హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Husband Salary: ‘నా భర్త జీతం ఎంత..?’ ఆర్టీఐకి మహిళ అభ్యర్థన.. విషయం అంతదాకా ఎందుకు వచ్చిందంటే..

Husband Salary: ‘నా భర్త జీతం ఎంత..?’ ఆర్టీఐకి మహిళ అభ్యర్థన.. విషయం అంతదాకా ఎందుకు వచ్చిందంటే..

‘నా భర్త జీతం ఎంత..?’ ఆర్టీఐకి మహిళ అభ్యర్థన.. విషయం అంతదాకా ఎందుకు వచ్చిందంటే..

‘నా భర్త జీతం ఎంత..?’ ఆర్టీఐకి మహిళ అభ్యర్థన.. విషయం అంతదాకా ఎందుకు వచ్చిందంటే..

Husband Salary: తాజాగా ఒక మహిళ తన భర్త జీతం ఎంతో చెప్పాలంటూ ఏకంగా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. ఈ చట్టాన్ని ఆమె ఏకంగా తన భర్తపై వాడేసింది. ఇంతకీ ఈ భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

భార్యాభర్తలు (Wife and Husband) తమ మధ్య కొన్ని విషయాలను దాచి పెడుతుంటారు. ఇందులో జీతం (Salary) కూడా ఒకటి. ఇలాంటి విషయాలను ఒకరికొకరు తెలుసుకోవాలని చిన్నపాటి ప్రయత్నాలు చేయడం సహజమే. అయితే తాజాగా ఒక మహిళ తన భర్త జీతం ఎంతో చెప్పాలంటూ ఏకంగా సమాచార హక్కు చట్టం (Right To Information) కింద దరఖాస్తు చేసుకున్నారు. సాధారణంగా ఏదైనా ముఖ్యమైన అంశం గురించి సమాచారం తెలుసుకునేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. అలాంటి ఈ చట్టాన్ని ఈ భార్య తన భర్తపై వాడేసింది. ఇంతకీ ఈ భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజు గుప్తా అనే మహిళ తన భర్తతో కలిసి బతకలేకపోతున్నారు. అలానే తన భర్త నుంచి విడాకుల తీసుకునే వ్యవహారంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా భర్త నుంచి పొందే భరణం, మెయింటెనెన్స్ విషయంలో ఆమె సరైన న్యాయం పొందలేకపోతున్నారు.

అందుకు కారణం భర్త తన ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించడానికి నిరాకరించారు. అందుకే ఆమె తన భర్త ఇన్‌కమ్‌ గురించి తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం (RTI)లో దరఖాస్తు చేశారు. సంజు గుప్తా తన భర్తకి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ 2018-19, 2019-20 గ్రాస్, ట్యాక్సబుల్ ఇన్‌కమ్ వివరాలను పొందేందుకు ఆర్టీఐలో దరఖాస్తు చేశారు.

* నిరాకరించిన అధికారులు

ఈ సమాచారాన్ని అందించేందుకు బరేలీలోని ఐటీ శాఖ ఆఫీస్‌లోని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (CPIO) నిరాకరించారు. సంజు గుప్త భర్త ఈ వివరాలను బహిర్గతం చేయడానికి ఇష్టపడటం లేదు కాబట్టే CPI ఆఫీసర్ కూడా అందుకు నిరాకరించారు. ఈ సమాధానం విన్న తర్వాత కూడా సంజు గుప్తా తన ప్రయత్నాన్ని మానుకోలేదు. మరికొన్ని అప్పీళ్ల ద్వారా తన హస్బెండ్ శాలరీ తెలుసుకోవాలని అనుకున్నారు. ఆపై ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ (FAA) ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఇది CPIO నిర్ణయాన్ని సమర్థించింది. దాంతో నిరాశకు గురైన ఆమె సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమీషన్ (CIC)లో రెండవ అప్పీలును దాఖలు చేశారు.

ఇది కూడా చదవండి : వామ్మో.. ఈ పాలు లీటరుకి రూ.13 వేలంట..! ఎందుకో ఇంత ఖరీదు..?

సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమీషన్ అనేది RTI చట్టం, 2005 కింద ఏర్పాటైన సంస్థ. ఈ కమీషన్‌కు అన్ని సెంట్రల్ పబ్లిక్ అథారిటీల్లో అధికారం ఉంటుంది. ఈ కమీషన్‌ తన అధికారాలతో రెండవ అప్పీల్‌ పరిగణలోకి తీసుకొని అప్పీల్‌దారుకు సమాచారం ఇవ్వాలా వద్దా అనే విషయంలో తీర్పు ఇస్తుంది. ఈ సంస్థకి రికార్డ్ కీపింగ్ కోసం దిశానిర్దేశం కూడా చేసే అధికారాలు ఉంటాయి. CIC నిర్ణయాలు అంతిమమైనవి.

* చివరకు ప్రయత్నం సక్సెస్

అయితే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమీషన్ సంజు గుప్తా కేసు పూర్వాపరాలను పరిశీలించి ఆమెకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. CIC సెప్టెంబర్ 19న తన నిర్ణయం ప్రకటిస్తూ 15 రోజుల వ్యవధిలో పబ్లిక్ అథారిటీ వద్ద అందుబాటులో ఉన్న భర్త ఆదాయ వివరాలను అప్పీలుదారుకు అందించాలని కమిషన్ CPIOని ఆదేశించింది. దీన్నిబట్టి వివాహ బంధంలో సఖ్యత లేనప్పుడు భర్త ఆదాయ వివరాలను భార్య ప్రభుత్వం నుంచి తెలుసుకోవచ్చని స్పష్టమవుతోంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Full salary, Relationship, VIRAL NEWS, Wife and husband

ఉత్తమ కథలు