Home /News /trending /

MEET KARNATAKAS 70 YEAR OLD TUNNEL MAN WHO IS SET TO RECEIVE PADMA SHRI AWARD GH VB

Tunnel Man: కర్నాటక ‘టన్నెల్​ మ్యాన్’​కు దక్కిన పద్మశ్రీ అవార్డు.. అతడి ప్రత్యేకత ఏమిటి..? తెలుసుకోండి..

పద్మ శ్రీ అవార్డు గ్రహీత  మహాలింగ నాయక్

పద్మ శ్రీ అవార్డు గ్రహీత మహాలింగ నాయక్

భారత 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 2022వ సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. కేంద్రం తాజాగా విడుదల చేసిన పద్మ పురస్కారాల గ్రహీతల జాబితా ప్రకారం.. ఈ ఏడాది మొత్తం 128 మంది ప్రముఖులను పద్మ అవార్డులు వరించాయి.

ఇంకా చదవండి ...
భారత 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 2022వ సంవత్సరానికి గాను పద్మశ్రీ (Padma Sri) అవార్డులను ప్రకటించింది. కేంద్రం తాజాగా విడుదల చేసిన పద్మ పురస్కారాల గ్రహీతల జాబితా ప్రకారం.. ఈ ఏడాది మొత్తం 128 మంది ప్రముఖులను పద్మ అవార్డులు(Awards) వరించాయి. 17 మందికి పద్మభూషణ్​, 107 మందికి పద్మశ్రీ, నలుగురికి పద్మవిభూషణ్​(Padma Vibhushan) అవార్డులు దక్కాయి. ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు గ్రహీతల్లో కర్ణాటకకు(Karnataka) చెందిన అమై మహాలింగ నాయక్ అనే కార్మికుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన వ్యవసాయ రంగంలో చేసిన కృషికి గానూ ఈ అత్యున్నత గౌరవం దక్కింది. అయితే, పద్మశ్రీ అవార్డు కోసం మహాలింగ్​ నాయక్​ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఎంపిక చేసింది? ఆయన ప్రత్యేకతలేంటి? అనే ప్రశ్నల వెనుక ఆసక్తికరమైన విషయాలున్నాయి.

Viral Video: కొండ అంచున కారు.. యూటర్న్ కు ప్రయత్నించిన డ్రైవర్.. తర్వాత ఏమవుతుందో ఊహించేలోపే ఇలా..


దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్​ సమీపంలోని ఆడ్యనడ్క గ్రామానికి చెందిన 70 ఏళ్ల రైతు మహాలింగ నాయక్​. బోరుబావులను తవ్వకుండా.. గ్రావిటీ ద్వారా తన పంట పొలాలకు నీటిని పారించాడు. తద్వారా, తన బంజరు భూమిని సాగు భూమిగా మార్చాడు. దీని కోసం ఎవరి సాయం తీసుకోకుండా చేతి పనిముట్లతోనే ఐదు సొరంగాలను తవ్వాడు. బోరు బావులను తవ్వించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో సంప్రదాయ పద్దతుల్లో తన పంటలకు నీరు పారేలా చేశాడు.

అంతేకాదు, ఎత్తయిన ప్రదేశంలో ఉండే తన పంట పొలాలకు సమాంతరంగా ఈ సొరంగాలను తవ్వి.. పైపుల ద్వారా నీరు సరఫరా అయ్యేలా చేశాడు. తద్వారా రసాయన రహితంగా వ్యవసాయాన్ని సాగిస్తున్నాడు. ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూడకుండా ఒక్కడే అయిదు సొరంగాలను త్రవ్వడంతో కన్నడిగులు ఆయన్ను 'సొరంగా మాన్' లేదా 'టన్నెల్ మ్యాన్'గా పిలుస్తున్నారు. మరికొందరు మహాలింగ నాయక్​ను ‘వన్​మ్యాన్​ ఆర్మీ’గా పేర్కొంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.



బోరు బావులను త్రవ్వే స్థోమత లేక..

మహాలింగ నాయక్​కు కేంద్రం పద్మశ్రీ ప్రకటించడంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ట్వీట్ చేస్తూ “70 ఏళ్ల వయస్సులో మహాలింగ నాయక్​ ఎంతో గొప్ప విజయాన్ని సాధించారు. ఆయన నిజంగానే సింగిల్ మ్యాన్ ఆర్మీ.”అని ప్రశంసించారు. దీనిపై వ్యవసాయ నిపుణుడు శ్రీ పాడ్రే మాట్లాడుతూ ‘‘నాయక్ సాంప్రదాయ పద్దతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. నేను చాలా సంవత్సరాలుగా నాయక్ పనిని అనుసరిస్తున్నాను.

నాయక్ నిర్మించిన సొరంగం మొదట్లో విఫలమైనప్పుడు అపహాస్యం పాలయ్యాడు. అయినా, వెనక్కి తగ్గకుండా సొరంగాన్ని తవ్వి తన పొలానిరి నీటి ప్రవాహాన్ని మెరుగుపర్చాడు. ఇలా చిన్న నీటి రిజర్వాయర్‌ను నిర్మించాడు. నాయక్ తన పొలంలో అనేక కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, మిరియాల తీగలు, కోకోతో పాటు దాదాపు 300 అరకెన్ తాటి చెట్లను పెంచుతున్నాడు.”అని పేర్కొన్నాడు.
Published by:Veera Babu
First published:

Tags: Karnataka, Padma Awards, Trending news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు