#Me Too: గుత్తా జ్వాలకి పీవీ సింధు సపోర్ట్...!

‘జరిగినది భయం లేకుండా చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి... సీనియర్స్ విషయంలో ఏం జరిగిందో తెలీదు... ’ - బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వ్యాఖ్యలు

news18-telugu
Updated: September 7, 2020, 5:51 PM IST
#Me Too: గుత్తా జ్వాలకి పీవీ సింధు సపోర్ట్...!
పీవీ సింధుతో గుత్తా జ్వాల (image: Pinterest)
  • Share this:
బాలీవుడ్‌ను ‘మీటూ’ మూమెంట్ అల్లకల్లోలం చేస్తోంది. సీనియర్ నటుడు నానాపటేకర్‌పై తనుశ్రీదత్తా కామెంట్స్ తర్వాత ఒక్కొక్కరుగా సీనియర్, జూనియర్ నటీమణులు తమ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడిస్తున్నారు. తాజాగా బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ గుత్తా జ్వాల కూడా ‘మీ టూ’ అంటూ తనకు ఎదురైన ‘మెంటల్ హెరాస్‌మెంట్’ గురించి వివరించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ తారలు ‘లైంగిక వేధింపుల’ గురించి బయటపెడుతుంటే... గుత్తా జ్వాల మాత్రం ‘మానసిక వేధింపుల’ గురించి ప్రస్తావించి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా దేశానికి ఆడే క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ గురించి జ్వాల సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం.


డబుల్స్ ప్లేయర్ గుత్తా జ్వాలకు సింగిల్స్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు మద్ధతు ప్రకటించింది. తాజాగా ‘వోడాఫోన్ సఖి’ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న పీవీ సింధు... గుత్తా జ్వాల కామెంట్స్ గురించి మీడియాతో మాట్లాడింది...

జీవితంలో ఎదుర్కొన్న ఇలాంటి అనుభవాల గురించి ముందుకొచ్చి మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి. నేను అలాంటి వారిని ప్రశంసిస్తాను. గౌరవిస్తాను...
పీవీ సింధు, బ్యాడ్మింటన్ ప్లేయర్


అయితే గుత్తా జ్వాల ఎదుర్కొన్న మానసిక వేధింపుల గురించి మాత్రం తనకు తెలియదని చెప్పింది సింధు. ‘మహిళలు రాత్రి వేళల్లో బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు. పని చేయడానికి భయపడుతున్నారు. వారి కలలను సాధించుకోవడానికి భయపడుతున్నారు. మహిళల కోసం వోడాఫోన్ సఖీ ప్లాన్‌తో రావడం అభినందనీయం. ఆకస్మిక ప్రమాదంలో ఇరుక్కున్నవారికి ఈ పథకంఎంతగానో ఉపయోగపడుతుంది...’ అంటూ వ్యాఖ్యానించింది సింధు.


‘‘అవును నేను హైదరాబాదీనే. కానీ నా సీనియర్స్ గురించి, కోచ్‌ల గురించి నాకు పెద్దగా తెలియదు. నేను ఆడడం మొదలెట్టినప్పటి నుంచి వాతావరణం బాగానే ఉంది. నాకైతే ఎటువంటి చేదు అనుభవాలు ఇప్పటిదాకా ఎదురుకాలేదు...’’ అంటూ చెప్పుకొచ్చింది పీవీ సింధు.


ట్వీట్టర్లో ట్రెండ్ అవుతున్న ‘మీ టూ’ హ్యాష్‌ట్యాగ్ గురించి ప్రస్తావించిన గుత్తా జ్వాల... ‘నేను ఎదుర్కొన్న మెంటల్ హెరాస్‌మెంట్ (మానసిక వేధింపులు) గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చిందనుకుంటా....’ అంటూ ట్వీట్ చేసింది.‘2006 దాకా నేను జాతీయ జట్టులో ఉన్నాడు... 2006లో ఈ వ్యక్తి చీఫ్ అయ్యాక నన్ను జాతీయ జట్టు నుంచి తొలగించాడు. నేషనల్ ఛాంపియన్‌గా ఉన్న నన్ను ఏ కారణం లేకుండానే ఆకస్మాత్తుగా తప్పించారు... ఈ మధ్య రియో ఒలింపిక్స్ నుంచి వచ్చిన తర్వాత మరోసారి జాతీయ జట్టులో నుంచి నేను తప్పించబడ్డాను... నేను బ్యాడ్మింటన్ ఆడకుండా రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇది ఓ కారణం....’ అంటూ ఆరోపించింది గుత్తా జ్వాల.
Published by: Ramu Chinthakindhi
First published: October 10, 2018, 5:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading