Mayur Shelke: మరోసారి వార్తల్లోకెక్కిన ఓవర్ నైట్ స్టార్.. పెను ప్రమాదం నుంచి బాలుడిని కాపాడిన ఆ రైల్వే ఉద్యోగే ఇప్పుడు మరో సంచలనం..!

Mayur Shelke (ఫైల్ ఫొటో)

రైలు ప్రమాదం నుంచి ఓ బాలుడిని ఓ రైల్వే ఉద్యోగి కాపాడిన సంగతి తెలిసిందే. సీసీ కెమెరాలో ఈ వీడియో కాస్తా రికార్డవడంతో నెట్టింట తెగ వైరల్ అయింది. తాజాగా అతడు తీసుకున్న మరో నిర్ణయంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు..

  • Share this:
    మయూర్ షెల్కే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి, వార్తలను ఫాలో అయ్యే వారికి ఈ పేరు తెలిసే ఉంటుంది. ఇతడు ఎవరో గుర్తు పట్టే ఉంటారు. కొద్ది రోజుల క్రితం అత్యంత ధైర్య సాహసాలతో ఓ పిల్లాడిని పెను ప్రమాదం నుంచి కాపాడాడీ యువకుడు. ఎదురుగా రైలు దూసుకొస్తున్నా, ఏమాత్రం తేడా వచ్చినా తన ప్రాణాలే పోతాయని తెలిసినా ఆ యువకుడు లెక్క చేయలేదు. ఎదురుగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి మరీ ఓ బాబును కాపాడాడు. రైలు పట్టాలపై పడిపోయిన ఆ బాలుడిని మళ్లీ ప్లాట్ ఫాం మీదకు చేర్చాడు. మెరుపు వేగంతో తాను కూడా ప్లాట్ ఫామ్ మీదకు వెళ్లిపోయాడు. క్షణాల్లోనే ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. సీసీ కెమెరాలో ఈ వీడియో కాస్తా రికార్డవడంతో నెట్టింట తెగ వైరల్ అయింది. అతడికి ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా అతడు తీసుకున్న మరో నిర్ణయంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

    మయూర్ షెల్కే అనే యువకుడు ముంబైలోని రైల్వే స్టేషన్లో పాయింట్స్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 20వ తారీఖున పెను ప్రమాదంలో ఉన్న ఓ బాలుడిని కాపాడి ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. రాజకీయ నాయకుల వద్ద నుంచి సినీ సెలబ్రెటీల వరకు అంతా అతడిని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. నెట్టింట అతడి గురించే పోస్టులన్నీ. అతడి సాహసాన్ని మెచ్చుకుంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ట్వీట్ చేశారు. రైల్వే అధికారులు అతడిని అభినందించడమే కాకుండా రివార్డును కూడా ప్రకటించారు.



    అత్యంత ధైర్య సాహసాలను కనపర్చిన షెల్కేకు 50 వేల రూపాయల రివార్డును ఇస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ ప్రకటనపై షెల్కే కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకు ఇవ్వబోతున్న రివార్డులో సగభాగాన్ని తాను కాపాడిన ఆ బాలుడి విద్యాభ్యాసానికి ఇస్తానని ప్రకటించాడు. ‘ఆ బాలుడి కుటుంబం ఆర్థికంగా ఏమంత బాగాలేదని నాకు తెలిసింది. అందుకే ఆ బాబు చదువు కోసం నాకు రివార్డుగా ఇచ్చిన దాంట్లో సగభాగాన్ని బాలుడికి ఇవ్వాలనుకుంటున్నాను.‘ అంటూ షెల్కే ప్రకటించాడు. అతడి ప్రకటనపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతడిపై మరోసారి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published: