MEET 38 YEAR OLD SHANTHI WHO WAS LIVING ON THE STREETS BUT NOW SHE HAS A HOME A JOB AND DIGNITY READ HER STORY GH SRD
Viral: ఒకప్పుడు యాచకురాలు.. ఇప్పుడు రైల్వే ఉద్యోగి.. ఆమె జీవితం ఎలా మారిందంటే..
Photo Credit : You tube
Viral: ఒకప్పుడు ఆమె రోడ్ల పక్కనే జీవించారు.. తినేందుకు కూడా యాచించేవారు.. ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమెకు ఓ సొంత ఇల్లు, ఉద్యోగం ఉన్నాయి. ఇదేలా సాధ్యమైందో తెలుసా..?
ఒకప్పుడు ఆమె రోడ్ల పక్కనే జీవించారు.. తినేందుకు కూడా యాచించేవారు.. ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమెకు ఓ సొంత ఇల్లు, ఉద్యోగం ఉన్నాయి. ఆమె కూతురు చదువుకుంటోంది. ఒక సందర్భంలో అనుకోని సంఘటన ఆమె జీవితాన్ని మార్చింది. ఇలా కష్టాల నుంచి బయటపడిన ఆ మహిళే చెన్నైకు చెందిన శాంతి.“మేం రోడ్డు పక్కన నిద్రించేవాళ్లం. ఎండకు, వానకు ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్లం. అన్నం కోసం కూడా యాచించా. వేరే వాళ్లు తినగా మిగిలిన ఆహారం తినేదాన్ని. కొన్నిసార్లు యాచిస్తుంటే.. కొందరు మగవాళ్లు అసభ్యకరంగా మాట్లాడేవారు. అప్పుడు మహిళగా ఎందుకు పుట్టానా అని బాధపడేదాన్ని.నాకు కనీసం రెండో చీర కూడా ఉండేది కాదు. అదే చీరను ఉతుక్కొని మళ్లీ ధరించేదాన్ని” అని శాంతి చెప్పారు.
అయితే శాంతి ప్రస్తుతం తన సొంత ఇంట్లో ఉంటున్నారు. రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నారు. అసలు తన జీవితం ఇలా మారుతుందని ఎప్పుడూ అనుకోలేదని ఆమె చెప్పారు. “అప్పట్లో మాకు ఏం ఉండేదికాదు. ఇప్పుడు అందరిలా.. నేను పనికి వెళుతున్నాను. చాలా మందితో మాట్లాడుతున్నాను. ఎంతో సంతోషంగా, మనసు ప్రశాంతంగా ఉంది” అని శాంతి అన్నారు.
* ఆమె జీవితం ఎలా మారిందంటే…
వీధుల్లో, రోడ్ల పక్కన నివసిస్తున్న వారి పునరావాసం కోసం ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు చేపట్టిన బర్డ్స్నెస్ట్ కార్యక్రమం వల్ల శాంతి జీవితం మారిపోయింది. రోడ్డు పక్కన నివసిస్తూ ఎన్నో కష్టాల్లో ఉన్న ఆమెను ఈక్విటాస్కు చెందిన ఓ ప్రతినిధి అప్పట్లో కలిశారు. అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. “మీ ఇంటి కోసం మేం అద్దె చెల్లిస్తామని ఆయన (ఈక్విటాస్ ప్రతినిధి) చెప్పారు. ఆ సాయం మాకు అన్ని విధాలుగా సాయం చేసింది. అలాగే నాకు వారు ఉద్యోగం చూపించారు. నా కూతురు చదువుకు అయ్యే ఖర్చు కూడా ఇస్తున్నారు. స్కాలర్షిప్ ఇప్పిస్తున్నారు. అలాగే నాకు ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులు కూడా వచ్చేందుకు ఎంతో సాయం చేశారు” అని శాంతి చెప్పారు.
ఈక్విటాస్ బర్డ్స్నెస్ట్ ప్రోగ్రాం 2010లో ప్రారంభం కాగా ఇప్పటి వరకు 2074 మందికి చెన్నైలో పునరావాసం కల్పించారు. ఇళ్లు, ఆహార భద్రత, ఆరోగ్యం, జీవించేందుకు పని నేర్పించడం, ప్రాథమిక విద్య ఇలా అన్ని రకాల సాయం చేసింది. “మాకు వారు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం మేం ఇలా ఉన్నామంటే అందుకు కారణం ఈక్విటాస్ మాత్రమే. జీవితంతో పోరాడేందుకు నాకు వారు చేయూతనందించారు. ఇప్పుడు మేం కూడా వారికి చేయూతనందించే ప్రయత్నం చేస్తున్నాం” అని వివరించారు శాంతి.