హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral News: భుజాన బిడ్డని వేసుకొని.. నదులు, అడవులు దాటి.. ఈమె చేస్తున్న పనికి శభాష్ అనాల్సిందే..

Viral News: భుజాన బిడ్డని వేసుకొని.. నదులు, అడవులు దాటి.. ఈమె చేస్తున్న పనికి శభాష్ అనాల్సిందే..

Photo Credit : Face Book

Photo Credit : Face Book

Viral News: చేసే పని పట్ల శ్రద్ధ, నిబద్ధత, బాధ్యత ఉండాలి కానీ... ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని, సవాళ్లను అధిగమించొచ్చు అని చెబుతుంటారు పెద్దలు. ఈ నానుడికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది ఫోటోలో కన్పిస్తున్న మహిళ.

చేసే పని పట్ల శ్రద్ధ, నిబద్ధత, బాధ్యత ఉండాలి కానీ... ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని, సవాళ్లను అధిగమించొచ్చు అని చెబుతుంటారు పెద్దలు. ఈ నానుడికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది ఝార్కండ్‌కు చెందిన ఓ మహిళ. ఆమె పేరు మంతీ కుమారి. ఝార్కండ్‌లోని లతేహర్‌లో కాంట్రాక్ట్‌ నర్సుగా పని చేస్తున్నారు. ఊరూరా తిరిగి పిల్లలకు వ్యాక్సిన్‌ వేయడం ఆమె విధి. దీని కోసం ఆమె అడవుల్లో నడుచుకుంటూ, నది దాటుకుంటూ సంబంధిత గ్రామాలకు వెళ్లి వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ఈ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఆమె చేసిన పనికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. లతేహర్‌లో నర్సుగా విధులు నిర్వర్తించే మంతీ కుమారికి చెత్మా హెల్త్‌ సబ్‌ సెంటర్‌లో వ్యాక్సినేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఆమె పరిధిలో మొత్తం ఎనిమిది గ్రామాలు ఉన్నాయి. దీని కోసం మంతీ 35 కిలోల మీటర్లు అడవిలో నడుచుకుంటూ వెళ్లి, మధ్యలో వచ్చే నదిని ఈదుకుని దాటి వెళ్లేవారట. ఇటీవల మంతి కుమారి ఓ బిడ్డకు తల్లయ్యారు. అయినప్పటికీ ఆమె నిబద్ధతలో ఎలాంటి మార్పు రాలేదు. ఇటీవల తన బిడ్డను భుజాన వేసుకొని, అంత దూరం నడిచి, నదిని దాటి అవతల వైపునున్న గ్రామాల్లో పిల్లలకు వ్యాక్సిన్‌ వేసి వచ్చారు. ఆమె ఏదో ఒకసారి ఇలా కష్టపడలేదు. గత ఏడాదిగా ప్రతి నెలా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారు.

చెత్మా హెల్త్‌ సబ్‌సెంటర్‌లో చాలా ప్రాంతాలకు వెళ్లడానికి గత ఏడాదిగా సరైన సౌకర్యాలు లేవు. దీంతో కాలినడకనే వెళ్లేదాన్ని అని మంతీ చెబుతున్నారు. అయితే ఆ ప్రాంతంలో నదులు అంత లోతుగా ఉండకపోవడంతో దాటేవాటరట. ఒకవేళ ఎక్కువ ప్రవాహం ఉంటే... ఆ గ్రామ పర్యటన వాయిదా వేసుకునేవారు. ఆమె తన భర్త సునిల్‌ ఓరన్‌తో మహువాద్‌నర్‌ అనే ప్రాంతంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆమె పని చేసే చెత్మా హెల్త్‌ సెంటర్‌కు 25 కిలో మీటర్ల ప్రయాణం. లాక్‌డౌన్‌ కారణంగా ఆ రెండు ప్రాంతాల మధ్య రవాణా సదుపాయం నిలిపేశారు. దీంతో మంతితో ఆమె భర్త కాస్త దూరం తోడు వచ్చేవారట. మరోవైపు ఆమె భర్త ఉద్యోగం కూడా లాక్‌డౌన్‌ కారణంగా పోయింది. దీతో భర్త, బిడ్డ పోషణ కోసం అంత కష్టాన్ని భరించి ఆమె ఉద్యోగం చేస్తున్నారట.


ప్రయాణం, నడక, నది ఒక రకమైన సమస్య అయితే, ఆమె పని చేస్తున్న ప్రాంతంలో మావోయిస్టుల జాడలు ఎక్కువ. అయితే ప్రజల ఆరోగ్యం కోసం ఆ మాత్రం చేయడం తప్పేం కాదు అని చెబుతున్నారు మంతీ కుమారి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో సాధారణ వైద్యం అంత సులభంగా దొరకదు. ‘‘నేను ప్రతి నెలా నది దాటి, అడవుల నుంచి టిసియా, గొయిరా, సుగబంధ గ్రామాలకు వెళ్లేదాన్ని. ఒక్కో సారి నాభర్త నాకు సాయంగా వచ్చేవారు’’అని మంతీ చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ఆరోగ్య కార్యకర్తలకు ఇలాంటి సవాళ్లను అధిగమించడం సహజం అని అక్కడి మెడికల్‌ ఆఫీసర్‌ చెబుతున్నారు. అందుకే ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ కష్టాన్ని ఎంత పొగిడినా తక్కువే అంటారు.

First published:

Tags: Covid vaccine, Jharkhand, VIRAL NEWS

ఉత్తమ కథలు