Viral News : వీడెవడండీ బాబూ..ఎనిమిదేళ్ల క్రితమే కరోనాను ఊహించాడు..వైరలవుతున్న ట్వీట్..

Photo Credit : Twitter

Viral News : ఏడాదిన్నర క్రితం మొదలైన కరోనా ప్రభావం ఇప్పటికీ వణుకు పుట్టిస్తోంది. హాస్పిటల్స్ బెడ్స్ నిండిపోయి అంబులెన్సులు, స్ట్రెచర్లపైనే ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన సమయానికి వైరస్ కట్టడి అయ్యేలా వ్యాక్సిన్ రెడీ చేయలేకపోయారు. మహమ్మారితో ఈ భయంకర ప్రయాణం ఇంకెన్నాళ్లో చెప్పలేకపోతున్నారు.

  • Share this:
    ప్రపంచాన్ని అణువంత క్రిమి పట్టి పీడిస్తోంది. మానావాళి నుదుటి మీద ఈ పాపిష్టి వైరస్ రాస్తున్న మృత్యు శాసనానికి తెరపడటం లేదు. ఈ క్రిమినల్ చేసే అరచాకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇక, డెడ్లీ కరోనా వైరస్‌ ఇండియాలో మాత్రం అంతకు రెట్టింపు విధ్వంసం సృష్టిస్తోంది. ఏడాదిన్నర క్రితం మొదలైన కరోనా ప్రభావం ఇప్పటికీ వణుకు పుట్టిస్తోంది. హాస్పిటల్స్ బెడ్స్ నిండిపోయి అంబులెన్సులు, స్ట్రెచర్లపైనే ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన సమయానికి వైరస్ కట్టడి అయ్యేలా వ్యాక్సిన్ రెడీ చేయలేకపోయారు. మహమ్మారితో ఈ భయంకర ప్రయాణం ఇంకెన్నాళ్లో చెప్పలేకపోతున్నారు. ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు.. వీటి గురించి ముందే మనకు తెలిస్తే బాగుండేది కదా అనిపిస్తుంది. ఇది అసాధ్యమని మనకు తెలిసినా.. ఒక వ్యక్తి మాత్రం ముందుగానే ఊహించాడు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా గురించి ఎనిమిదేళ్ల క్రితమే ఊహించగలిగాడు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ట్విట్టర్‌ యూజర్‌ మార్కో అక్రోట్‌ అనే వ్యక్తి జూన్‌ 3, 2013న కరోనా వైరస్‌ వస్తుంది అంటూ ట్వీట్‌ చేశాడు. "కరోనా వైరస్‌.. ఇట్స్‌ కమింగ్‌" అంటూ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం మరోసారి వైరల్‌ అవుతోంది.

    దీనిపై నెటిజనులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. "ఎనిమిదేళ్ల క్రితమే నువ్వు కరోనాను ఎలా పసిగట్టగలిగావ్‌".. "నువ్వు టైం ట్రావేలర్‌వా" అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ట్విట్టర్‌ను హ్యాక్‌ చేసి డేట్‌ మార్చి ఉండొచ్చని ఆరోపిస్తున్నారు. దీనిపై వస్తోన్న మీమ్స్‌ జనాలను కడుపుబ్బ నవ్విస్తున్నాయి.








    ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కి అన్నవా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి, ఇతగాడు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అందరూ ఈ ట్వీట్ గురించే చెప్పుకుంటున్నారు. అసలు ఈ విషయం నీ కెలా తెలిసిందంటూ అతణ్ని ప్రశ్నిస్తున్నారు మరి కొందరు.
    Published by:Sridhar Reddy
    First published: