గుర్రాలకు మాత్రం ఆశలుండవా... రోజూ టీ తప్పనిసరి...

జేక్... ఇప్పుడీ గుర్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇది రోజూ ఉదయాన్నే టీ తాగందే నిద్రలేవదు. అసలీ అలవాటు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: December 2, 2019, 10:06 AM IST
గుర్రాలకు మాత్రం ఆశలుండవా... రోజూ టీ తప్పనిసరి...
గుర్రాలకు మాత్రం ఆశలుండవా... రోజూ టీ తప్పనిసరి... (credit - twitter - Mer Pol Mounted)
  • Share this:
ప్రపంచంలో టీ ఇష్టపడని వాళ్లు దాదాపు ఉండరు. ఐతే... గుర్రం కూడా టీకి అలవాటుపడటం విశేషమే. మనం ఎలాగైతే... బెడ్ కాఫీ, టీ వంటివి తాగుతామో... ఈ గుర్రం కూడా ఉదయాన్నే టీ తాగందే లేవదు. బ్రిటన్‌లోని మెర్సీసైడ్ పోలీసులు ఈ అశ్వానికి రోడూ మార్నింగ్ బెడ్ టీ ఇస్తున్నారు. ఈ జాక్ (గుర్రం పేరు) 15 ఏళ్లుగా ఇలాగే రోజూ టీ తాగుతోంది. ఈ 20 ఏళ్ల గుర్రానికి... గోరు వెచ్చటి పాలతో తయారుచేసిన టీలో రెండు టీస్పూన్ల షుగర్ కలిపి... చల్లటి నీరు మిక్స్ చేసి ఇస్తున్నారు. అందువల్ల ఈ టీ ఎక్కువ వేడి ఉండదు. టీ ఇవ్వగానే... కుక్కలు నీరు తాగినట్లుగా... జాక్... తన నాలికను టీ కప్పులో పెట్టి... మెల్లమెల్లగా టీని జుర్రుకుంటోంది. అసలీ అలవాటు ఎలా ఏర్పడిందంటే... 15 ఏళ్ల కిందట... తన రైడర్ తాగిన టీ కప్పులో కొద్దిగా టీ మిగిలిపోతే... దాన్ని గుర్రం తాగేసింది. ఇక అప్పటి నుంచీ ఎవరైనా టీ తాగితే... వాళ్లు కప్పు వదిలెయ్యగానే... ఇది మిగిలిన టీ తాగేస్తుండటాన్ని గమనించారు. ఇక లాభం లేదనుకున్న వాళ్లు... ప్రతి రోజూ తమతోపాటూ... ఈ గుర్రానికి కూడా ఓ కప్పు టీ ఇస్తున్నారు. ఇందుకోసం రెగ్యులర్ కప్పుల కంటే కాస్త పెద్ద కప్పే దీనికి కేటాయించారు. ఆ టీ తాగిన తర్వాత... ఫుల్ ఎనర్జీతో ఈ గుర్రం పరుగులు పెడుతోంది. జాక్‌తో కలిపి... ప్రస్తుతం అక్కడ 12 గుర్రాలున్నాయి. మిగతావి టీ తాగవు. రోజూ జాక్‌కి టెట్లీయక్ టీ ఇస్తున్నట్లు ట్విట్టర్‌లో వీడియో ట్వీట్ ద్వారా పోలీసులు తెలిపారు.

ఇప్పటికే ఈ వీడియోని 10 వేల మంది దాకా లైక్ చేశారు. 2లక్షల 30వేల మందికిపైగా చూశారు. ఇక కామెంట్లకు లెక్క లేదు. ఈ వారం మంచి వీడియో చూశానని ఒకరంటే... దానికి ఇచ్చే మగ్ బాగుందని మరొకరు అన్నారు. ఆ హార్స్ బాగుందని ఇంకొకరు, సూపరని మరకరు ఇలా కామెంట్ల తుఫాను వస్తూనే ఉంది.

 

కోలీవుడ్‌ని శాసిస్తున్న ఢిల్లీ బ్యూటీ యషికా ఆనంద్
ఇవి కూడా చదవండి :

Nutrition In Fish : చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే...

Diabetes Diet : బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే 5 సుగంధ ద్రవ్యాలు...

Health Tips : ముల్లంగి తింటున్నారా... మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ...

Health : రోజూ 5 నిమిషాలు పరిగెడితే... కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips : డయాబెటిస్ లక్షణాలేంటి? ముందే గుర్తించడం ఎలా?
First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు