Elephants: ఏనుగుల పాలిట దైవంగా మారిన స్కూల్ టీచర్.. ఏం చేశాడంటే..

Photo Credit : Twitter

Elephants: ఏనుగులు మనుషుల మధ్య ఘర్షణల కారణంగా 2009-2018 కాలంలో 116 మంది ప్రజలు మరణించారని.. 217 మంది గాయపడ్డారు. ప్రతి ఏటా సగటున 7 ఏనుగులు చనిపోతున్నాయ్.

  • Share this:
జంతువులు వాటంతటవే మనుషులపై ఎప్పుడూ దాడి చేయవు. మనుషులే రెచ్చగొట్టి మరీ జంతువులను దాడి చేసేలా ప్రేరేపిస్తుంటారు. ఇది ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఏనుగులు సంచరించే ప్రదేశంలో హైపవర్ ఎలక్ట్రిక్ తీగలు ఏర్పాటు చేసి వాటి చావుకి కారణం అవుతున్నారు. కొందరు ఏనుగు దంతాల కోసం వాటిని వేటాడి మరీ చంపుతున్నారు. ఈ క్రమంలో మానవులకు, ఏనుగులకు మధ్య ఘర్షణ తలెత్తుతోందని గ్రహించారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎస్పీ పాండే అనే స్కూల్ టీచర్. ఈ ఘర్షణలను అరికట్టడానికి కృషి చేస్తున్నారు. ఆయన ఏనుగుల ఎక్కువగా కనిపించే ఐదు కారిడార్లలో ఘర్షణ వాతావరణాన్ని తగ్గించే దిశగా వర్క్‌షాప్‌లను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. రియల్ హీరోగా మారిన ఈ టీచర్‌పై ప్రస్తుతం అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. జల్‌పైగురి జిల్లాలోని మల్‌బజార్‌కు చెందిన 43ఏళ్ల ఎస్పీ పాండే ఏనుగుల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తున్నారు. ఏనుగులకు, మనుషులకు మధ్య ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చేస్తున్న కృషికి ప్రశంసలు దక్కాయి. అతన్ని వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుటిఐ) గ్రీన్ కారిడార్ ఛాంపియన్ టైటిల్‌తో సత్కరించింది.

తాను పనిచేస్తున్న ప్రాంతంలో దాదాపు 500 ఏనుగులు ఉన్నట్లు పాండే తెలుసుకున్నారు. ఆ తరువాత అపాల్‌చంద్-మహానంద, గోరుమారా-అపాల్‌చంద్, అపాల్‌చంద్-కాలింపాంగ్, అపాల్‌చంద్-కాలింపాంగ్, చప్రమారి-కాలింపాంగ్ వంటి ఐదు కారిడార్లలో ఏనుగులు ఎక్కువగా తిరుగుతున్నాయని గుర్తించారు. దాంతో ఈ ప్రదేశాల్లో ఏనుగులకు, మనుషులకు మధ్య ఎలాంటి ఘర్షణలు జరగకుండా అవగాహన పెంచుతున్నారు.

ఇది కూడా చదవండి :  వీడెవడండీ బాబూ..! మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్ లోనే మకాం వేశాడు..

ఏనుగులు మనుషుల మధ్య ఘర్షణల కారణంగా 2009-2018 కాలంలో 116 మంది ప్రజలు మరణించారని.. 217 మంది గాయపడ్డారని పాండే వెల్లడించారు. ప్రతి ఏటా సగటున 7 ఏనుగులు చనిపోతున్నాయని చెప్పారు. రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా వాటి మరణాలు 50% తగ్గించవచ్చని వెల్లడించారు.

ముళ్ల కంచె ప్రమాదాలతో పాటు ఏనుగులు రైల్వే ట్రాక్‌లను దాటుతూ చనిపోతున్నాయని పాండే గ్రహించారు. ఈ సమస్యను అరికట్టడానికి అందరూ కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏనుగులు, మనుషులు ప్రశాంతంగా సహజీవనం చేయడానికి వీలుగా సున్నితమైన చర్యలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఏనుగులు హాని తలపెట్టని ప్రాణులుగా మనుషులకు పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ స్కూల్ టీచర్ గురించి తెలుసుకున్న జంతు ప్రేమికులు అతని సేవలను ప్రశంసిస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published: