Home /News /trending /

MARRIED WOMAN DANCED IN THE STREET WITH A SUPERHIT SONG IN THE EVENING AFTER WEARING VERMILION ON HER FOREHEAD AND SAREE VIDEO GOES VIRAL SRD

Viral Video : తన ఎక్స్ ప్రెషన్స్, డ్యాన్స్‌ తో అదరగొట్టిన మహిళ.. వారెవ్వా అంటున్న నెటిజన్లు! మీరు కూడా చూసేయండి..

Photo Credit : Face Book

Photo Credit : Face Book

Viral Video : వింతలు-విశేషాలకు సోషల్ మీడియా నిలయం. ప్రపంచం నలమూలల ఏం జరిగినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. ఇక, సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు సర్క్యూలేట్ అవుతుంటాయి.

    వింతలు-విశేషాలకు సోషల్ మీడియా నిలయం. ప్రపంచం నలమూలల ఏం జరిగినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. ఇక, సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు సర్క్యూలేట్ అవుతుంటాయి. వాటిలో ముఖ్యంగా ఫన్నీ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు చాలా ఉంటాయి. ప్రాంక్ వీడియోలు, కామెడీ వీడియోలు, సరదా డ్యాన్స్‌లు ఇలా రకరకాల వీడియోలు నిత్యం చక్కర్లు కొడుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలో ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని మనల్ని థ్రిల్ చేస్తుంటాయ్. ఇక, లేటెస్ట్ గా ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ మహిళ అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. బాలీవుడ్ సినిమా కూలీలోని పాటకు అనుగుణంగా మహిళా స్టెప్పులేయడం మనం చూడొచ్చు.

    ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న మహిళ పేరు తుముల్. బెంగాల్ కు చెందిన గృహిణి. చీరకట్టు, నుదుటిన సింధూరంతో ఈ మహిళా చేసే డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందిన కూలీ నెం.1 1995 జూన్ 30 న రిలీజ్ అయింది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గోవిందా మరియు కరీష్మా హీరో హీరోయిన్లుగా నటించారు.

    ఇది కూడా చదవండి : ఈ మహిళ వంట వండుతోందా.. ఆ వంకతో అందాలు చూపిస్తోందా?

    ఇక, ఈ సినిమాలోని ప్రతి పాట సూపర్ హిట్టే. మరీ ముఖ్యంగా ఈ మహిళా ఎంపిక చేసుకున్న ఈ సాంగ్ అప్పట్లో ఓ సంచలనం. ఆ పాటలో గోవిందా, కరీష్మా డ్యాన్స్ సూపరో సూపర్. అలాంటి పాటకు.. ఈ మహిళా డ్యాన్స్ వేసింది. ఇంకే ముంది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ వస్తున్నాయ్. ఇక, నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే వైరల్ అయిన ఈ వీడియోపై ఓ లుక్కేయండి.


    మరో, వైరల్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది.  అమెరికాలోని... జార్జియాలో స్విమ్మింగ్ చేద్దామని ఓ యువతి స్విమ్మింగ్ పూల్‌ ((Women in swimming pool))కి వెళ్లింది. కానీ నీటిలోకి జంప్ చెయ్యాలంటే ఆలోచించసాగింది. దాంతో కొంత మంది జంప్ చెయ్యమని ఆమెను ఎంకరేజ్ చేశారు. స్విమ్ సూట్‌లో జంప్ చేస్తూ... గిర్రున గాల్లో పల్టీ కొట్టి.. నీటిలోకి దూకింది. కానీ అలా పల్టీ కొట్టినప్పుడు... ఆమె విగ్ ఊడిపోయి... స్టాండ్‌పై పడింది. ఆమె నీటిలో పడింది. దాంతో అక్కడున్న వారు పకపకా నవ్వేశారు. విగ్ ఊడినప్పుడు చాలా మంది అది విగ్ అనుకోలేదు. ఓ క్షణం తర్వాత వారికి విగ్ అనే విషయం అర్థమైంది.


    కొన్ని క్షణాలకు నీటి నుంచి పైకి వచ్చిన యువతి.. విగ్ ఊడిపోయిన విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయింది. నిరాశతో ఫేస్ పెట్టింది. అక్కడితో వీడియో ముగిసింది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bollywood news, Facebook, Trending videos, Viral Video, Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు