Viral News: ఈ వకీల్ సాబ్‌కు వందేళ్లు.. కోర్టుల్లో ఇంకా ఆగని వాదనలు..

Photo Credit : IANS

Viral News: కొత్త విషయాలు నేర్చుకునేందుకు వయసు ఏ మాత్రం అడ్డంకి కాదని ఆయన నిరూపించారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. తన కెరీర్లో చాలా ముఖ్యమైన కేసులు వాదించారు. ఆ లాయరే లేఖ్రాజ్ మెహతా.

  • Share this:
వంద సంవత్సరాల వయసు దాటినా ఆయన న్యాయవాదిగా కొనసాగుతున్నారు. ఇంకా కేసులు వాదిస్తూ ఉత్సాహం కనబరుస్తున్నారు. వయసు అనేది సంఖ్య మాత్రమే అంటూ ముందుకు సాగుతున్నారు. ఆయనే రాజస్థాన్ జోధ్పూర్కు చెందిన లేఖ్రాజ్ మెహతా. ఆయన ఇటీవలే 100వ పుట్టినరోజును జరుపుకున్నారు. న్యాయవాద వృత్తిలో మెహతా దిగ్గజంగా కొనసాగుతున్నారు. గతంలో కొందరు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తులు, సీఎంలు, అంతర్జాతీయ కోర్టుల జడ్జిలకు ఆయన ఎన్నోసార్లు సలహాలు ఇచ్చారు. న్యాయపాఠాలూ నేర్చారు.లేఖ్రాజ్ మెహతా 1947 నుంచి లాయర్గా ఉన్నారు. కాగా ప్రస్తుతం కరోనా ప్రభావం ఉండడంతో వర్చువల్ విచారణల్లోనూ ఆయన పాల్గొంటున్నారు. సమర్థంగా వాదిస్తున్నారు. వీడియాకాల్, వీడియో మీటింగ్లు ఎలా చేయాలో ఆయన నేర్చుకుంది గతేడాది లాక్డౌన్లోనే. కొత్త విషయాలు నేర్చుకునేందుకు వయసు ఏ మాత్రం అడ్డంకి కాదని ఆయన దీనిద్వారా నిరూపించారు. అయితే మెహతా పని విధానాన్ని కరోనా పరిస్థితులు మొత్తం మార్చేశాయి. అయితే ఆయన ఏ విషయాన్నైనా చాలా త్వరగా నేర్చుకుంటారు. సవాళ్లను అధిగమిస్తారు. తన సుదీర్ఘ న్యాయవాద కెరీర్లో కోర్టులకెళ్లి వాదించిన ఆయన.. గతేడాది నుంచి వర్చువల్గా పని చేస్తున్నారు. తన మనువడు రామిల్ మెహతా సాయంతో ఆయన వీడియో సమావేశాలకు హాజరవడం, వీడియో కాల్స్ మాట్లాడడం నేర్చుకున్నారు. కరోనా వల్ల తన వృత్తిలో ఎదురైన సవాళ్లను ఆయన పటిష్టంగా అధిగమించారు. ప్రస్తుతం మెహతా కోర్టుకు తన క్లయింట్లతో వీడియో కాల్స్లో మాట్లాడుతున్నారు.

గతంలో మాజీ సీజేఐ ఆర్ఎం లోథా, జస్టిట్ దల్బీర్ భండారీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఎంఆఎల్ సింఘ్వీ లాంటి వారికి మెహతా న్యాయవాద పాఠాలు నేర్పారు.తన కెరీర్లో మెహతా చాలా ముఖ్యమైన కేసులు వాదించారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ జింకల వేట కేసును తొలుత ఆయనే వాదించారు. తీవ్రంగా కృషి చేసి విదేశాలకు వెళ్లేందుకు సల్మాన్కు వీసా దక్కేలా చేశారు. ఆయన వాదనతో సల్మాన్పై అభియోగాలపై హైకోర్టు కొంత కాలం స్టే కూడా విధించింది.

ఒక్క ఓటు తేడాతో పరాజయం చెందిన కాంగ్రెస్ నేత సీపీ జోషి కోర్టును ఆశ్రయించగా.. కల్యాణ్ సింగ్ తరఫున వాదించిన లేఖ్రాజ్ మెహతా కేసును గెలిచారు. అలాగే భైరోన్ సింగ్ షెకావత్ ఎన్నికపై రెండుసార్లు పిటిషన్లు దాఖలైనా.. మెహతా వాటిని కొట్టేసేలా చేశారు.1921లో లేఖ్రాజ్ మెహతా పుట్టారు. ఆ సమయంలో దేశంలో స్పానిష్ ఫ్లూ విజృంభించింది. మళ్లీ ఇప్పుడు వందేళ్ల తర్వాత కరోనా విశ్వరూపం చూపుతోంది. వృద్ధాప్యం వచ్చినా అందరూ టైమ్ టేబుల్ పాటించాలని సూచిస్తారనాయన. అలాగే ఏం తినాలి.. ఏం వద్దు అనే నియమాలు విధించుకోవాలని చెప్తారు. ఆరోగ్యం కోసం ఎక్కువగా నడవడంతో పాటు యోగా చేయాలని లేఖ్రాజ్ మెహతా సూచించారు.
Published by:Sridhar Reddy
First published: