Home /News /trending /

MEET AMBULANCE DRIVER SYED MUBARAK WHO CONTINUED TO HEED THE CALL OF DUTY EVEN AS HIS TWO YEAR OLD SON WAS FIGHTING FOR HIS LIFE IN A HOSPITAL GH SRD

Ambulance Driver : ఓ వైపు ప్రాణాపాయ స్థితిలో కుమారుడు..మరోవైపు కర్తవ్య బాధ్యతలు..ఇతడు ఏం చేశాడంటే..

Photo Credit : Face book

Photo Credit : Face book

Ambulance Driver : కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, విధులకు హాజరయ్యారు ఒక అంబులెన్స్ డ్రైవర్. తన రెండేళ్ల కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ..తన కర్తవ్య బాధ్యతలు నిర్వర్తించాడు.

కరోనా కాలంలో ఫ్రంట్ లైన్ కార్మికులు అందించిన సేవలను ఎవరూ మర్చిపోలేరు. ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వర్తించారు వైద్య, ఆరోగ్య సిబ్బంది. ఈ క్రమంలో అంబులెన్స్ డ్రైవర్లు సైతం ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నారు. రోగితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండేవారిలో వీరు కూడా ఒకరు. అయితే ఇటీవల కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, విధులకు హాజరయ్యారు కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఒక అంబులెన్స్ డ్రైవర్. తన రెండేళ్ల కుమారుడు ఆసుపత్రి పడకపై ఉన్నప్పటికీ, బాధ్యతల నుంచి తప్పుకోలేదు. కరోనా రోగులను ఆసుపత్రులకు తరలిస్తూ ఎంతో మంది ప్రాణాలను రక్షించడంలో తోడ్పడ్డారు. కానీ దురదృష్టవశాత్తు అతడు తన కుమారుడిని కోల్పోయాడు.వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మైసూరుకు చెందిన సయ్యద్ ముబారక్ అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కరోనా కాలంలో ఎంతో మందిని సురక్షితంగా ఆసుపత్రులకు తరలించారు. అతడికి ఇబ్రహీం అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. జూన్ 11న ప్రమాదవశాత్తు బాలుడు వేడినీటి టబ్‌లో పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. కానీ చికిత్స పొందుతున్న బాలుడు, దురదృష్టవశాత్తు మంగళవారం మరణించాడు. ఆసుపత్రి పడకపై కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్నప్పటికీ సయ్యద్ తన విధులకు మాత్రం సెలవు పెట్టలేదు. ఇందుకు కారణం లేకపోలేదు. అంబులెన్స్ డ్రైవర్లు ఎక్కువ మంది లేనందువల్ల అతడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరోనా భయంతో ఎవరూ ఈ ఉద్యోగంపై ఆసక్తి చూపించట్లేదని సయ్యద్ తెలిపారు.

‘నా కుమారుడుకి శరీరమంతా గాయాలయ్యాయి. తమ వంతు కృషి చేస్తామని వైద్యులు హామీ ఇచ్చారు. కానీ ఈ కష్టకాలంలో కరోనా రోగులకు నా లాంటి వ్యక్తుల సహాయం అవసరమని భావించాను. దీంతో నేను కూడా భగవంతుడు, వైద్యులపై భారం వేసి నా బాధ్యత నిర్వర్తించాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో అంబులెన్స్‌లో కొంతమందిని మైసూరులోని నంజాంగుడ్ తాలూకాకు తీసుకెళ్లాను’ అని సయ్యద్ ముబారక్ వివరించారు. గత మూడు రోజులుగా సెలవు పెట్టకుండా బాధ్యతలు నిర్వర్తిస్తుంటే.. ఇంతలోనే ఇలా జరిగిందని వాపోయారు.

సోమవారం రాత్రి మైసూరు నుంచి చామరాజనగర్ జిల్లాకు రోగిని తరలించడానికి వెళ్లారు సయ్యద్. అనంతరం అర్ధరాత్రికి తిరిగి వచ్చారు. మంగళవారం ఉదయం నుంచి అతడి కుమారుడు చికిత్సకు స్పందించడం మానేశాడు. దీంతో ఆవేదనకు లోనయ్యాడు. తన సొంత కొడుకు ఆసుపత్రి బెడ్‌పై ఉన్నప్పటికీ, ప్రజలకు సేవ చేసిన సయ్యద్‌ను పలువులు నేతలు ప్రశంసిస్తున్నారు. అతడు గత నెలన్నరగా మంచి పనులు చేస్తూనే ఉన్నాడని కొనియాడారు మైసూరు భాజపా అధ్యక్షుడు శ్రీవత్స. సొంత కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించాడని, అతడి సేవను మెచ్చుకోకుండా ఉండలేమని సానుభూతి వ్యక్తం చేశాడు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Corona effect, Free ambulance, Mysore, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు