హోమ్ /వార్తలు /trending /

Viral News : మాజీ ప్రియుడిపై కోపంతో పెద్ద బీభత్సమే సృష్టించిన మహిళ..! మద్యం తాగి..

Viral News : మాజీ ప్రియుడిపై కోపంతో పెద్ద బీభత్సమే సృష్టించిన మహిళ..! మద్యం తాగి..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral News : ఇద్దరి మధ్య మధ్య ప్రేమ బంధం చెడింది అంటే.. ఎవరికో ఒకరికి మూడిందన్నట్టే లెక్క! ప్రేమించినన్ని రోజులు ప్రేమించి తర్వాత వదిలేస్తే.. మోసపోయిన లవర్ ప్రతీకారం తీర్చుకోవడం ఖాయం. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

ఇంకా చదవండి ...

ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటున్నారు అంటే వారి మధ్య చిన్నపాటి గొడవలు రావడం సర్వసాధారణం. అయితే మహా అంటే వారి గొడవలు చివాట్ల వరకే పరిమితం అవుతాయి. కానీ వారి మధ్య ప్రేమ బంధం చెడింది అంటే.. ఎవరికో ఒకరికి మూడిందన్నట్టే లెక్క! ప్రేమించినన్ని రోజులు ప్రేమించి తర్వాత వదిలేస్తే.. మోసపోయిన లవర్ ప్రతీకారం తీర్చుకోవడం ఖాయం. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా జరిగిన ఓ సంఘటన కూడా ఈ కోవలోకే వస్తుంది. 29 ఏళ్ల ఒక మహిళ తన మాజీ ప్రియుడిపై కోపంతో పెద్ద బీభత్సమే సృష్టించింది. ఈమె పూటుగా మద్యం తాగి ఎక్స్ లవర్ ఇంటిని ధ్వంసం చేసింది. అంతేకాదు, ఓ మగ వ్యక్తి సాయంతో ప్రియుడి ఇంటిని గుల్ల చేసింది. ఆమె దాడితో సదరు మాజీ ప్రియుడికి £2,000 (రూ. 2 లక్షలు) కంటే ఎక్కువ నష్టం వాటిల్లింది. ఇంగ్లాండ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. లారెన్ బ్లానీగా అనే మహిళ జేమ్స్ కాంప్‌బెల్‌ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కాంప్‌బెల్‌ ఆమెతో ప్రేమ బంధం తెంచుకున్నాడు. ఆ రోజు నుంచి అతడిపై బాగా కోపం పెంచుకొంది సదరు మాజీ ప్రియురాలు. పగ తీర్చుకోవాలనుకుని కూడా ప్లాన్ రచించింది. చివరికి అతడికి చెందిన ఇంటిని నాశనం చేయాలని నిశ్చయించుకుంది. ఇందుకు తన స్నేహితుడి సహకారం కూడా తీసుకుంది.

వీరిద్దరూ కలిసి ఈ ఏడాది మార్చి 21న బాగా మద్యం సేవించి జేమ్స్ కాంప్‌బెల్‌కు చెందిన ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఇంటి లోపలికి వెళ్లేందుకు లారెన్.. కిటికీని బద్దలు కొట్టింది. గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఆ సందులో బీభత్సం సృష్టించింది. కిటికీ బద్దలు కొట్టడానికి చాలా ఖరీదైన కాంప్‌బెల్‌ గిటార్ నే ఉపయోగించిందీ కోపిష్టి ప్రియురాలు.

అయితే ఆమె ప్రవర్తనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు వచ్చే సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అలాగే లారెన్, ఆమె సహచరుడు అక్కడి నుంచి ఉడాయించారు. అప్పటికే కాంప్‌బెల్‌ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ బాగా డ్యామేజ్ అయిందని.. ఘటనా స్థలం గాజు ముక్కలతో రక్తపు చుక్కలతో నిండిపోయి కనిపించిందని పోలీసులు తెలిపారు. ఈ జంట క్యాంప్‌బెల్ £2,180 విలువైన ఆస్తికి నష్టాన్ని కలిగించారు.

ఇందులో అతని £900 విలువైన గిటార్, రెండు టీవీ సెట్‌లు పూర్తిగా పాడు కావడంతోపాటు £500 విలువైన మరో గిటార్ కనిపించకుండా పోయింది. దాడి జరిగిన సమయంలో క్యాంప్‌బెల్ ఇంట్లో లేడు. ఘటన అనంతరం మాట్లాడిన తాను.. తనకు ఎలాంటి ఇన్సూరెన్స్ కవరేజ్ లేదని.. ఖర్చులను తానే భరించాలని చెబుతూ వాపోయాడు.

లారెన్ తో 18 నెలల క్రితమే విడిపోయానని ఆ సమయం నుంచి తన కుమార్తె ఆలనాపాలనా చూసుకుంటున్నానని క్యాంప్‌బెల్ పోలీసులకు వెల్లడించాడు. లారెన్ తన ఇంటిని ఎందుకు నాశనం చేయాలని నిర్ణయించుకుందో తనకు అర్థం కావడం లేదన్నాడు. ఈ ప్రాంతం చాలా చీకటిగా ఉంటుందని ముఖ్యంగా దొంగతనం తర్వాత తనలో భయం మరింత పెరిగిపోయిందని అతడు చెప్పుకొచ్చాడు. ఈ దాడి వ్యక్తిగత కక్షతో చేసినట్లు అనిపిస్తుందని.. ఇక్కడ ఉండటం ఏమాత్రం సురక్షితం కాదని తాను భావిస్తున్నట్టు తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారెన్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఇది కూడా చదవండి :  అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది..? రెండు గ్రూపులుగా జట్టు.. కోహ్లీపై సీనియర్లు గుస్సా..!

దాడికి ముందు లారెన్ ధరించిన బ్యాగ్‌లో కొంత ఆహారం, వస్తువులను ఉన్నట్లు పోలీసులు లివర్‌పూల్ క్రౌన్ కోర్టుకి తెలియజేశారు. ప్రాసిక్యూటింగ్ న్యాయవాది మిస్ నార్దీమ్ నెమత్ మాట్లాడుతూ.. తన పిల్లలను కాంప్‌బెల్‌ తనకి దూరం చేశాడని లారెన్ అతడిని నిందించినట్లు చెప్పారు. ఆ కోపంతోనే మద్యం తాగి అతడి ఇంటిపై ఆమె దాడి చేసినట్లు వివరించారు. చివరికి బ్లానీ దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించింది.

First published:

Tags: Breakup, England, Love, Trending news, VIRAL NEWS

ఉత్తమ కథలు