• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • MEET THIS TWO FATHERS WHO BUILD A MINIATURE JEEP AND MINI AUTO RICKSHAW FOR THEIR CHILDEREN VIDEO GOES VIRAL GH SRD

Viral Video : తమ పిల్లల కోసం ఈ తండ్రులు చేసిన పనికి హ్యాట్సాఫ్​ చెప్పాల్సిందే...

Viral Video : తమ పిల్లల కోసం ఈ తండ్రులు చేసిన పనికి హ్యాట్సాఫ్​ చెప్పాల్సిందే...

Photo Credit : Facebook / You Tube

Viral Video : తండ్రి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. పైకి గంభీరంగా కన్పించే తండ్రి.. తన పిల్లల కోసం ఎన్నో కష్టాలు పడతాడు. అలాంటి ఓ ఇద్దరు తండ్రులు తమ పిల్లల కోసం ఎంతో కష్టపడి..వాళ్ల ఇష్టాల్ని తీర్చారు.

  • Share this:
పిల్లలకు ఇష్టమైన బొమ్మలు కొనిస్తుంటారు తల్లిదండ్రులు. వారు ఆ బొమ్మలతో ఆడుకుంటుంటే మురిసిపోతుంటారు. అయితే, ఒక వ్యక్తి మాత్రం అందరిలా కాకుండా తన పిల్లలకు అరుదైన గిఫ్ట్​ ఇచ్చాడు. తన పిల్లలకు బొమ్మలను కొనిస్తే కిక్కేముంది అనుకున్నాడో ఏమో కానీ తానే స్వయంగా చిన్న జీపును తయారు చేసి వారికి అందజేశాడు. ఇప్పుడు ఆయన రూపొందించిన జీపు ని చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళ మలప్పురం జిల్లాకు చెందిన ఆరికోడ్ గ్రామంలో నివసించే షకీర్ తన పిల్లల కోసం ఒక చిన్న సాఫ్ట్ టాప్ మహీంద్రా జీపును తయారు చేశాడు. అతడు తయారు చేసిన జీపు వీడియోను సోషల్​ మీడియాలో షేర్​ చేయగా.. అది ఇప్పుడు వైరల్​గా మారుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పిల్లల పట్ల షకీర్​కు ఉన్న ప్రేమకు హాట్సాఫ్​ చెబుతున్నారు. అచ్చం మహీంద్రా జీప్ వలే ఉన్న ఈ జీప్ 1000 వాట్స్ మోటారుతో పనిచేస్తుందని షకీర్​ చెబుతున్నాడు. దీనిలో మాన్యువల్ గేర్‌బాక్స్, పవర్ స్టీరింగ్, డిటాచెబుల్​ సాఫ్ట్ టాప్, హెడ్‌లైట్‌ వంటి ఫీచర్లను అందించాడు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి షకీర్‌కు ఒక సంవత్సరం పట్టిందని చెప్పుకొచ్చాడు. అయితే, తాను ఈ జీపును 5-–6 సంవత్సరాల క్రితమే తయారు చేసినప్పటికీ, ఈ చిన్న జీప్​ వీడియో ఇప్పడు వైరల్ అయ్యిందని వివరించాడు. సుమారు 60- నుండి 70 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ కలిగి ఉన్న ఈ జీపు తయారు చేయడానికి దాదాపు రూ .1.5 లక్షలు ఖర్చయ్యిందని షకీర్​ తన వీడియోలో చెప్పుకొచ్చాడు.

మినీ ఆటో రిక్షాను తయారు చేసిన మరో వ్యక్తి..
గతంలో కేరళకు చెందిన మరో వ్యక్తి కూడా తన పిల్లల కోసం ఇలాగే ఒక మినీ ఆటో రిక్షాను తయారు చేశాడు. ఇడుక్కి జిల్లా ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న అరుణ్‌కుమార్ పురుషోత్తమన్​ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లల కోసం ‘సుందరి’ అనే ఆటో రిక్షాను తయారు చేసి.. ఆ వీడియోను సోషల్​ మీడియాలో షేర్​ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్​గా మారుతోంది. ఈ వీడియోలో, పురుషోత్తమన్​ కుమారుడు మాధవ్, కుమార్తె కేశినీ కృష్ణ ఆటో రిక్షాను నడుపుతుండటాన్ని మనం చూడవచ్చు. చూడచక్కగా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పిల్లలపై పురుషోత్తమన్​కు ఉన్న ప్రేమ పట్ల ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.


కాగా, ఈ ఆటో రిక్షాను రూపొందించడానికి పురుషోత్తమన్​కు 7 నెలల సమయం పట్టిందని, దీని కోసం మొత్తం రూ .15,000 ఖర్చయ్యిందని వీడియోలో తెలిపాడు. అయితే, పురుషోత్తమన్ ఇలా పిల్లల కోసం బొమ్మల తయారు చేయడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో అతను ఒక జీప్, ట్రైసైకిల్ కూడా తయారు చేశాడు. అయితే, అతని ఆవిష్కరణలకు మంచి డిమాండ్ ఏర్పడినప్పటికీ, వాటిని తన పిల్లల కోసమే తయారు చేశానని, విక్రయించడానికి సిద్ధంగా లేనని చెబుతున్నాడు. ఏదేమైనా, పిల్లల కోసం ఇలా స్వయంగా బొమ్మలు తయారు చేయడంపై నెటిజన్లు వారికి హాట్సాఫ్​ చెబుతున్నారు.
Published by:Sridhar Reddy
First published:

అగ్ర కథనాలు