజీనామా చేస్తున్న విషయాన్నీ సోషల్ మీడియా (Social media) ద్వారా తెలిపారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్ (Twitter) లో ఓ పోస్ట్ పెట్టారు.’ ప్రాంతీయ వాదం ,  సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్లో “నా” ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను… సెలవు. – నాగబాబు’ అంటూ నాగబాబు రాసుకొచ్చారు. అలాగే నేడు సాయంత్రం 7 గంటలకు సోషల్ మీడియా (Social media) ద్వారా ప్రజల ముందుకు వస్తానన్నారు.  ప్రశ్నలు ఏమైనా ఉంటే అక్కడ అడగాలని ఆయన కోరారు . అభిమానులు, ప్రేక్షకుల అడిగే ప్రశ్నలకు నాగబాబు ఎలాంటి సమాధానాలు చెప్తారో అందరూ వేచి చూడక తప్పదు మరి.



ఉత్కంఠ రేకెత్తించిన ఎన్నికలు..

మా ఎన్నికలు (MAA Elections) జరుగుతున్న తీరు చూసిన తర్వాత ఎవరు గెలుస్తారు అనే విషయంపై చాలా సేపటి వరకు ఉత్కంఠ అయితే కొనసాగింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్, విష్ణు ప్యానెల్స్ మధ్య చాలా రసవత్తరమైన పోరు జరిగింది. చివరి వరకు ఎవరు గెలుస్తారనే విషయంపై క్లారిటీ అయితే రాలేదు. మరీ ముఖ్యంగా ఎగ్జిగ్యూటివ్ మెంబర్స్ (Executive members) విషయంలో మాత్రం ప్రకాష్ రాజ్ ప్యానెల్ ముందుకు దూసుకుపోయింది. 18 మంది పోటీ చేసిన ఈసీ మెంబర్స్‌లో 11 మంది ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందారు. ఈసీ మెంబర్స్ (EC members) విషయంలో సభ్యులు ప్రకాష్ రాజ్‌ను నమ్మారు కానీ ప్రధానమైన పోటీ (competition)లో మాత్రం అతడి వెంట నడవలేకపోయారు. ప్రకాష్ ప్యానెల్‌లో ఉన్న అనసూయ, కౌశిక్, శివా రెడ్డి లాంటి వాళ్లు విజయం సాధించారు. మరోవైపు విష్ణు ప్యానెల్ నుంచి కేవలం 7 గురు సభ్యులు మాత్రమే ఈసీ మెంబర్స్‌గా గెలిచారు.

ఇక  మా  అధ్యక్ష ఎన్నికల్లో ( MAA president elections) మంచు విష్ణు కు 381 ఓట్లు నమోదు కాగా.. ప్రకాష్ రాజ్  274 ఓట్లు సంపాదించారు. ఈ హోరాహోరీ పోరులో విష్ణు 103 ఓట్ల మెజారిటీతో ప్రకాష్ రాజ్ పై విజయం సాధించారు. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్‌కు సంబంధించిన వారే విజయం సాధించారు. శ్రీకాంత్ ఒక్కడే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానల్‌ నుంచి గెలుపొందారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Cinema, Mega Family, Naga Babu Konidela, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు