Home /News /trending /

MEET 31 YEAR OLD KYLE GORDY A RESIDENT OF LOS ANGELES WHO IS FATHER TO 48 CHILDREN AND STILL COUNTING DESPITE BEING SINGLE AND REJECTED BY WOMEN GH SRD

Bachelor Father: పెళ్లి చేసుకోలేదు, మహిళలతో రిలేషన్ పెట్టుకోలేదు.. అయినా 48 మంది పిల్లలకు తండ్రి.. అదెలాగంటే..

Kyle Gordy ( PC : Twitter)

Kyle Gordy ( PC : Twitter)

Bachelor Father: కొందరు మనుషుల కథలు వింటే వెంటనే నమ్మబుద్ధి కాదు. తర్వాత అసలు సంగతి తెలిసి నోరెళ్లబెట్టడం మనందరి వంతవుతుంది. అలాంటి ఓ యువకుడి కథ ఇప్పుడు నెటిజన్లకు తల తిరిగేలా చేస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
కొందరు మనుషుల కథలు వింటే వెంటనే నమ్మబుద్ధి కాదు. తర్వాత అసలు సంగతి తెలిసి నోరెళ్లబెట్టడం మనందరి వంతవుతుంది. అలాంటి ఓ యువకుడి కథ ఇప్పుడు నెటిజన్లకు తల తిరిగేలా చేస్తోంది. అమెరికా (America)లోని లాస్ ఏంజెల్స్‌ (Los Angeles)కి చెందిన ఈ యువకుడి పేరు కైల్ గోర్డి (Kyle Gordy), వయసు 31 ఏళ్లు. ఇతడు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ఆడవారితో డేటింగ్ చేయాలనుకున్నా అతన్ని అందరూ ఛీ కొట్టారు. అయినా కూడా ఇప్పటివరకు ఏకంగా 48 మంది పిల్లల (Children)కు తండ్రయ్యాడు (Father). అదెలాగా అని స్టన్ అవుతున్నారా? అయితే మీరు ఈ కథ చదవాల్సిందే.

భారతదేశంలో పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కనడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అమెరికా వంటి దేశాల్లో పెళ్లి కాకుండానే పిల్లల్ని కనడం పెద్ద విషయమే కాదు. కానీ ఈ యువకుడు ఏ అమ్మాయితోనూ సెక్స్ రిలేషన్‌షిప్‌లో లేకున్నా అతని వల్లే 48 మంది పిల్లలు పుట్టారు.

అది ఎలా అంటే, కైల్ గోర్డి ఒక స్పెర్మ్ డోనార్‌గా (Sperm Donor) పని చేస్తున్నాడు. మీడియా నివేదికల ప్రకారం, మరికొద్ది రోజుల్లో ఈ పెళ్లికాని తండ్రికి కనీసం 10 మంది పిల్లలు పుడతారు. అంటే వీర్యదానంతో హాఫ్ సెంచరీ పిల్లలను పుట్టించిన రికార్డు కూడా ఈ బ్యాచిలర్ క్రియేట్ చేయబోతున్నాడన్న మాట.

ఈ యువకుడు ఇప్పటివరకు సింగల్‌గా ఉండడానికి తాను చేస్తున్న పనే కారణం. అతనొక స్పెర్మ్ డోనార్ అని తెలిసినప్పుడు అమ్మాయిలు అతనిని మరో ఆలోచన లేకుండా రిజెక్ట్ చేస్తున్నారు. అతనితో డేటింగ్ చేయడానికి అస్సలు ఆసక్తి చూపడం లేదు. పెళ్లి చేసుకోవడానికి కూడా ఏ అమ్మాయి ముందుకు రావడం లేదు.

దాంతో కైల్ గోర్డి తెగ బాధపడిపోతున్నాడు. “నేను మహిళలకు సహాయం చేస్తున్నానని తాము అర్థం చేసుకోగలమని అమ్మాయిలు నాకు చెబుతుంటారు. కానీ వారు ఇతర మహిళలతో పిల్లలను కన్న నాతో ఉండటానికి ఇష్టపడటం లేదు. నేను గత 10 ఏళ్లలో ఎవరితోనూ డేటింగ్ చేయలేదు. నేను స్పెర్మ్ డోనర్ అని అమ్మాయిలకు చెప్పినప్పుడు, వారు నా పట్ల ఆసక్తి చూపడం లేదు." అని వాపోయాడు కైల్.

ఇది కూడా చదవండి : రష్యా మహిళలకు పుతిన్ బంపర్ ఆఫర్.. అలా చేస్తే రూ. 13 లక్షల రివార్డు.. పూర్తి వివరాలు

* కైల్ ప్రజలకు చేసే హెల్ప్ ఏంటి?
కైల్ తన స్పెర్మ్‌ను సంతానం కోసం వచ్చే వారికి దానం చేస్తున్నాడు. అలా ఆడవారికి మాతృత్వాన్ని ప్రసాదిస్తున్నాడు. కైల్ సోషల్ మీడియా ద్వారా కూడా తన సేవలను అందరికీ తెలియజేస్తున్నాడు. అయితే ఈ యువకుడు అందరిలా స్పెర్మ్ బ్యాంక్‌కు వెళ్లడు. అతని ఇంటికే సంతానం లేని తల్లులు వచ్చి తన స్పెర్మ్‌ను పట్టుకెళ్తారు. సాధారణంగా స్పెర్మ్ బ్యాంక్‌ల్లో వీర్యాన్ని తీసుకోవడానికి చాలామంది తల్లులు ఇష్టపడరు.

ఎందుకంటే అక్కడ దాతలు ఎవరో తెలియదు. అంటే తల్లిదండ్రులకు తమ బిడ్డ నిజమైన తండ్రి ఎవరో తెలియదు. ఇది నచ్చకే చాలామంది తన ఇంటికి వస్తున్నారని కైల్ చెప్పాడు. కైల్ ఒక లెస్బియన్ జంట అభ్యర్థన మేరకు తొలిసారిగా స్పెర్మ్ డొనేట్ చేశాడు. అలా 8 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారిగా తన వీర్యాన్ని దానం చేసి తండ్రయ్యాడు. ఆపై ఆన్‌లైన్ అభ్యర్థనల మేరకు అతను వేర్వేరు మహిళలకు స్పెర్మ్ దానం చేయడం ప్రారంభించాడు.
Published by:Sridhar Reddy
First published:

Tags: International news, Sperm, Trending news, USA, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు