Home /News /trending /

MCDONALDS OUTLET IN AHMEDABAD SEALED AFTER LIZARD FOUND IN COLD DRINK PVN

Video : షాకింగ్.. కూల్ డ్రింక్ లో బల్లి..మెక్‌డొనాల్డ్స్‌ అవుట్‌ లెట్‌ సీజ్

మెక్‌డొనాల్డ్స్‌ కూల్డ్ డ్రింక్ లో బల్లి

మెక్‌డొనాల్డ్స్‌ కూల్డ్ డ్రింక్ లో బల్లి

lizard found in cold drink ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ ఇలా ఎవరితోనైనా ఎంజాయ్‌ చేసేందుకు రెస్టారెంట్స్ కు వెళ్తుంటాం. అయితే.. మనం ఆర్డర్‌ చేసిన ఫుడ్‌లో బొద్దింకో, లేక బల్లి ఇలా ఇంకేదైనా కనిపిస్తే పరిస్థితి ఏంటి.

lizard found in McDonalds cold drink ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ ఇలా ఎవరితోనైనా ఎంజాయ్‌ చేసేందుకు రెస్టారెంట్స్ కు వెళ్తుంటాం. అయితే.. మనం ఆర్డర్‌ చేసిన ఫుడ్‌లో బొద్దింకో, లేక బల్లి ఇలా ఇంకేదైనా కనిపిస్తే పరిస్థితి ఏంటి. అలాంటి ఘటనే అహ్మదాబాద్‌(Ahmedabad)కు చెందిన భార్గవ జోషికి ఎదురైంది. భార్గవ జోషి తన స్నేహితుడితో కలిసి శనివారం అహ్మదాబాద్‌లోని మెక్‌ డొనాల్డ్స్‌ రెస్టారెంట్‌ వెళ్లాడు.. తాగడానికి కోక్‌ ఆర్డర్‌ ఇచ్చాడు. అయితే భార్గవ్ కి ఇచ్చిన కూల్ డ్రింక్ లో బల్లి తేలుతూ కనిపించింది. దీంతో మెక్‌డొనాల్డ్స్‌ అవుట్‌ లెట్‌ మేనేజర్‌ దృష్టికి ఈ విషయాని తీసుకెళ్లడంతో అతను చాలా సింపుల్‌గా.. ఆ విషయానికి అంత ప్రాధాన్యం ఇవ్వలేదని భార్గవ ఆరోపించాడు.

అంతేకాదు, కూల్ డ్రింకుకు చెల్లించిన డబ్బును తిరిగి ఇస్తామని చెప్పాడని వెల్లడించాడు. దీంతో చిరెత్తిన భార్గవ్‌ వెంటనే ట్విట్టర్‌లో ఆ కూల్‌డ్రింక్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేస్తూ.. మున్సిపల్‌, పోలీసులతో పాటు మెక్‌ డొనాల్డ్స్ పై అధికారులకు ట్యాగ్‌ చేశాడు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. దీంతో మెక్‌ డొనాల్డ్స్‌ అవుట్ లెట్ ని అధికారులు సీజ్ చేశారు.



ALSO READ Sidhu Special Jail Diet : జైలులో సిద్దూ డైట్ ఛార్ట్ చూస్తే బిత్తరపోవాల్సిందే

అయితే మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో తమ ఫిర్యాదును ఎవరూ తీసుకోలేదని భార్గవ జోషి ఆరోపిస్తున్నారు. అయితే కూల్ డ్రింక్ కోసం చెల్లించిన రూ. 300 వాపసు ఇచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత భార్గవ జోషి అహ్మదాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. . అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దేవాంగ్ పటేల్ రంగంలోకి దిగారు. పరీక్ష కోసం అవుట్‌లెట్ నుంచి శీతల పానీయాల నమూనాలను సేకరించి.. శాంపిల్స్ ను పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీకి పంపించారు. ఆ తర్వాత అధికారులు చర్యలు తీసుకున్నారు. మెక్‌ డొనాల్డ్స్‌ అవుట్ లెట్ ని అధికారులు సీజ్ చేశారు. అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు ముందస్తు అనుమతి లేకుండా తమ మెక్ డొనాల్డ్ ఔట్ లెట్ ను తెరిచేందుకు వీలు లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే జరిగిన సంఘటనపై మెక్ డొనాల్డ్ సంస్థ స్పందించింది. తమ రెస్టారెంట్లలో 42 సేఫ్టీ చెక్ ప్రోటోకాల్ ను అమలు చేస్తామని వారు తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Ahmedabad, Lizard, Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు