MARRIAGE STOPPED DUE TO BALDNESS IN UTTAR PRADESH SNR
OMG: వెయ్యి అబద్దాలు కాదు..ఒక్క నిజం దాచాడు..అంతే పీటల మీద పెళ్లి పెటాకులైంది
(ప్రతీకాత్మకచిత్రం)
OMG: వెయ్యి అబద్దాలు ఆడైనా ఓ పెళ్లి చెయ్యాలన్నారు పెద్దలు. కాని ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి కొడుకు ఒక్క నిజాన్ని దాచి పెట్టడంతో పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది. అసలు అతను దాచిపెట్టిన నిజం ఏమిటో తెలిసి అందరూ షాక్ అయ్యారు.
కాసేపట్లో పెళ్లి(Marriage)పీటలపై కూర్చోవాల్సిన నూతన వధువరులు పోలీస్ స్టేషన్(Police Station)లో పంచాయితీ పెట్టారు. తెల్లవారుజామున పెళ్లి ముహుర్తం ఉండటంతో .పెళ్లిలో జరగాల్సిన తతంగం అంతా అయిపోయింది. ఇక ముహుర్తం సమయం వచ్చింది. అమ్మాయి మెడలో పెళ్లి కొడుకు తాళి కట్టే వేళైంది. అనుకోకుండా పెళ్లి కొడుకు(Groom)అమ్మాయి తరపు బంధువులకు చెప్పకుండా దాచిన నిజం అప్పుడే బయటపడింది. అంతే పెళ్లి కూతురు(Bride)నాకీ వరుడు వద్దూ అంటూ అందరి ముందే తేల్చి చెప్పింది. అబ్బాయి నిజస్వరూపం తెలిసి అమ్మాయి బంధువులు షాక్ అయితే..పెళ్లి కూతురు చెప్పిన మాటలకు వరుడి కుటుంబ సభ్యులకు ఆశ్చర్యపోయారు. అసలు పెళ్లి మండపంలో ఏం జరిగిందంటే..
కొంప ముంచిన బట్టతల..
ఉత్తరప్రదేశ్ ఉన్నావ్‌లో ఈ ఘటన జరిగింది. కాన్పూర్‌కి చెందిన పెళ్లి కొడుకు ఉన్నావ్‌కి చెందిన యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. తెల్లవారుజామున ముహుర్తం కావడంతో అందరూ రాత్రి వేడుకలు, ఊరేగింపు, పెళ్లి తంతుకు ముందు జరిగే పనులు పూర్తి చేశారు. వివాహ ముహుర్తం దగ్గర పడగానే రాత్రి నుంచి అలసటగా ఉన్న పెళ్లి కొడుకు మండపం దగ్గరకు వచ్చే సమయంలో కాస్త కళ్లు తిరిగి కూలబడ్డాడు. అదే సమయంలో అతని తలపై పెట్టుకున్న విగ్గు ఊడిపోయింది. అంతే అప్పటి వరకు పెళ్లి చూద్దామని వచ్చిన బంధువులు, అమ్మాయి కుటుంబ సభ్యులకు పెళ్లి కొడుకు విగ్గు పెట్టుకున్న విషయం తెలియలేదు. అతని నిజస్వరూపం చూసి అక్కయ్యారు. తనకు బట్టతల అనే విషయాన్ని దాచిపెట్టి విగ్గుతో మేనేజ్ చేద్దామనుకున్నారు వరుడి తరపు బంధువులు.
ఒక్క అబద్ధంతో ఆగిన పెళ్లి..
పెళ్లి కొడుకు బట్టతల బయటపడటంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. పెళ్లి కొడుక్కి బట్టతల అనే విషయం తెలిసి పెళ్లి కూతురు వివాహాం చేసుకునేందుకు అంగీకరించలేదు. పెద్దలు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో పంచాయితీ పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. పెళ్లికొడుక్కి బట్టతల ఉందనే విషయాన్ని దాచి పెట్టి మోసం చేశారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అమ్మాయి. పోలీసులు కూడా వధువుకి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికి తగ్గేదేలే అంది. పెళ్లి సంబందం రద్దు చేసుకోవడమే కాకుండా పెళ్లి కోసం ఖర్చు చేసిన 5.66 లక్షలు రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ వరుడి కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేశారు. ఇంత జరిగిన తర్వాత పెళ్లి కొడుకు అమ్మాయి లేకుండా, భాజాభజంత్రీలు లేకుండా తిరిగి కాన్పూర్ వెళ్లిపోయాడు.
నష్టపరిహారం చెల్లింపు..
పీటల మీద పెళ్లి ఆపడం తప్పు కదా అని పోలీసులు, స్థానికులు వధువు కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తే ..బట్టతల ఉందనే విషయాన్ని దాచి పెట్టడం తప్పు కదా అని అన్నారు. అమ్మాయిని బలవంతంగా ఒప్పించి పెళ్లి చేయలేము కదా అని చెప్పుకొచ్చారు. బట్టతల కారణంగా పెళ్లి ఆగిపోవడంతో పరియార్ పోలీస్ ఔట్ పోస్ట్ ఇంచార్జి రామ్‌జీత్ యాదవ్ ఇరువర్గాలను సర్ధి చెప్పి పంపడంతో పెళ్లి పెటాకులైంది.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.