చనిపోయిన చేపను చూసి వణుకుతున్న జనాలు.. సునామీకి సంకేతమా?

2010లో సుమారు 10 ఓర్‌ఫిష్‌లు సముద్ర ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే 2011 మార్చిలో జపాన్‌లో భారీ భూకంపం వచ్చింది. సునామీ విధ్వంసానికి సుమారు 19వేల మంది చనిపోయారు.

news18-telugu
Updated: July 23, 2020, 11:55 AM IST
చనిపోయిన చేపను చూసి వణుకుతున్న జనాలు.. సునామీకి సంకేతమా?
ఓర్ ఫిష్ (Image:CEN)
  • Share this:
ఆ చేప మళ్లీ ఒడ్డుకు కొట్టుకొచ్చింది. జనాల్లో మళ్లీ భయం మొదలయింది. మెక్సికో తీరానికి 14 మీటర్ల పొడవైన ఓర్ ఫిష్ కొట్టుకొచ్చింది. బాజా కాలిఫొర్నియాలోని పిచిలింగ్ బే బీచ్‌లో ఈ పొడవైన ఓర్ ఫిష్‌ను అక్వాకల్చర్ ఇంజినీర్ ఫెర్నాండో కెవాలిన్, అతడి స్నేహితుడు గుర్తించారు. ఐతే ఆ చేప చనిపోయింది. కాస్త కుళ్లిపోయి.. కంపు కూడా కొడుతోంది. దాని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెక్సికన్లు భయపడుతున్నారు. స్థానికంగా 'భూంకప చేప'గా పిలుచుకునే ఆ ఓర్ ఫిష్ ఒడ్డుకు కొట్టుకురావడంతో.. భూకంపం, సునామీ వస్తుందేమోనని అక్కడి ప్రజలు వణికిపోతున్నారు.

ఓర్ విష్‌ని సముద్ర పాముగా కూడా పిలుస్తారు. పొడవాటి శరీరం, ఎర్రటి మొప్పులు, వెండిలా మెరిసే చర్మం కలిగి ఉంటుంది. ఈ చేపను సముద్ర దేవుడి దూతగా జపాన్ ప్రజలు భావిస్తారు. భూకంప చేపగా మెక్సికన్లు పిలుస్తారు. ఇవి నీటి అడుగున 200 మీ. నుంచి కిలోమీటర్ లోతన మాత్రమే ఇవి జీవిస్తాయి. అంత అడుగుభాగాన సంచరించడంతో మత్స్యకారుల వలకు అస్సలు చిక్కవు. అలాంటిది ఓ పెద్ద ఓర్ ఫిష్ మెక్సికో తీరానికి కొట్టుకొచ్చింది.

ఓర్‌‌ఫిష్ చేపలు తీరానికి కొట్టుకొచ్చినా...మత్స్యకారుల వలకు చిక్కినా... జపాన్‌, మెక్సికోతో పాటు పలు దేశాల ప్రజలు భయపడితారు. ఎందుకంటే.. ఇవి తీరానికి వస్తే ఏదో ప్రకృతి విపత్తు సంభవిస్తుందని వాళ్లు విశ్వసిస్తారు. సముద్ర గర్భంలో భూకంపం వస్తే వీటికి ముందే తెలిసిపోతుందట..! సునామీ పరిస్థితులు తలెత్తినా ఓర్‌ఫిష్ చేపలు పసిగడతాయట..! ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు మాత్రమే అవి నీటి పైభాగానికి వస్తాయని చాలా మంది నమ్ముతారు.

2010లో సుమారు 10 ఓర్‌ఫిష్‌లు సముద్ర ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే 2011 మార్చిలో జపాన్‌లో భారీ భూకంపం వచ్చింది. సునామీ విధ్వంసానికి సుమారు 19వేల మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో మెక్సికో తీరానికి భారీ చేప కొట్టుకురావడంతో.. మళ్లీ సునామీ వస్తుందేమోనన్న భయంతో అక్కడి ప్రజలు భయపడుతున్నారు. మరికొందరు మాత్రం మూఢనమ్మకంగా కొట్టిపారేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: July 23, 2020, 11:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading