తలపై 4 గంటలు తేనెటీగలు... కేరళ వాసి ప్రతిభ... గిన్నీస్ రికార్డ్ బ్రేక్...

కొన్ని గిన్నీస్ రికార్డులు ఈజీగా బ్రేక్ చేయడానికి వీలుగా ఉంటాయి. కొన్ని మాత్రం... అసలు ఎలా నెలకొల్పారా అని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇది అలాంటిదే.

news18-telugu
Updated: June 23, 2020, 1:34 PM IST
తలపై 4 గంటలు తేనెటీగలు... కేరళ వాసి ప్రతిభ... గిన్నీస్ రికార్డ్ బ్రేక్...
తలపై 4 గంటలు తేనెటీగలు... కేరళ వాసి ప్రతిభ... గిన్నీస్ రికార్డ్ బ్రేక్... (credit -Facebook)
  • Share this:
తేనె టీగలు కనిపిస్తే చాలు చాలా మంది భయపడతారు ఎక్కడ వచ్చి కుడతాయో అని. తేనెటీగలు కుట్టి మనుషులు చనిపోయిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటిది కేరళకు చెందిన ఆ కుర్రాడికి మాత్రం... బీస్ (bees) అంటే ప్రేమ. అందువల్ల అవి అతని తలపై వాలినా వాటిని ఏమీ అనడు. అలా అవి ఏకంగా 4 గంటలకు పైగా వాలాయి. పేరు నేచర్ MS. వయసు 24. తేనెటీగల పెంపకం దారు. ఎక్కువ సేపు తలపై తేనెటీగల్ని ఉంచుకొని గిన్నీస్ రికార్డు బద్ధలు కొట్టాడు. నాలుగు గంటల 10 నిమిషాల 5 సెకండ్లపాటూ అతని తలపై తేనెటీగలు ఉన్నట్లు గిన్నీస్ బుక్ నిర్వాహకులు తెలిపారు.

ఈ రికార్డు ఎంత కష్టమైనదంటే... రికార్డ్ సమయంలో... ఎప్పుడూ తలను పూర్తిగా తేనెటీగలు కప్పే ఉంచాలి. పొరపాటున వాటిలో కొన్ని ఎగిరిపోయి తలలో ఏ పార్టైనా కనిపించిందంటే... రికార్డ్ లాస్ అయినట్లే. అందుకే ఈ రికార్డ్ సాధించినందుకు MSని అంతా మెచ్చుకుంటున్నారు.

MS తండ్రి సత్యకుమార్ అవార్డ్ గెలుచుకున్న తేనెటీగల పెంపకం దారు. ఆయన తేనెను కూడా తయారుచేయిస్తారు. తేనెటీగలను ఎలా ఆహ్వానించాలో, ఎలా వాటిని మచ్చిక చేసుకోవాలో తండ్రి నుంచి నేర్చుకున్నాడు MS. ఏడేళ్ల వయసు నుంచే తన ముఖంపై తేనేటీగలు వాలేలా చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎంత ధైర్యం ఉండాలి.

MSలో భయాన్ని పోగొట్టేశాడు తండ్రి. తేనె టీగ వస్తే చాలు ఏం కాదు... ఏం కాదు... రానీ రానీ అంటూ ఎంకరేజ్ చేసేవాడు. మౌనంగా ఉండమనే వాడు. సహనం కోల్పోవద్దని చెప్పేవాడు. ఎప్పుడైనా అవి కుట్టినా... మరేం పర్లేదు అంటూ ఓదార్చేవాడు. ఇదంతా ఆ తండ్రి ఎందుకు చేశాడంటే... తన తర్వాత... తన కొడుకు ఆ వృత్తిని చేపడితే... తేనెటీగల వల్ల అతను ఇబ్బంది పడకూడదనే. ఐతే... అది MSకి ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఇచ్చింది.

తేనెటీగలకు ఓ లక్షణం ఉంటుంది. రాణీ ఈగ ఎక్కడకు వెళ్తే... మిగతా అన్నీ అక్కడకే వెళ్తాయి. తొలిసారి MS తండ్రి... కొడుకు తలపై రాణి ఈగను ఉంచాడు. అంతే... ఆ రోజు... ఆ పిల్లాడు తల మొత్తం తేనెటీగలు వాలిన అనుభవాన్ని పొందాడు. ఎంతో ఆశ్చర్యం, ఎంతో ఆనందం... రెండూ ఒకేసారి కలిగాయి. అది MSకి బాగా నచ్చి... తర్వాత రోజు మళ్లీ అలాగే చేశాడు. అదే అనుభవం కలిగింది. ఇక అప్పటి నుంచి అంతే.

తాజా రికార్డులో దాదాపు 60వేల తేనెటీగలు MS తలను కప్పాయి. తనకు వాటితో ఎంతో అనుబంధం ఉందని అతను తెలిపాడు. ఇలాంటి ప్రపంచ రికార్డు కోసం రెండేళ్ల కిందటే ట్రై చేశాడు. తద్వారా తేనెటీగలపై ప్రజల్లో అవగాహన పెంచాలనుకున్నాడు. తేనెటీగలే గనక ఈ భూమిపై లేకపోతే... ఈ భూమి మనుగడ సాధించలేదని అంటున్నాడు MS.
First published: June 23, 2020, 1:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading