హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వామ్మో.. కుడి చేతిని దశాబ్ద కాలంగా పైకి ఎత్తిపెట్టాడు.. కారణం ఏంటో తెలుసా..?

వామ్మో.. కుడి చేతిని దశాబ్ద కాలంగా పైకి ఎత్తిపెట్టాడు.. కారణం ఏంటో తెలుసా..?

చేయి పైకెత్తి పెట్టుకున్న సన్యాసి

చేయి పైకెత్తి పెట్టుకున్న సన్యాసి

Viral news: ఒక అజ్ఞాత సన్యాసి దగ్గరకు రిపోర్టర్ వెళ్లాడు. అతను అడిగిన ప్రశ్నలకు సన్యాసీ ఒపిగ్గా ఆన్సర్స్ ఇస్తున్నాడు. అయితే.. అతను తన కుడి చేతిని ఎంత సేపైన కిందకు దించడంలేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Goa, India

సాధారణంగా మనం కొందరు సాధువులు, సన్యాసులను తరచుగా చూస్తుంటాం. కొందరు వెంట్రుకలను పెంచుకుంటారు. అవి జడలు కట్టేస్తాయి. ఇంకొందరు ఒంటిపై నూలిపొగులను కూడా ఉంచుకోరు. కేవలం ఒంటిపై చితా భస్మం పూసుకుంటారు. అదే విధంగా తలకిందులుగా తపస్సు చేస్తుంటారు. ఇలాంటి వారి గురించి మనం తరచుగా వార్తలలో చూస్తునే ఉంటాం. ఇక్కడోక సన్యాసి పదేళ్లుగా చేస్తున్న పనిని చూసి రిపోర్టల్ షాక్ కు గురయ్యాడు.

పూర్తి వివరాలు.. రిపోర్టర్ ఒక అజ్ఞాత స్వామిజీకి దగ్గరకు వెళ్లాడు . ఆయన ఎంత సేపు మాట్లాడిన చేతిని మాత్రం అసలు కిందకు దించడం లేదు. దాదాపు.. పదేళ్లుగా ఇలానే చేతి పైకెత్తి పెట్టుకుంటున్నట్లు తెలిపాడు. శివుని అనుగ్రహం కోసం ఈ విధంగా చేస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే.. కుడిచేతికి ఎలాంటి స్పర్శలేదని కూడా తెలిపాడు. మొదట్లో కష్టంగా ఉండేదని కానీ ఇప్పుడు అలవాటైపోయిందని చెప్పాడు. తన జీవితాంతం చేయి పైకి ఎత్తి పెడతానని సన్యాసి చెప్పాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral news)  మారింది. ఇది ఎక్కడ జరిగిందో వివరాలులేవు.

ఇదిలా ఉండగా  తమిళనాడుకు (Tamilnadu) చెందిన ఇద్దరు స్వామిజీల మధ్య రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.

సింగపూర్ లో రాజ్ కుమార్ స్వామి, స్థానికంగా ఉండే హల్క్ స్వామీజీలు ఒక భక్తుడి ఇంట్లో పూజలు చేశారు. అంతా అయిపోయాక.. ఇద్దరి మధ్య ఎవరు గొప్ప అనే విషయంపై రచ్చ జరిగింది. దీంతో నేను గొప్ప అని.. రాజ్ కుమార్ స్వామి అంటే... కాదు కాదు.. నేనే గొప్ప అంటూ హల్క్ స్వామి రెచ్చిపోయారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

హల్క్ స్వామి ఏకంగా రాజ్ కుమార్ స్వామి మెడలోని కండువ పట్టుకుని ఆయనపై దాడిచేశారు. ఆయన చేతిలో నుంచి ఎంతో కష్టపడి రాజ్ కుమార్ స్వామి విడిపించుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య భౌతిక దాడుల వరకు వెళ్లింది. రాజ్ కుమార్ స్వామి తంజావురుకు చెందిన పుదుకొట్టై కు చెందిన రుద్ర సిద్ధర్ రాజ్ కుమార్ స్వామి స్థానికంలో ఎలాంటి సమస్యలనైన పరిష్కరిస్తారనే మంచి పేరు ఉంది. దీంతో ఆయనను సింగపూర్ కు చెందిన ఒక భక్తుడు తన తండ్రి సమస్యలను దూరం చేయాలని ఆయన ఇంటికి తీసుకెళ్లారు.

అప్పటికే అక్కడ హల్క్ స్వామీజీ కూడా ఉన్నాడు. పూజ తర్వాత.. ఇద్దరు భక్తుడిని ఆశీర్వదించాడు. ఈ క్రమంలో పూజ తర్వాత.. ఎవరు గొప్ప అనే దానిపై ఇద్దరు స్వామీజీల మధ్యరచ్చ వచ్చింది. దీంతో ఇద్దరు కూడా కొట్టుకున్నాడు. దుస్తులు లాక్కుని, మరీ కొట్టుకున్నారు. ప్రస్తుతం స్వామీజీల గొడవ సోషల్ మీడియాలో వైరల్ గా (Viral video) మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: VIRAL NEWS

ఉత్తమ కథలు