Home /News /trending /

Viral News: "పిల్లలు పోర్న్‌ చూసేటప్పుడు నేను ఏమీ అనను..వారితో కలసి పోర్న్‌ చూస్తా..."

Viral News: "పిల్లలు పోర్న్‌ చూసేటప్పుడు నేను ఏమీ అనను..వారితో కలసి పోర్న్‌ చూస్తా..."

Photo Credit : Instagram

Photo Credit : Instagram

Viral News: నా పిల్లలు చాలా ఓపెన్‌ మైండెడ్‌. వారు పోర్న్‌ చూస్తారంటే నేను వద్దని చెప్పాను. వారికి సెక్స్‌ ఎడ్యుకేషన్‌గా పనికొస్తుందని వారితో నేను కూర్చొని చూస్తాను అంటూ కామెంట్‌ చేసింది ప్రముఖ పాప్ స్టార్.

ఆమె ఓ పెద్ద పాప్‌ స్టార్‌. సోషల్‌ మీడియాలో చాలామంది ఆమెను ఫాలో అవుతుంటారు. తాజాగా పిల్లల పెంపకం విషయంలో ఆమె చేసిన కామెంట్లు, అందుకు సంబంధించి ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ ఎవరా స్టార్‌, పేరెంటింగ్‌ గురించి ఆమె ఏం చెప్పింది, నెటిజన్ల మాటలేంటో చూద్దాం! పిల్లల పెంపకంలో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ చాలా ముఖ్యం అని చాలామంది నిపుణులు చెబుతూ ఉంటారు. మన దేశంలో ఇలాంటి పరిస్థితి లేకపోవడం వల్ల లేని పోని అపోహలతో పిల్లలు ఇబ్బందులుపడుతున్నారని ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. ఇప్పుడు ఆ పాప్‌స్టార్‌ చెప్పింది కూడా దీని గురించే. ఆ 49 ఏళ్ల పాప్‌స్టార్‌ పేరు యూనీ షారా అలియాస్‌ వాహు సెటాయినింగ్‌ బుడి. ఇండోనేసియాలో ఆమె పెద్ద సెలబ్రిటీ.యూనీ షారాను ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ఇంటర్వ్యూ చేసింది. దానికి సంబంధించిన వీడియో ఇటీవల రిలీజ్‌ చేశారు. గంటకుపైగా నిడివి ఉన్న ఈ వీడియోలో తన గురించి, పిల్లల గురించి చెప్పుకుంటూ వచ్చింది యూనీ షారా. ఈ క్రమంలో పోర్న్‌ వీడియోస్‌ టాపిక్‌ వచ్చింది. దానికి యూనీ షారా చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్‌గా మారింది.

‘పిల్లలు పోర్న్‌ చూసేటప్పుడు నేను ఏమీ అనను. ఆ మాటకొస్తే ఒక్కోసారి నేను వారితో కలసి కూర్చుని చూస్తాను’ అని చెప్పింది యూనీ షారా. ఆ మాటల వెనుక చాలా పెద్ద అర్థమే ఉందని చెబుతోందామె. పిల్లలు పోర్న్‌ చూడకుండా ఆపడటం ప్రస్తుతం కష్టమే. అలాగే అడల్ట్‌ కంటెంట్‌ చూస్తున్నప్పుడు వారిని ఆపడమూ మంచిది కాదు’ అని చెబుతోంది యూనీ షారా.

నా పిల్లలు చాలా ఓపెన్‌ మైండెడ్‌. వారు పోర్న్‌ చూస్తారంటే నేను వద్దని చెప్పాను. వారికి సెక్స్‌ ఎడ్యుకేషన్‌గా పనికొస్తుందని వారితో నేను కూర్చొని చూస్తాను అంటూ కామెంట్‌ చేసింది యూనీ షారా. అయితే తన పిల్లలు మాత్రం ఇలా మాట్లాడకు అని అంటుంటారట. షారా చెప్పిన ఈ పేరెంటింగ్‌ స్టైల్‌ విషయంలో నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొంతమంది ఆమెకు ఎప్పట్లానే సపోర్టు చేస్తుంటే... ఇంకొందరు ఇది పద్ధతి కాదు అంటున్నారు.

షార ఆలోచనను చైల్డ్‌, అడాల్సెంట్‌ ఎడ్యుకేషన్‌ ఎక్స్‌పర్ట్‌ యాగ్‌స్ట్రయిడ్‌ పీథర్‌ సమర్థించారు. పిల్లలు పోర్న్‌ చూస్తున్నప్పుడు, అది ఎలాంటి పరిస్థితి అయినా వారి మీద కోపం ప్రదర్శించొద్దు అని సూచించారామె. ఎందుకంటే తల్లదండ్రులు కోప్పడితే... వారు మానకపోగా, సీక్రెట్‌గా చూస్తారు అనేది ఆమె చెప్పిన మాట. దానికి బదులు వాళ్లకు సెక్స్‌ గురించి అర్థమయ్యేలా వివరించాలి. పోర్న్‌ ఫిల్మ్‌లో కనిపించేది సెక్స్‌ కాదని నెమ్మదిగా చెప్పాలి అని సూచించారు పీథర్‌. అయితే పిల్లలతో కలసి చూడటం, కోప్పడకుండా ఉండటం రెండూ ఒకటే అనుకోలేం అని కూడా అన్నారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Indonesia, Porn Movies, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు