హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

అతడికి పెళ్లై కొడుకున్నాడు.. హిజ్రాతో రెండో పెళ్లి.. భార్య దగ్గరుండి మరీ జరిపించింది

అతడికి పెళ్లై కొడుకున్నాడు.. హిజ్రాతో రెండో పెళ్లి.. భార్య దగ్గరుండి మరీ జరిపించింది

ట్రాన్స్‌జెండర్‌తో వివాహితుడి పెళ్లి

ట్రాన్స్‌జెండర్‌తో వివాహితుడి పెళ్లి

భార్య గట్టిగా అడగడంతో.. అవును.. తాను ఆమెను ప్రేమిస్తున్నానని ఫకీర్ స్పష్టం చేశాడు. సంగీత లేకుండా తాను జీవించలేని తేల్చిచెప్పాడు. తామిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  అతడికి ఇప్పటికే పెళ్లయింది. బంగారం లాంటి కొడుకు కూడా ఉన్నాడు. భార్యాపిల్లలతో హాయిగా జీవించాల్సింది పోయి.. అతడు ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమలో పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో.. భార్య ఖంగుతింది. ఆమెను పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోతానని బెదిరించడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ భార్య కూడా ఒప్పుకుంది. ఒడిశా (Odisha)లోని కలహండి జిల్లాలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం... కలహండి జిల్లా ధుర్కితి ప్రాంతానికి చెందిన ఫకీర్ నయల్‌కి ఐదేళ్ల క్రితం పెళ్లింది. అతడికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఐతే ఏడాది క్రితం ఫకీర్ నయల్‌కి సంగీత అనే ట్రాన్స్‌జెండర్ (Transgender)  పరిచయమైంది. అంబోడా ప్రాంతంలో రోడ్డుపై దుకాణాల వద్ద భిక్షాటన చేస్తూ కనిపించింది. ఆమె రూపం ఆకర్షణీయంగా ఉండడంతో తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు ఫకీర్.

  సంగీతతో మాట్లాడి..ఆమె మొబైల్ నెంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అనంతరం అప్పుడప్పుడూ కలిసేశారు. ఇలా తనకు తెలియకుండానే సంగీతతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ఐతే నెల రోజుల క్రితమే తన భర్త ప్రేమ వ్యవహారం భార్యకు తెలిసింది. అది కూడా ఓ ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమిస్తున్నాడని తెలిసి ఖంగుతింది. ఈ వ్యవహారంపై భర్తను నిలదీసింది. తనను ఎందుకు మోసం చేస్తున్నావని గొడవ పెట్టుకుంది. భార్య గట్టిగా అడగడంతో.. అవును.. తాను ఆమెను ప్రేమిస్తున్నానని ఫకీర్ స్పష్టం చేశాడు. సంగీత లేకుండా తాను జీవించలేని తేల్చిచెప్పాడు. తామిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో.. చివరకు భార్యే అంగీకరించింది. భర్త ప్రేమ వివాహం చేసేందుకు ముందుకు వచ్చి.. ఇద్దరినీ ఒక్కటి చేసింది.

  నార్లలోని ఓ గుడిలో LGBTQ+ కమ్యూటీకి చెందిన సంగీతతో ఫకీర్ వివాహం జరిగింది. ఈ వివాహానికి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందని పలువురు వ్యక్తులు హాజరయ్యారు. కొత్త జంటను అశీర్వదించారు. తన ప్రియుడితో వివాహం జరగడం ఎంతో సంతోషంగా ఉందని సంగీత అన్నారు. ఆయన భార్య అంగీకరించడం వల్ల ఇదంతా జరిగిందని.. ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ప్రేమకు బౌండరీలు ఉండవని.. వీరిద్దరు కలవడం చాలా సంతోషంగా ఉందని LGBTQ+ కమ్యూటీకి చెందిన కిన్నార్ ఆయేషా బెహ్రా తెలిపారు. కాగా, ఈ పెళ్లి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మరికొందరు మాత్రం స్వాగతిస్తున్నారు. నిజంగా గొప్ప ప్రేమ అని పలువురు కొనియాడుతున్నారు. మరికొందరు మాత్రం.. ఇదేం పోయేం కాలమని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Odisha, VIRAL NEWS

  ఉత్తమ కథలు