హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Meet Colonel Bella: 26 రాష్ట్రాల్లో 20 వేల కి.మీ. ప్రయాణించనున్న డాగ్ కల్నల్ బెల్లా.. ఎందుకంటే..

Meet Colonel Bella: 26 రాష్ట్రాల్లో 20 వేల కి.మీ. ప్రయాణించనున్న డాగ్ కల్నల్ బెల్లా.. ఎందుకంటే..

Meet Colonel Bella: 26 రాష్ట్రాల్లో 20 వేల కి.మీ. ప్రయాణించనున్న డాగ్ కల్నల్ బెల్లా.. ఎందుకంటే..

Meet Colonel Bella: 26 రాష్ట్రాల్లో 20 వేల కి.మీ. ప్రయాణించనున్న డాగ్ కల్నల్ బెల్లా.. ఎందుకంటే..

Meet Colonel Bella: నాలుగు సంవత్సరాల వయసు ఉన్న కల్నల్‌ బెల్లా సుదీర్ఘ ప్రయాణానికి బయలుదేరింది. 26 రాష్ట్రాలలో సుమారు 20,000 కి.మీ. ప్రయాణించనుంది. దీని వెనుక ఓ పెద్ద కారణమే ఉంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం భారత్‌ (India)తో పాటు ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ మాఫియా (Drugs Mafia) రెచ్చిపోతోంది. చాపకింద నీరులా డ్రగ్స్ కల్చర్ వ్యాపిస్తోంది. పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఫలితాలు పెద్దగా ఉండట్లేదు. దీంతో డ్రగ్స్ మాఫియాను, డ్రగ్స్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టే దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ ఫ్రీ ఇండియా (Drug Free India) సాధనే లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేరళ (Kerala)కు చెందిన ఓ బృందం ఇండియా యాత్ర చేపట్టింది. గురువారం ప్రారంభమైన ఈ ‘గ్లోబల్‌ సంచారి’ గ్రూప్‌ టూర్‌లో ఓ ట్రైన్డ్‌ డాగ్‌ కూడా పాల్గొంటోంది. ఇది యాత్ర మొత్తం డ్రగ్స్‌ వ్యతిరేక నినాదాలు రాసిన జాకెట్లను ధరించి అవగాహన కల్పించనుంది.

* 26 రాష్ట్రాలలో ప్రయాణం

యాత్రలో భాగమైన కుక్క పేరు కల్నల్ బెల్లా. ఇది పోలీస్‌ డాగ్‌ కాకపోవచ్చు, కానీ ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ నుంచి అవసరమైన శిక్షణ తీసుకుంది కాబట్టి పోలీస్‌ డాగ్‌గా చెప్పుకోవచ్చు. నాలుగు సంవత్సరాల వయసు ఉన్న కల్నల్‌ బెల్లా సుదీర్ఘ ప్రయాణానికి బయలుదేరింది.

26 రాష్ట్రాలలో సుమారు 20,000 కి.మీ. ప్రయాణించనుంది. డ్రగ్స్ ఫ్రీ ఇండియాను సాధించేందుకు, డ్రగ్స్‌ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. కలమస్సేరి పోలీస్ స్టేషన్‌లో అధికారిగా పనిచేస్తున్న రఘు PS బెల్లాను పెంచుకుంటున్నారు. బెల్లా ఎప్పుడూ ఆయనకు తోడుగా ఉంటుందని చెప్పారు.

* గురువారం మొదలైన మిషన్‌

దుబాయ్ పోలీస్‌ డాగ్‌లకు శిక్షణ అందిచ్చిన ప్రొఫెషనల్ దగ్గర బెల్లా శిక్షణ పొందినట్లు రఘు చెప్పారు. ఫోర్ట్ కొచ్చి పోలీస్ స్టేషన్‌లో పోస్ట్ చేసినప్పుడు తనతోపాటు బెల్లా కూడా వచ్చేదని తెలిపారు. క్రైమ్ బ్రాంచ్‌లో పని చేస్తున్న చంద్రబాబు అనే వ్యక్తి ఇప్పుడు చేపట్టిన మిషన్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయనకు ఎనిమిది భాషల్లో ప్రావీణ్యం ఉందని రఘు పేర్కొన్నారు. బెల్లాతో కలిసి చేపట్టిన మిషన్ గురువారం ప్రారంభమైంది. నవంబర్ మధ్యలో బృందం తిరిగి వస్తుంది.

ఇది కూడా చదవండి : ఒకే లాటరీకి 200 టికెట్ లు కొన్నాడు..16వేలు ఖర్చు పెట్టి రూ.8కోట్లు సంపాదించాడు

* కేరళ కొబ్బరి మొలకను కాశ్మీర్‌లో నాటుతాం

యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు డ్రగ్స్‌ వినియోగించడంతో కలిగే అనర్థాలను వివరించే సందేశాలు ముద్రించిన జాకెట్లను బెల్లా ధరిస్తుందని రఘు పేర్కొన్నారు. బెల్లా స్థానిక యువకులతో కూడా ఇంటరాక్ట్‌ అవుతుందని తెలిపారు. కారుకు కూడా డ్రగ్స్‌ వ్యతిరేక నినాదాలతో పెయింట్‌ వేశామని అన్నారు. అదే విధంగా కేరళలో పెరిగిన కొబ్బరి మొలకను కాశ్మీర్‌లో నాటి గిన్నిస్‌ రికార్డ్‌ నెలకొల్పే ఆలోచన కూడా ఉందని చెప్పారు. తమ బృందానికి గ్లోబల్ సంచారి అనే పేరు పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రయాణానికి సంబంధించిన విషయాలు, అప్‌డేట్స్‌ యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలలో గ్లోబల్‌ సంచారి పేరుతో ఉన్న ఛానెల్స్‌లో అప్‌లోడ్‌ చేస్తామని రఘు వివరించారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Dog, Drugs, Kerala, National News, Trending, VIRAL NEWS

ఉత్తమ కథలు