నేటి యువతలో చాలా మంది ప్రేమ పెళ్లిళ్లు (Love marriage) చేసుకొవడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. అయితే, ప్రేమించుకున్న వాళ్లలో కొంత మంది మాత్రమే తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళుతున్నారు. కొన్ని చోట్ల కులాలు వేరని, మరికొన్ని చోట్ల మన హోదాకు తగ్గ ఆస్తిపాస్తులు లేవని పెద్ద వాళ్లు పిల్లల ప్రేమను అంగీకరించడం లేదు. కానీ కొన్ని చోట్ల పిల్లల మనసులకు అనుగుణంగా వారికి నచ్చిన వారిని ఇచ్చి కూడా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు.
కొందరు ప్రేమికులు, తమ ప్రేమను ఎదుటివారికి ఎక్స్ ప్రేస్ చేయడానికి భయపడుతుంటారు. ఎక్కడ తమను తిడాతారో లేదా ఏమైన అనుకుంటారో అని తమ మనసులో ప్రేమను చెప్పరు. కానీ కొన్ని సార్లు ఇన్ డైరెక్ట్ గా ప్రేమను వ్యక్త పరుస్తుంటారు. ఇక్కడో యువకుడు.. తన ప్రేమను వెరైటీగా ఆమెతో చెప్పాడు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. మహరాష్ట్ర లోని (Maharashtra) కొల్హాపూర్ లో ఈ వెరైటీ ప్రేమ ప్రపోజల్ ఘటన జరిగింది. కొల్హాపూర్ కు(Kolhapur) చెందిన సౌరభ్ కస్బేకర్, సాంగ్లీకి చెందిన ఉత్కర్ష (ఇద్దరు కలిసి చదువుకున్నారు. వీరిద్దరు బుద్గావ్-సాంగ్లీలోని వసంత్వాడ పాటిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ విభాగంలో చదువుతున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. సౌరభ్, ఉత్కర్ష్ గత సంవత్సరం వరకు ఒకరికొకరు అసలు తెలియదు. ఈ క్రమంలో సౌరభ్ ఒక రోజు ఉత్కర్ష ను (Saurabh and Utkarshas ) చూశాడు. అప్పటి నుంచి ఆమెను ప్రేమించిడం మొదలుపెట్టాడు. ఎప్పటినుంచో ఆమెకు ప్రపోజ్ చేయాలని ట్రై చేశాడు. కానీ భయపడిపోయాడు. ఈ క్రమంలో యువతి ఇంట్లో ఆమెకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని సౌరభ్ కు తెలిసింది.
దీంతో సౌరభ్ తన ఇంట్లో తన ప్రేమ విషయం చెప్పాడు. కానీ వారు అంగీకరించలేదు. దీంతో సౌరభ్ .. చేసుకుంటే.. ఆ అమ్మాయినే చేసుకుంటానంటూ తెగేసి చెప్పాడు. ఈ క్రమంలో యువతికి ఎలాగైన తన ప్రపోజ్ చేయాలని ఆమె కాలేజ్ నుంచి ఇంటికి వెళ్లే మార్గంలో పెద్ద హోర్డింగ్ (Marriage proposal hoardings) ఏర్పాటు చేశాడు. దాని మీద మ్యారీ మీ ఉత్కర్ష అని రాసిపెట్టాడు. యువతి రాగానే నెలపై కూర్చోని ఆమెకు తన ప్రేమను గురించి చెప్పాడు. దీంతో యువతి షాక్ కు గురైంది. తనను ఇంతలా ప్రేమిస్తున్న వ్యక్తి దొరకడం నిజంగా తన అదృష్టమని ఆమె భావించింది. వెంటనే అతను లవ్ ప్రపోజ్ కి (love propose) యాక్సెప్ట్ చెప్పేసింది. కాగా, వీరి పెళ్లికి ఇరుకుటుంబాల వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరిద్దరి పెళ్ళికి పెద్దలు.. మే 27 తారీఖున చేయాలని నిశ్చయించారు. ప్రస్తుతం ఈ వెరైటీ ప్రేమ ప్రపోజల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.