పుర్రెకో బుద్ధి, జిహ్వకోరుచి అంటారు. అందంగా కనపడాలని అందరూ కోరుకుంటారు. కానీ బ్రెజిల్‌కు చెందిన ఒక వ్యక్తి మాత్రం వికారంగా, రాక్షసుడిలా కనిపించాలని కోరుకున్నాడు. అనుకున్నదే తడవుగా బాడీ మాడిఫికేషన్ ద్వారా భయానకంగా తయారయ్యాడు. ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి రాక్షసానందం పొందుతున్నాడు. అంతేకాక తనను తాను సైతాన్ భక్తుడిగా ప్రకటించుకున్నాడు. అచ్చం దెయ్యంలా కనపడటం కోసం అనేక ఆపరేషన్లు చేయించుకున్నాడు. ఫోటోలో కన్పిస్తోన్న ఈ వ్యక్తి పేరు మైఖెల్ ఫారో డో ప్రదో. వయసు 44 ఏళ్ళు. ఈయనకు పరమవికారంగా కనపడటమంటే మహా ఇష్టం. ఆ ఇష్టంతోనే శరీరానికి సర్జరీలు చేయించుకున్నాడు. ముక్కు చెవులు కోయించుకున్నాడు. నాలుకను రెండుగా చీల్చుకున్నాడు. దెయ్యాలకు కోరలు కూడా ఉంటాయని ఎవరో చెప్పినట్టుంది... అందుకే నోట్లోంచి పొడవాటి కోరలు కనపడేలా వెండికోరలు చేయించుకుని అమర్చుకున్నాడు.
మనిషిరూపాన్ని పూర్తిగా కోల్పోయినా ఇంకా ఏదో వెలితి ప్రదో ను వెంటాడింది. దీంతో తన కుడిచేతి మధ్య వేలును, ఎడమ చేతి ఉంగరం వేలును తొలగించుకున్నాడు. ఆ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఇతని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను 59 వేలమంది ఫాలో అవుతున్నారు. ఆకారంలో వికారాన్ని కలుపుకున్న ప్రదోకు ఇన్‌స్టాగ్రామ్‌లో కాస్త వెరైటీ ప్రతిస్పందనలు వచ్చాయి. ఇలాంటి రూపంతో సాధారణ జీవితాన్ని మిస్ అవడం లేదా అని కొందరు ప్రశ్నించగా.. ఇంతకు ముందు కంటే ఇప్పుడే నువ్వు బావున్నావంటూ కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brazil, Trending, VIRAL NEWS