హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: ఈ లాలీ పాప్ బరువు 25 కేజీలు..దీన్ని ఎలా తయారు చేశారో తెలిస్తే వావ్ అనాల్సిందే..

Viral Video: ఈ లాలీ పాప్ బరువు 25 కేజీలు..దీన్ని ఎలా తయారు చేశారో తెలిస్తే వావ్ అనాల్సిందే..

Photo Credit : You Tube

Photo Credit : You Tube

Viral Video: ఫిరోజ్ అనే వ్య‌క్తి “విలేజ్ ఫుడ్ ఛానల్” ద్వారా వివిధ‌ర‌కాల వంట‌ను ప‌రిచ‌యం చేస్తుంటాడు. ఇప్పుడీ యువకుడు ఏకంగా 25 కేజీల లాలీపాప్ త‌యారుచేసి ఫుడ్‌ల‌వ‌ర్స్ మ‌న‌సు దోచుకుంటున్నాడు.

ఇంట‌ర్నెట్ పుణ్య‌మా అని చాలామంది వ్యక్తులు త‌మ ప్ర‌తిభ‌ను చాటుకోవ‌డానికి యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారు. యూట్యూబ్ ఛాన‌ల్స్‌ ద్వారా త‌మ ప్ర‌తిభ‌ను లోకానికి చాటుతూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇలాంటి కోవకు చెందుతాడు కేర‌ళ‌కు చెందిన ఫిరోజ్ చుట్టిపార అనే యువ‌కుడు. తన పాకశాస్త్ర ప్రవీణ్యంతో అతడు ఏకంగా పాతిక కిలోల లాలీపాప్‌ను తయారు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఫిరోజ్ అనే వ్య‌క్తి “విలేజ్ ఫుడ్ ఛానల్” ద్వారా వివిధ‌ర‌కాల వంట‌ను ప‌రిచ‌యం చేస్తుంటాడు. ఇప్పుడీ యువకుడు ఏకంగా 25 కేజీల లాలీపాప్ త‌యారుచేసి ఫుడ్‌ల‌వ‌ర్స్ మ‌న‌సు దోచుకుంటున్నాడు. ఈ లాలీపాప్ త‌యారీ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అప్‌లోడ్ చేసిన మూడు రోజుల్లోనే దీన్ని ప‌ది లక్ష‌ల‌ మందికి పైగా వీక్షించారు. 9.48 నిమిషాల వ్య‌వ‌ధి ఉన్న ఈ వీడియోలో ఓ బహిరంగ ప్ర‌దేశంలో లాలీపాప్ త‌యారుచేయ‌డాన్ని చిత్రీక‌రించారు.

భారీ లాలీపాప్‌ను ఇలా త‌యారుచేశారు...

ఈ అతిపెద్ద లాలాపాప్ తయారీ విధానాన్ని వీడియోలో వివరించారు ఫిరోజ్. ముందు ఓ పెద్ద పాత్ర‌లో నీటిని తీసుకుని, అందులో చ‌క్కెర పోశారు. రుచి, రంగులు వచ్చేందుకు కొన్ని పదార్థాలను అందులో వేసి బాగా మరిగించారు. పాకం వచ్చిన తరువాత దాన్ని చల్లబరిచారు. అయితే లాలీపాప్ రూపం రావ‌డానికి వీలుగా ఈ మిశ్ర‌మాన్ని ఒక కుండలో పోసి, అందులో ఓ పెద్ద క‌ర్ర‌ను జొప్పించారు. అది పూర్తిగా చల్లబడిన తరువాత కుండ‌ను బయటి నుంచి పగలగొట్టారు. దీంతో పాతిక‌ కేజీల లాలీపాప్ సిద్ధమైంది.

' isDesktop="true" id="949198" youtubeid="TCu2Aam0A8U" category="trending">

ఫిరోజ్ ఇలాంటి అద్భుతాలు చేయ‌డం ఇదే మొద‌టిసారి కాదు. గ‌తంలోనూ అత‌డు అనేక ప్ర‌యోగాలు చేశాడు. 500 కిలోల కూర‌గాయ‌ల‌తో చేసిన రెసిపీ, ఐదు కిలోల హెర్బ‌ల్ ఫిష్ ఫ్రై చేసే వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. అలాగే అతిపెద్ద ఐస్ క్రీమ్ త‌యారీని త‌న విలేజ్ ఫుడ్ ఛాన‌ల్లో చూపాడు. ఫిరోజ్ చేసే వెరైటీ ప్ర‌య‌త్నాలు నెటిజ‌న్ల‌ను ఆక‌ట్ట‌కుంటున్నాయి. అతడి ఛాన‌ల్‌ను దాదాపు యాభై ల‌క్ష‌ల‌మందిస‌బ్‌స్క్రైబ్ చేసుకున్నారు.

First published:

Tags: Food, Kerala, Viral Video, Youtuber