పక్షిని తినేస్తున్న భారీ సాలీడు... అలా ఆరగిస్తోంది... వైరల్ వీడియో

సాలీళ్లు మన ఇళ్లలో ఉండే సాధారణ జీవులు. ఆ స్పైడర మేన్ సినిమాలు వచ్చాక... వాటి రేంజ్ పెరిగింది. ఐతే... సాలీళ్లు పక్షుల్ని తినేయడం మనం ఎప్పుడూ చూసి ఉండం. ఇప్పుడు చూద్దాం.

news18-telugu
Updated: September 22, 2020, 2:19 PM IST
పక్షిని తినేస్తున్న భారీ సాలీడు... అలా ఆరగిస్తోంది... వైరల్ వీడియో
పక్షిని తినేస్తున్న భారీ సాలీడు... (credit - Youtube)
  • Share this:
సాలీళ్లలో తరంతులా (Tarantula) అనేది చాలా పెద్దగా ఉంటుంది. మన అర చెయ్యి అంత ఉంటుంది. చాలా అందంగా ఉంటాయి ఇవి. ఇన్నాళ్లూ ఈ సాలీళ్లు... చిన్న చిన్న పురుగులు, కీటకాల్ని మాత్రమే తింటున్నాయని అనుకున్నారు. కానీ... ఓ తరంతులా... ఏకంగా ఓ పక్షిని ఆరగించేస్తుండటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ సాలీడు... పక్షి తలను తన నోట్లో పెట్టుకొని... తినేస్తోంది. రెడ్డిట్‌లో ఉన్న ఈ వీడియో... వైరల్ అయ్యింది. ఇందులో బలైపోతున్న పక్షి... హౌస్ రెన్ (house wren). మన ఇళ్లలో పిచ్చుకల కంటే కాస్త పెద్ద సైజులో ఉండే పక్షులివి. అలాంటి పక్షిని లటక్కున పట్టుకుంది సాలీడు. ఈ వీడియోని పోస్ట్ చేసిన యూజర్... ఈ సాలీడును గోలియత్ (Goliath) అనుకున్నారు. గోలియత్ సాలీళ్లు ప్రపంచంలోనే అతి పద్దవి. కానీ వీడియోలో ఉన్న సాలీడు గోలియత్ కాదు.

జర్మనీలోని నేచురల్ హిస్టరీ మ్యూజియంకి చెందిన జాసన్ డన్లాప్... తరంతులా సాలీళ్లు సహజంగా పక్షులను తినవు అనీ... కొన్ని తరంతులా సాలీళ్లు మాత్రం తింటాయని తెలిపారు. ఈ వీడియోని చూసిన ఆయన... ఇందులో సాలీడు... ఆ పక్షిని తినట్లేదనీ... నములుతోందని అన్నారు. ఇలా నమిలేటప్పుడు... సాలీడు నోట్లో లాలాజలం ఊరుతుంది. తద్వారా... పక్షి మాంసం మెత్తబడి... జ్యూస్‌లా మారి... సాలీడుకి ఆహారం అవుతుందని అంచనా వేశారు.


పక్షులను తినే తరంతులాలు... చెట్లమీద నివసిస్తాయని నేషనల్ జూ అండ్ కన్సర్వేషన్ బయాలజీ వారు తెలిపారు. ఇలాంటి వాటిని పింక్ టాయ్ తరంతులా అంటారట. ఎందుకంటే... వీటి కాళ్ల చివర్లలో పింక్ కలర్ ఉంటుంది. ఇలాగైతే... ఆ పక్షులకు ఇంక రక్షణ ఎక్కడుంటుంది? ఇలాంటి సాలీళ్లు దక్షిణ అమెరికాలోని ఉత్తర ప్రాంతంలో, బ్రెజిల్‌లో అక్కడి అమెజాన్ రెయిన్ ఫారెస్టులో ఉంటాయట. ఇవి ఎక్కువగా బల్లులు, కప్పలు, చుంచెలుకల్ని తింటాయట.

ఏప్రిల్‌లో ఓ సాలీడు.. గబ్బిలాన్ని తినేసింది. తన ఇంటి దగ్గరే ఇలా జరగడంతో... అన్నెట్టే అనే మహిళ అది చూసి... ఆశ్చర్యపోయింది. దీన్ని బట్టీ మనకు అర్థమయ్యేది ఒకటే. స్పైడర్లను తక్కువ అంచనా వెయ్యకూడదు. లక్కీగా మన దేశంలో ఇలాంటి రాకాసి సాలీళ్లు పెద్దగా లేవు.
Published by: Krishna Kumar N
First published: September 22, 2020, 2:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading