హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral News : భుజంపై ఏడాది బాబు..ఐదు రోజుల పాటు ఆ దంపతుల నడక..దేవుడిలా ప్రత్యక్షమైన డాక్టర్..

Viral News : భుజంపై ఏడాది బాబు..ఐదు రోజుల పాటు ఆ దంపతుల నడక..దేవుడిలా ప్రత్యక్షమైన డాక్టర్..

Viral News : భుజంపై ఏడాది బాబు..ఐదు రోజుల పాటు ఆ దంపతుల నడక..దేవుడిలా ప్రత్యక్షమైన డాక్టర్..

Viral News : భుజంపై ఏడాది బాబు..ఐదు రోజుల పాటు ఆ దంపతుల నడక..దేవుడిలా ప్రత్యక్షమైన డాక్టర్..

Viral News : దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తున్నా..ఈ మహమ్మారి చేసిన గాయాలు మానడం లేదు. కరోనా ప్రభావం చాలా రంగాలపై పడింది. ముఖ్యంగా రెక్కాడితే డొక్కాడని బతుకు జీవులపై. కరోనా టైంలో వలస జీవులు అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటిదే ఈ కథ.

ఇంకా చదవండి ...

కరోనా వైరస్ ప్రభావం వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారు. నగరాలకు వలస వెళ్లిన వారు సొంత ఊళ్లకు తిరిగివెళ్లిపోతున్నారు. చేసేందుకు పని లేక.. నగరాల్లో అద్దెలు కట్టే ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే లాక్డౌన్ ఉండడంతో రవాణా సదుపాయాలు లేక కొంత మంది వందల కిలోమీటర్లు నడుకుంటూ సొంత ఇళ్లకు వెళుతున్నారు. రోజుల తరబడి కాలిబాట పడుతున్నారు. తాజాగా తమిళనాడులో ఓ జంట, సంవత్సరం కొడుకును ఎత్తుకొని చెన్నై నుంచి కోయంబత్తూరు సమీపంలోని తమ ఊరికి కాలిబాటన బయలుదేరారు. అయితే ఐదు రోజుల నడక తర్వాత వారికి ఓ వ్యక్తి తన కారునే డ్రైవర్తో సహా పంపి సాయం చేశాడు. వారికి ఆర్థిక సాయం కూడా చేశాడు. నవీన్, రమ్య సొంతఊరు మదుక్కరై. లాక్డౌన్ కారణంగా నవీన్ పని కోల్పోయాడు. దీంతో వారు చెన్నై వదిలిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే రాష్ట్రంలోనూ రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలినడకనే తన కుటుంబంతో బయలుదేరాడు. తమ వద్ద ఉన్న కొంత మొత్తంతోనే ఇక సొంతూరుకు వెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు.

అలా ఐదు రోజుల పాటు నడిచాక వారు వేలూరు చేరుకున్నారు. అక్కడి వారితో మాట్లాడుతూ నవీన్, రమ్య తమ బాధను చెప్పుకున్నారు. దీంతో అక్కడి స్థానికులు షాకయ్యారు. వెంటనే వేలూరులోని వెటర్నరీ డాక్టర్ రవిశంకర్కు చెప్పారు. దీంతో నవీన్, రమ్యకు సాయం చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోలేదని, తాను ఆదా చేసిన మొత్తంలో రూ.30వేలు వారి కోసం ఖర్చు చేశానని నవీన్.. రవిశంకర్కు తన బాధచెప్పుకున్నాడు. తన ఉద్యోగం పోయాక ఇక చేసేందుకు పని లేక, కనీసం ఇంటి అద్దె కూడా కట్టుకోలేని స్థితిలో సొంత ఊరికి వెళుతున్నామని గోడు వెల్లబుచ్చాడు.



నవీన్ ఆవేదన చూశాక రవిశంకర్ వారి కోసం తన కారును పురమాయించాడు. నవీన్ కుటుంబాన్ని సొంతఊరికి చేరేలా డ్రైవర్తో సహా కారును పంపాడు. అలాగే చేతి ఖర్చుల కోసం రూ.వెయ్యి ఇచ్చాడు. చెన్నైలోని ఇటుకల బట్టీలో పని ఇప్పిస్తామని కూడా కొందరు చెప్పగా.. ప్రస్తుత పరిస్థితి వల్ల తాను సొంత ఇంటికే వెళతానని నవీన్ చెప్పాడు. మొత్తంగా తన కాలిబాటలో నవీన్ కుటుంబానికి మంచి మనుషులు సాయం చేశారు. డాక్టర్ రవిశంకర్ ఇప్పటికే కరోనా రోగులకు సాయం అందిస్తున్నారు. వీలైనంత మందికి ఆక్సిజన్ అందించడంతో పాటు వృద్ధులకు ఉచితంగా భోజనం పెడుతున్నారు. అలాగే ఆసుపత్రికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న వారిని తన కారులోనే పంపుతున్నారు.

First published:

Tags: Corona effect, Migrant Workers, VIRAL NEWS

ఉత్తమ కథలు