హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video : ఈ తొమ్మిదేళ్ల బాలిక ప్రసంగానికి ఫిదా అవుతున్న ప్రపంచం..

Viral Video : ఈ తొమ్మిదేళ్ల బాలిక ప్రసంగానికి ఫిదా అవుతున్న ప్రపంచం..

Viral Video : ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న జాత్యాహంకారం, రాజ‌కీయాల గురించి తొమ్మిదేళ్ల విద్యార్థి మాట్లాడిన మాటలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రసంగాన్ని చూసి మంత్రముగ్దులవుతున్నారు నెటిజన్లు.

Viral Video : ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న జాత్యాహంకారం, రాజ‌కీయాల గురించి తొమ్మిదేళ్ల విద్యార్థి మాట్లాడిన మాటలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రసంగాన్ని చూసి మంత్రముగ్దులవుతున్నారు నెటిజన్లు.

Viral Video : ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న జాత్యాహంకారం, రాజ‌కీయాల గురించి తొమ్మిదేళ్ల విద్యార్థి మాట్లాడిన మాటలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రసంగాన్ని చూసి మంత్రముగ్దులవుతున్నారు నెటిజన్లు.

  ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న జాత్యాహంకారం, రాజ‌కీయాల గురించి తొమ్మిదేళ్ల విద్యార్థి మాట్లాడిన మాటలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రసంగాన్ని చూసి మంత్రముగ్దులవుతున్నారు నెటిజన్లు. ''మీరంతా నాకు అబ‌ద్ధాలు చెప్పారు. దీంతో నేను తీవ్ర‌మైన నిరాశ‌కు గుర‌య్యాను" అంటూ త‌న స్కూల్ యాజ‌మాన్యాన్ని నిల‌దీసిందామె. ఈ సంఘ‌ట‌న అమెరికాలోని లేక్‌విల్లే ఏరియా స్కూల్ బోర్డు మీటింగ్‌లో జ‌రిగింది. వివరాల్లోకి వెళ్తే.. మిన్నేసోటా ప్రాంతానికి చెందిన నొవాలీ అనే బాలిక స్థానిక లేక్‌విల్లే ఏరియా స్కూల్ లో చ‌దువుతోంది. కింద‌టి నెల‌లో జ‌రిగిన స్కూల్ బోర్డు స‌మావేశంలో ఈ విద్యార్థి ఇచ్చిన ప్ర‌సంగం ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. స్కూల్ బోర్డు తీరును ఆమె తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. విద్వేషం, జాత్యాహంకారం, రాజ‌కీయాల గురించి ఆమె మాట్లాడింది.కింద‌టేడాది నల్లజాతీయుడైన జార్జి ఫ్లాయిడ్ హ‌త్య అనంత‌రం అమెరికా అట్టుడికిపోయిన విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో బ్లాక్ లైవ్స్ మాట‌ర్ అనే ఉద్య‌మం రూపుదాల్చింది. త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌లో లేక్‌విల్లే ఏరియా స్కూల్ ఒక తీర్మానం చేసింది. జాతివివ‌క్ష‌కు సంబంధించిన‌ అంశాలు, రాజ‌కీయాలు త‌మ బ‌డిలోకి అడుగుపెట్ట‌డానికి వీల్లేద‌ని యాజమాన్యం తీర్మానించింది. వాటికి సంబంధించిన పోస్టర్లు ఏవీ స్కూల్ ఆవ‌ర‌ణ‌లో క‌నిపించ‌కూడ‌ద‌ని ఆదేశించింది. అయితే స్కూల్ ఆవ‌ర‌ణ‌లో బ్లాక్ లైవ్స్ మాట‌ర్‌కు సంబంధించిన ఫోటోలు, జాతివివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న క‌వి అమందా గోర్మాన్ పోస్ట‌ర్‌ను నొవాలీ చూసింది. దీంతో కింద‌టి నెల‌లో జ‌రిగిన స్కూల్ బోర్డు స‌మావేశంలో ఆమె య‌జ‌మాన్యాన్ని ప్ర‌శ్నించింది.

  ‘నేను చాలా నిరాశ‌కు గుర‌య్యాను. రెండువారాల కింద‌ట స్కూల్లో రాజ‌కీయాలు వ‌ద్ద‌ని మీరు చెప్పిన విష‌యాల‌ను నేను న‌మ్మాను. కానీ నా న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేశారు’ అని నొవాలీ ఆవేద‌న చెందింది. తాను పోస్ట‌ర్ల‌ను చూశాక ప్రిన్సిపాల్ రూమ్‌కు వెళ్ళి, ఆ పోస్ట‌ర్ల‌ను తొల‌గించాల్సిందిగా కోరాన‌ని నొవాలీ తెలిపింది. అయితే ఈ పోస్ట‌ర్లు స్కూల్ బోర్డే ఏర్పాటు చేసినందున వాటిని తాను తొల‌గించ‌లేన‌ని ప్రిన్సిపాల్ చెప్పార‌ని ఆమె పేర్కొంది. ‘ఈ పోస్ట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా మీరు ఏం చేయ‌ద‌లుచుకున్నారో ఎవ‌రికీ తెలియ‌ద‌ని ఊహిస్తున్నారా?’ అని నొవాలీ ప్ర‌శ్నించింది.

  బ్లాక్ లైవ్ మాట‌ర్స్ సిద్ధాంతాన్నితాను న‌మ్మ‌న‌ని, అది మ‌నుషుల‌ను జాత్యాహంకారులుగా మార్చుతుంద‌ని, తాను మార్టిన్ లూథ‌ర్ కింగ్ బోధ‌న‌ల‌కు కూడా వ్య‌తిరేక‌మ‌ని తెలిపింది.‘నేను కేవ‌లం మ‌నుషుల‌ను వారి రంగు, చ‌ర్మం, ఆధారంగా గుర్తించ‌ను. వారి రంగు, జుట్టు, క‌ళ్ళు ఎలా ఉన్నా లెక్క చేయ‌ను. వారిని మ‌నుషులుగా మాత్ర‌మే చూస్తాను. వారు న‌న్ను ఎలా చూస్తున్నార‌నే విషయం ఆధారంగానే.. నేను వారిని జ‌డ్జ్ చేస్తాను. కానీ వారి రంగు, జుట్టు, క‌ళ్ళ‌ను బ‌ట్లి కాదు’ అంటూ నొవాలి బోర్డు మీటింగ్ లో త‌న ప్ర‌సంగాన్ని ముగించింది. అయితే బ్లాక్ లైవ్ మాటర్స్ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నవారు మాత్రం, నొవాలీ ప్రసంగాన్ని ఖండించారు.

  First published:

  Tags: America, Viral Video

  ఉత్తమ కథలు