దసరా పండగకు బంపర్ ఆఫర్.. మారుతి బాలెనోపై రూ.లక్ష తగ్గింపు..

నెక్సా సిరీస్‌కు చెందిన బాలెనో ఆర్‌ఎస్ వేరియంట్ కార్లపై రూ.లక్ష తగ్గిస్తూ మారుతి సుజుకీ ఈ రోజు ప్రకటన చేసింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 27, 2019, 6:16 PM IST
దసరా పండగకు బంపర్ ఆఫర్.. మారుతి బాలెనోపై రూ.లక్ష తగ్గింపు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దసరా పండగ పూట వాహన ప్రియులకు మారుతి సుజుకీ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. నెక్సా సిరీస్‌కు చెందిన బాలెనో ఆర్‌ఎస్ వేరియంట్ కార్లపై రూ.లక్ష తగ్గించింది. ఈ మేరకు ఆ కంపనీ ఈ రోజు ప్రకటన చేసింది. రెండ్రోజుల క్రితమే కొన్ని సెలెక్ట్ మోడళ్లపై రూ.5వేలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన ఈ కంపెనీ.. ఇప్పుడు ఏకంగా బాలెనో కార్లపై రూ.లక్ష తగ్గిస్తున్నట్లు ప్రకటించడం విశేషం. కార్పొరేట్ సంస్థలపై పన్ను తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన తర్వాత మారుతి సుజుకీ ఈ ప్రకటన చేసింది. నెక్సా సిరీస్‌కు చెందిన బాలెనో ఢిల్లీ ఎక్స్ షోరూం ధ‌ర‌ను రూ.5,58,000గా నిర్ణయించింది. కార్ల సేల్స్ విఫరీతంగా పడిపోవడంతో, అమ్మకాల్లో వేగం పుంజుకోవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. అన్ని మోడళ్లపై ధర తగ్గించిన మారుతి.. పలు ప్రమోషనల్ ఆఫర్లను కూడా ప్రకటించింది.

దసరా నవరాత్రులు, దీపావళి సీజన్‌‌లోనూ ధరలు తగ్గించేలా కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు మార్కెట్లు వర్గాలు చెబుతున్నాయి. తాజాగా.. మారుతి సుజుకీ తీసుకున్న నిర్ణయంతో ఇతర కార్ల కంపెనీలు కూడా పోటీ పడి కార్ల ధరలు తగ్గించడం ఖాయం అని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా కార్లు కొనుక్కోవాలనుకునేవారికి పండగ పూట శుభవార్త అందినట్లే.

First published: September 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...