హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral News : పిట్ట కొంచెం..కూత ఘనం..మూడేళ్లకే ఎన్నో రికార్డులు..

Viral News : పిట్ట కొంచెం..కూత ఘనం..మూడేళ్లకే ఎన్నో రికార్డులు..

Photo Credit : News 18 Bengal

Photo Credit : News 18 Bengal

Viral News : పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెతకు నిలువెత్తు నిదర్శనం ఈ చిన్నారి. మూడేళ్లకే ఎన్నో రికార్డులు సాధించి వారెవ్వా అన్పించింది. అసలు ఈ చిన్నారి ప్రత్యేకత ఏంటి..? అసలు సాధించిన రికార్డులేంటో ఓ లుక్కేద్దాం.

సాధారణంగా మూడేళ్ల పిల్లలంటే అప్పుడప్పుడే స్కూల్ కి వెళ్తూ చిలక పలుకుల్లా చిన్న చిన్న పద్యాలు చెబుతూ ఆకట్టుకుంటుంటారు. అయితే చాలామంది పిల్లలకు మహా అయితే ఒకటో రెండో మరీ ఎక్కువైతే ఓ పదో పద్యాలు వస్తుంటాయి. కానీ పశ్చిమ బెంగాల్ కి చెందిన ఈ మూడేళ్ల అమ్మాయి మాత్రం 50 కి పైగా పద్యాలు చెబుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. అంతే కాదు.. ఇరవై కి పైగా పాటలను కూడా పాడడం ఈ చిన్నారి ప్రత్యేకత.పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా కి చెందిన అరాత్రిక ఘోష్ అనే మూడున్నరేళ్ల చిన్నారి తాజాగా రికార్డులు కొల్లగొట్టింది. బెంగాలీ, ఇంగ్లిష్, హిందీ భాషల్లో యాభై పద్యాలు గుక్క తిప్పుకోకుండా చెప్పి అందరినీ ఆకర్షించింది. కేవలం పద్యాలు చెప్పడమే కాదు.. అరాత్రిక ఉచ్ఛారణ కూడా సరిగ్గా ఉండడంతో అందరూ ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ పద్యాలతో పాటు రవీంద్ర సంగీత్, ఫోక్ మ్యూజిక్, భక్తి పాటలు, సినిమా పాటల్లాంటివి కూడా పాడింది. సుమారు 20 పాటలు పాడి ఆకట్టుకుంది. ఆమె చేసిన ఈ ప్రదర్శనకు గాను తన పేరును ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్ధానం సంపాదించుకుందీ చిన్నారి.

మే 15న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు అరాత్రిక కు తమ బుక్ లో స్థానాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారని జూన్ 19న వారు తమ ఇంటికి వచ్చి అవార్డ్, సర్టిఫికెట్ ని అందించారని అరాత్రిక కుటుంబ సభ్యులు వెల్లడించారు. వీటిలో భాగంగా గోల్డ్ మెడల్, ఓ అందమైన పెన్, సర్టిఫికెట్, మరికొన్ని స్టిక్కర్ ఉన్న బహుమతిని అరాత్రిక కు అందించారట.

అరాత్రిక ఇంత చిన్న వయసులోనే ఇన్ని పద్యాలు నేర్చుకోవడానికి కారణం ఆమె తండ్రి శుభాంకర్ ఘెష్. ఆయన స్థానికంగా ఉన్న చంద్రకోణ జిరాత్ హై స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నారు. అరాత్రిక తల్లి తనుశ్రీ ఘెష్ కూడా ఇంటి బాధ్యతలన్నీ నిర్వహిస్తూనే తన కూతురికి కొత్త కొత్త పద్యాలు నేర్పించేదట. రెండు సంవత్సరాల నుంచే అరాత్రికకి చక్కటి మెమరీ ఉండడం గమనించామని ఆమె తల్లిదండ్రులు వెల్లడించారు.. ఒక్కసారి చూసిన బంధువులను కూడా బాగా గుర్తించేదని.. ఇలాంటి మరికొన్ని సంఘటనల వల్ల తన మెమరీ చాలా ఎక్కువగా ఉందని గుర్తించామని వారు తెలిపారు. అందుకే చిన్న వయసులోనే తనకు కొత్త విషయాలు నేర్పిస్తూ తనకు పద్యాలు, పాటలు నేర్పామని అందుకే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని రెండేళ్ల వయసు నుంచే అవార్డులు సాధించడం ప్రారంభించిందని ఆమె తల్లిదండ్రులు వెల్లడించారు.అరాత్రిక ప్రస్తుతం కిడ్ జీ స్కూల్ లో ఎల్ కేజీ చదువుతోంది. అయితే కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటుండడం వల్ల తన తల్లి నుంచే చాలా విషయాలు నేర్చుకుంటోందట. ఆమె తల్లిదండ్రులు ఆమెకు పద్యాలు, పాటలు నేర్పుతూ ఆమెను బిజీగా ఉంచుతున్నారట. అరాత్రిక ప్రస్తుతం సాధించిన ఈ ఘనతను చూసి ఆమె తల్లిదండ్రులు, తాత, నానమ్మ ఎంతో గర్వపడుతున్నారట.

First published:

Tags: Trending, VIRAL NEWS

ఉత్తమ కథలు