• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • MEET TIKTOKER NICK ALEXANDER WHO HAD A RATHER HORRIBLE EXPERIENCE AT THE BEACH IN BRITAIN SRD GH

Viral News : అనుకున్నదొకటి అయినదొక్కటి..ఫెయిల్ అయిన బీచ్‌ టూర్ ప్లాన్.. పగటిపూటే చుక్కలు కన్పించాయ్..

ప్రతీకాత్మక చిత్రం

Viral News : కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడపాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇందుకోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా బీచ్‌ల వద్ద అయితే సముద్రపు తరంగాలను చూస్తూ.. నీటిలో కేరింతలు కొడుతూ.. ప్రకృతిని ఆస్వాదించాలని భావిస్తారు.

  • Share this:
కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడపాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇందుకోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా బీచ్‌ల వద్ద అయితే సముద్రపు తరంగాలను చూస్తూ.. నీటిలో కేరింతలు కొడుతూ.. ప్రకృతిని ఆస్వాదించాలని భావిస్తారు. అయితే ఇలా అనుకోవడమే తప్పయింది ఓ వ్యక్తికి. అంచనాలను తలకిందులు చేస్తూ భయానక అనుభవాన్ని మిగిల్చింది తన టూర్ ప్లాన్. నిక్ అలెగ్జాండర్ అనే టిక్ టాక్ యూజర్‌కు బ్రిటన్‌లోని ఒక బీచ్ చుక్కలు చూపించింది. సముద్రపు ఒడ్డున సరదాగా నడుచుకొని వెళ్దామని ప్లాన్ చేసుకుంటే.. ఏకంగా 20 మైళ్లు నడవాల్సిన దుస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని మియామికి చెందిన నిక్ అలెగ్జాండర్ బ్రిటన్ అందాలను చూడాలని టూర్ ప్లాన్ చేసుకున్నాడు. ముఖ్యంగా బ్రిటన్ లోని వెస్టన్ సూపర్ మరే బీచ్ లో ఎంజాయ్ చేయాలని తన గ్యాంగ్ తో ప్రణాళిక రూపొందించుకున్నాడు. అంతేకాకుండా బీచ్ లో గడిపిన క్షణాలను వీడియో డాక్యుమెంట్ రూపంలో తీసి టిక్ టాక్ లో షేర్ చేయడం ప్రారంభించాడు. అనుకున్నదే తడవుగా నిక్ తో పాటు అందరూ విశ్రాంతి గదుల నుంచి బీచ్ లోకి వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. బీచ్ లోకి సులువుగా వెళ్లొచ్చని అనుకున్న వారికి.. అసలు సముద్రం 20 మైళ్ల (32 కిలోమీటర్లు) దూరంలో ఉందని తెలిసి ముక్కున వేలేసుకున్నారు. బీచ్ ను చేరుకోవడానికి బురద, మట్టి ఉన్న దారిన ప్రయాణిస్తూ నానా అవస్థలు పడ్డారు.

ప్లాన్లు తారుమారు..
ఈ ప్రయాణాన్ని టిక్ టాక్ వీడియోల్లో పంచుకున్నాడు నిక్. మట్టి, బురదలో ప్రయాణిస్తూ తమ భయానక అనుభవాన్ని షేర్ చేశాడు. అంతేకాకుండా ఈ ప్రయాణంలో తన వాలెట్ ను కోల్పోయాడు. చివరకు ఫన్ మాట అలా ఉంచితే తన ఇతర ప్రణాళికలన్నింటినీ మార్చుకోవాల్సి వచ్చింది. తాను ఎంతో ఇబ్బంది పడ్డానని, సముద్రాన్ని చేరుకోవడానికి ఏదైనా మార్గాన్ని నిర్మించాలని వెస్టన్-సూపర్-మరే బీచ్ నిర్వాహకులకు సూచించాడు.

అయితే నిక్ భయానక అనుభవం.. నెటిజన్లకు మాత్రం ఫన్ ను మిగిల్చింది. సోషల్ మీడియాలో నిక్ అనుభవంపై విశేషంగా స్పందిస్తున్నారు. వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ వారి బాధను చూసి నవ్వకుండా ఉండలేకపోయారు. ఇది చాలా అరుదైన అనుభవమని కొందరు పోస్టులు పెట్టగా.. యూకేలోని అన్నీ బీచ్‌లు ఇలా ఉండవని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Published by:Sridhar Reddy
First published: