Home /News /trending /

MEET SHAHBAZ SHARIF PM OF PAKISTAN AND HIS HIGHLY ENTERTAINING HAND MOVEMENTS GOES VIRAL PAH

Shahbaz Sharif: పాక్ లో.. మైకులు విరగాల్సిందే.. పొడియం వణకాల్సిందే.. నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

పాక్ ప్రధాని షెహబాజ్ (ఫైల్)

పాక్ ప్రధాని షెహబాజ్ (ఫైల్)

Highly Entertaining video: పాక్ కు షెహబాజ్ షరీఫ్ నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన గతంలో పలు మీటింగ్ లలో ప్రవర్తించిన తీరు, ఫన్నీ సంఘటనలు ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.

ఇంకా చదవండి ...
Shahbaz Sharif and his Highly Entertaining video: షెహబాజ్ షరీఫ్ పాక్ కు 23 వ ప్రధానిగా ఎన్నికయ్యారు. కొన్ని రోజులుగా చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలకు తాత్కలికంగా తెరపడినట్లు తెలుస్తోంది. షెహబాజ్ షరీఫ్, నవాబ్ షరీఫ్ (Shahbaz Sharif) కు సోదరుడు. ఇమ్రాన్ ఖాన్ ను గద్దేదించి, ప్రధానిగా ఎన్నుకొబడ్డారు. ఎన్నికయిన తొలిరోజు ఆయన జమ్ము పట్ల తన వక్రబుధ్ది చాటుకున్నారు. జమ్ముకశ్మీర్, ఆర్టికల్ 370 అధికరణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ రక్తమోడుతుందని, దీన్ని దౌత్యపరంగా పరిష్కరించుకొవడానికి మోదీ ముందుకు రావాలంటూ కామెంట్ చేశారు. దీనిపై మోదీ ఘాటుగా స్పందించారు.

కశ్మీర్ భారత్ లోని అంతర్గతమని స్పష్టం చేశారు. తమ దేశంలో ఎలాంటి ఉగ్రవాద లేరని చురకలంటించారు. పాక్ కు నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్..  గతంలో పలు పబ్లిక్ మీటింగ్ లలో పాల్గొన్నప్పుడు ఎమోషనల్ అయ్యేవారు. ఒక్కొసారి ఆగ్రహంతో ఊగిపోయేవారు. స్పీచ్ ఇస్తు.. ఒక్కసారిగా మైక్ లను విరిచేవారు. మైక్ లను, పొడియంలను పక్కకు జరిపేసేవారు. ఆయన మాట్లాడుతుంటే.. ముందర ఉన్న విలేకరులు కూడా భయంతో ఉండే వారు. ఒక్కొసారి మాట్లాడుతుంటే ఆయన హవా భావాలకు నెటిజన్లు ఫన్నీగా కామెంట్ లు చేస్తుండేవారు.


షెహబాజ్ తన ప్రసంగంలో జుల్పీకర్ అలీ బుట్టేను అనుసరించేవారు. ఆయన కూడా మాట్లాడేటప్పుడు ఎమోషనల్ అయి.. మైక్ లను విరిచేసి, కిందపడేయడం చేస్తుండేవారు. అయితే, ఈ ఫన్నీ వీడియోలను అక్కడి మీడియా ఫన్నీగా వైరల్ చేసేవి. ప్రస్తుతం ఆయన ప్రధానిగా ఎన్నికయ్యాక ఈ ఫన్నీ వీడియోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మూడు సార్లు పాకిస్తాన్ ప్రధానిగా పనిచేసి ప్రస్తుతం బ్రిటన్ లో తలదాచుకుంటున్న నవాజ్ షరీఫ్ సోదరుడే షెహబాజ్ షరీఫ్. 70 ఏళ్ల షెహబాజ్ షరీఫ్.. ఇప్పుడు పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N)పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో తమ కుటుంబానికి కంచుకోట అయిన పాక్ లోని పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా షెహబాజ్ షరీఫ్ పనిచేశారు.

ఉద్వేగభరితమైన ప్రసంగాలు చేయడంలో షెహబాజ్ షరీఫ్ పేరు గడించారు. తన ప్రసంగాలలో విప్లవ కవిత్వాన్ని ఉటంకించడంలో ప్రసిద్ధి చెందాడు. షెహబాజ్ ఫరీష్ ను వర్క్‌హోలిక్‌ గా చెప్పవచ్చు. అయితే షెహబాజ్ షరీఫ్ కు చాలా మంది భార్యలు ఉన్నారు. ఆయన బహుళ వివాహాలు మరియు లండన్ మరియు దుబాయ్‌లోని లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను కలిగి ఉన్న ఆస్తి పోర్ట్‌ఫోలియో గురించి విపక్షాలు,మీడియా ఎంత ప్రచారం చేసినా కూడా ఆయనకు ఉన్న ప్రజాదరణ చెక్కుచెదరలేదనే చెప్పవచ్చు.
Published by:Paresh Inamdar
First published:

Tags: India pakistan, Pakistan, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు