హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral News : ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు..అందుకు నిదర్శనం ఈ అమ్మ కథ...

Viral News : ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు..అందుకు నిదర్శనం ఈ అమ్మ కథ...

Photo Credit : ANI

Photo Credit : ANI

Viral News : ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు.. కేజీఎఫ్ సినిమాలో డైలాగ్. ఈ అమ్మ కథ వింటే మీరు కూడా ఇదే నిజమంటారు. ఇంతకీ ఏం జరిగిదంటే..

ఆమె తొమ్మిది నెలల నిండు గర్భిణి.. ప్రసవ సమయం సమీపిస్తున్న తరుణంలో కరోనా బారిన పడింది.. పరిస్థితి చేజారడంతో వెంటిలేటర్ అమర్చారు.. దీంతో ఆసుపత్రి పడకపైనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. కానీ మహమ్మారి కారణంగా బిడ్డను దగ్గరకు తీసుకోలేకపోయింది. అయితే కన్నపేగుపై మమకారమో, కుటుంబంపై అనురాగమో గాని, కరోనాతో పోరాడి గెలిచిందామె. 10 రోజుల తర్వాత తన బిడ్డను ఎత్తుకొని ఆనందంతో కంటతడి పెట్టింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన 25 ఏళ్ల యువ వైద్యురాలు అర్ఫా సజాదిన్.. క్లిష్ట సమయంలో కరోనాను ఓడించి, బిడ్డను దగ్గరకు తీసుకుంది.37 వారాల గర్భిణి అయిన డాక్టర్ అర్ఫాకు ఇటీవలే కరోనా సోకింది. దీంతో హౌరా ఐఎల్ఎస్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స ప్రారంభించారు. ఆసుపత్రిలో చేరిన మూడు రోజులకే ఆమె ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఇంట్రావాస్కులర్ కోగ్యూలేషన్ బారిన పడిన అర్ఫాను 10 రోజుల వెంటిలేటర్ పై ఉంచాల్సి వచ్చిందని ఆమెకు చికిత్స చేసిన డాక్టర్ కౌశిక్ నాహ బిశ్వాస్ తెలిపారు.

అందరూ ఆశలు వదులుకున్నారు..

"25 ఏళ్ల అర్ఫా సజాదిన్ ను వెంటిలేటర్ పైనే ఉంచాల్సి వచ్చింది. ఆసుపత్రిలో చేరినప్పుడు రక్తంలో చక్కెర స్థాయి చాలా తక్కువగా ఉంది. దీంతో ఆమెకు సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరూ ఆమె బతుకుతుందనే ఆశను కోల్పోయారు. 10 రోజుల పాటు వెంటిలేటర్ పైనే మెకానికల్ సపోర్టుతో ఉండిపోయింది. అంతేకాకుండా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ చివరకు కరోనా వైరస్ ను ఓడించింది" అని డాక్టర్ కౌశిక్ తెలిపారు.

శిశువుకు కరోనా నెగటివ్..

పుట్టిన బిడ్డకు కోవిడ్ టెస్ట్ చేశామని, అయితే శిశువుకు నెగటివ్ వచ్చిందని వైద్యులు చెప్పారు. డాక్టర్ అర్ఫా.. డిస్సిమినేటేడ్ ఇంట్రావాస్కులర్ కోగ్యోలేషన్(డీఐసీ) అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీని వల్ల రక్తనాళాల్లో రక్తం అసాధారణ స్థాయిలో గడ్డకట్టుకుపోయే పరిస్థితి ఉంటుందని డాక్టర్ కౌశిక్ తెలిపారు. ఐసీయూలో ఉన్నప్పుడు ఆమెతో మాట్లాడుతూ, ధైర్యం చెప్పామన్నారు. "నీ బిడ్డ నీకోసం ఎదురుచూస్తుంది. నువ్వు ఓ పోరాట యోధురాలివి. ఆశలు వదులుకోవద్దు.. అంటూ అందరం ఆమెకు ధైర్యం చెప్పాం. చివరకు ఆమె వైరస్ ను జయించింది" అని డాక్టర్ కౌశిక్ వివరించారు. కరోనాను జయించిన డాక్టర్ అర్ఫా చివరకు పది రోజుల తర్వాత కన్నబిడ్డను దగ్గరకు తీసుకుంది. ఆశలు వదులుకున్న తరువాత కూడా, మహమ్మారిని జయించి బిడ్డను చూడటం పట్ల ఆమెతో పాటు హాస్పిటల్ సిబ్బంది సైతం హర్షం వ్యక్తం చేశారు.

First published:

Tags: Bengal, Mother, Trending, VIRAL NEWS

ఉత్తమ కథలు