MCGUIRES IRISH PUB FROM FLORIDA FAMOUS FOR HAVING AN ESTIMATED TWO MILLION DOLLARS IN CASH HANGING FROM THE CEILING VIDEO GOES VIRAL GH SRD
Viral Video : ఆ పబ్ లో ఎక్కడా చూసినా కరెన్సీ నోట్లే.. ఎవరైనా ఆ డబ్బు ఎత్తుకుపోతే..?
Photo Credit : You Tube
Viral Video : వినియోగదారులను ఆకట్టుకునేందుకు, కస్టమర్లను పెంచుకునేందుకు అనేక షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, క్లబ్స్, పబ్స్, కెఫేలు కొత్త కొత్త ట్రిక్స్ ప్లే చేస్తుంటాయి. ముఖ్యంగా, తమ ఇంటీరియర్ డిజైన్‌ను అద్భుతంగా తీర్చిదిద్ది కస్టమర్లను మంత్రముగ్ధుల్ని చేస్తుంటాయి.
వినియోగదారులను ఆకట్టుకునేందుకు, కస్టమర్లను పెంచుకునేందుకు అనేక షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, క్లబ్స్, పబ్స్, కెఫేలు కొత్త కొత్త ట్రిక్స్ ప్లే చేస్తుంటాయి. ముఖ్యంగా, తమ ఇంటీరియర్ డిజైన్‌ను అద్భుతంగా తీర్చిదిద్ది కస్టమర్లను మంత్రముగ్ధుల్ని చేస్తుంటాయి. దీని కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టడానికి సైతం సిద్ధమవుతుంటాయి. ఇదే తరహాలో ఫ్లోరిడాకు చెందిన ఓ పబ్ యాజమాన్యం ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. రొటీన్‌కు భిన్నంగా ఈ పబ్ నిర్వాహకులు ఆలోచించడమే దీనికి ప్రధాన కారణం. ఈ పబ్‌లోకి అడుగుపెట్టగానే గోడలపై డాలర్ నోట్లు దర్శనమిస్తుంటాయి. వీటి విలువ కేవలం వందలు, వేలు కాదండోయ్.. ఏకంగా రూ.కోట్లలో ఉంటుంది. అంతేకాదు, ఈ పబ్‌లో అలంకరించిన డబ్బుకు యజమానులు ఇన్కమ్ టాక్స్ కూడా చెల్లిస్తుంటారు. ఇంతకీ ఈ పబ్ ఎక్కడుంది? నోట్లను ఎందుకు వేలాడదీస్తున్నారు? వంటి ఆసక్తికర విషయాలను తెలసుకుందాం.
* టిప్ వచ్చిన ప్రతి నోటు గోడపై..
ఫ్లోరిడాలోని పెన్సాకోలా ప్రాంతంలో మెక్ గైర్ దంపతులు 1977లో మెక్గైర్స్ ఐరిష్ పబ్‌ను నెలకొల్పారు. తొలినాళ్లలో గైర్ భార్య మొల్లీ పబ్ బేరర్‌గా ఉంటూ కస్టమర్లకు ఆర్డర్లను తెచ్చేది. ఆమె సర్వీసుకు మెచ్చి ఒక వ్యక్తి డాలర్ నోట్‌ను టిప్‌గా ఇచ్చాడు. అయితే ఇది తన తొలి టిప్ కావడంతో మొల్లీ ఆ డాలర్ నోట్‌పై తేదీ రాసి బార్ టేబుల్‌కు అతికించింది. ఈ డాలర్ నోట్ తనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని ఆమె బాగా నమ్మింది. ఇలా చేయడం ద్వారా తన పబ్‌కు కస్టమర్ల రాక పెరిగింది.
దీన్ని సెంటిమెంట్‌గా భావించిన మొల్లీ తనకు టిప్ రూపంలో వచ్చిన ప్రతి నోటును బార్లోనే అతికించడం మొదలు పెట్టింది. దీన్ని గమనించిన కస్టమర్లు నోటుపై వారి పేరు రాసి టిప్ ఇవ్వడం ప్రారంభించారు. ఇలా కాలక్రమంలో పబ్ మొత్తం నోట్లమయమైపోయింది. దీంతో యాజమాన్యం టేబుల్స్‌కు, గోడలకు అతికించిన నోట్లను తీసి సీలింగ్‌కు వేలాడదీశారు. ప్రస్తుతం, ఈ పబ్‌లో అలంకరించిన నోట్ల విలువ అక్షరాలా 2 మిలియన్ యూఎస్ డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ.14.61 కోట్లు) పైనే ఉంటుంది.
* ప్రతి నోటుపై ఆటో గ్రాఫ్..
డబ్బులు ఇలా బహిరంగంగా గోడలపై అతికిస్తే దొంగలు ఎత్తుకెళ్లరా? అనే అనుమానం అందర్లోనూ వస్తుంటుంది. అయితే ఇక్కడ ఆ సమస్య తలెత్తకుండా పబ్ యాజమాన్యం ఒక వినూత్న పంథా అనుసరిస్తుంది. పబ్ పైకప్పున అలంకరించిన ప్రతి నోటుపై బ్లాక్ మార్కర్‌తో ఆటోగ్రాఫ్ చేసి ఉంటుంది. అంతేకాదు, ఓ చిన్నపాటి హోల్ కూడా ఉంటుంది. ఈ ఐరిష్ పబ్ ఆ ప్రాంతంలో బాగా ఫేమస్ కావడంతో ఈ నోట్లను ఇతర షాప్ యజమానులు, ప్రజలు సులభంగా గుర్తుపడతారు, ఎవరైనా వ్యక్తి వాటిని దొంగలించి ఇతర షాపుల్లో ఇస్తే.. ఆ నోటు తెచ్చిన సదరు వ్యక్తి సమాచారాన్ని పబ్ యజమానితో పాటు పోలీసులకు చేరవేస్తుంటారు. దీంతో దొంగ ఈజీగా దొరికి పోతాడు. అందుకే ఏ చింతా లేకుండా నోట్లను వేలాడదీసే సంప్రదాయాన్ని పబ్ ఇప్పటికీ కొనసాగిస్తోంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.