హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Living without Heart: ఇదేందయ్యా ఇది..నేనడా సూడలే..గుండె లేకుండా 555 రోజులు బతికిన వ్యక్తి.. ఎలాగో తెలుసా?

Living without Heart: ఇదేందయ్యా ఇది..నేనడా సూడలే..గుండె లేకుండా 555 రోజులు బతికిన వ్యక్తి.. ఎలాగో తెలుసా?

Photo Credit : AFP

Photo Credit : AFP

Living without Heart: గుండె చప్పుడు.. మనిషి జీవించి ఉన్నాడు అని నిర్ధారించేందుకు దీన్నే ప్రతిపాదికగా తీసుకుంటారు. చాలా సందర్భాల్లో బ్రెయిన్ డెడ్ అయిపోయి మంచానికే పరిమితం అయిన వారిని కూడా వెంటిలేటర్ సాయంతో బతికేస్తుంటారు.

గుండె చప్పుడు.. మనిషి జీవించి ఉన్నాడు అని నిర్ధారించేందుకు దీన్నే ప్రతిపాదికగా తీసుకుంటారు. చాలా సందర్భాల్లో బ్రెయిన్ డెడ్ అయిపోయి మంచానికే పరిమితం అయిన వారిని కూడా వెంటిలేటర్ సాయంతో బతికేస్తుంటారు. అయితే గుండె కొట్టుకోవడం ఆగిపోతే మాత్రం ఇక బతకడం అసాధ్యం అనే చెప్పుకోవచ్చు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన శరీరంలో గుండె లేకుండానే 555 రోజులు జీవించాడట. ఇది వింటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తున్నా.. అసలు విషయం తెలుసుకుంటే మాత్రం సైన్స్ ఎంతగా పురోగమించిందో తెలుసుకోవచ్చు. సాధారణంగా హార్ట్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తులకు వీలైనంత తొందరగా కొత్త గుండెను అమర్చాలి. లేదా వారు బతకడం కష్టం అని వైద్యులు చెబుతుంటారు. ప్రమాదంలో ఎవరికైనా బ్రెయిన్ డెడ్ అయి వారు బతికే అవకాశాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత వారి గుండెను ఇలాంటి వారికి అమర్చుతారు. కానీ అలాంటి సంఘటనలు చాలా అరుదు కాబట్టి ఇలాంటివారికి గుండె దొరకడం కూడా కష్ట సాధ్యమే. మిచిగాన్ కి చెందిన 25 సంవత్సరాల లార్కిన్ మాత్రం ఇలా గుండె కోసం వేచి చూస్తూ తన శరీరంలో గుండె లేకుండా 555 రోజుల పాటు జీవించాడు. ఈ మధ్య కాలంలో భుజాన వేసుకోవడానికి వీలుగా ఉండే ఓ పోర్టబుల్ డివైజ్ సాయంతో తన శరీరంలోని ఆర్టిఫిషియల్ గుండెను నడిపిస్తూ జీవితాన్ని కొనసాగించాడు. అయితే ఆర్టిఫిషియల్ గుండె పెట్టుకోవడం వల్ల అతడు ఇబ్బంది పడ్డాడేమో అనుకుంటే తప్పే అవుతుంది. ఈ 555 రోజుల్లో రోజూ అతడు తేలికపాటి ఆటలు, వ్యాయామాలు కూడా చేసేవాడట.

తనకు 23 సంవత్సరాలు ఉన్నప్పుడు లార్కిన్ కి హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. ఇందులో భాగంగా పాడైన అతడి గుండెను తొలగించి ఆర్టిఫిషియల్ హార్ట్ ని అమర్చారు. సింక్ ఆర్కడియా అనే డిజైజ్ సాయంతో ఈ గుండెకు శక్తిని అందించి అది పనిచేసేలా చేశారు వైద్యులు. ఆ తర్వాత దాదాపు రెండేళ్లకు కానీ అతడికి గుండె అందించే దాత దొరకలేదు. 25 సంవత్సరాల వయసున్నప్పుడు లార్కిన్ కి తిరిగి గుండె అమర్చారు. అప్పటివరకు ఆర్టిఫిషియల్ హార్ట్ గా పనిచేసే ఈ డివైజ్ ని ఎక్కడికి వెళ్లినా అతడు తన వెంటనే ఉంచుకునేవాడు. రాత్రి నిద్ర సమయంలోనూ అది వేసుకొనే పడుకునేవాడు.

గుండె రెండు వైపుల ఉన్న కవాటాలు పనిచేయకపోవడం, గుండె పూర్తిగా ఫెయిల్యూర్ అవడం వంటి పరిస్థితుల్లో ఇలా ఆర్టిఫిషియల్ గుండెను ఉపయోగిస్తుంటారు. అయితే సాధారణంగా ఇలాంటి డివైజ్ లు పెట్టుకునే వాళ్లు తక్కువేనని చెప్పుకోవాలి. చాలామంది హాస్పిటళ్లలోనే లైఫ్ సపోర్ట్ మెషీన్ సాయంతో జీవిస్తూ ఉంటారు. కానీ లార్కిన్ మాత్రం దాదాపు ఏడు కేజీల బరువున్న ఈ మెషీన్ ని ఉపయోగిస్తూ సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడ్డాడు. దీని గురించి అతడు మాట్లాడుతూ ఈ ఆర్టిఫిషియల్ గుండె నన్ను ఇప్పుడు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేలా చేసింది.

First published:

Tags: Heart, VIRAL NEWS

ఉత్తమ కథలు