Home /News /trending /

MARRIAGE MENU CARD DESIGNED LIKE AS AN AADHAAR CARD IN WEST BENGAL HSN

పెళ్లి రోజే ఓ యువ జంట వింత చర్య.. వివాహ విందు తినేందుకు కూర్చుని అవాక్కైన అతిథులు..!

ఆధార్ కార్డును పోలి ఉన్న మెనూ కార్డు

ఆధార్ కార్డును పోలి ఉన్న మెనూ కార్డు

ఓ ఆధార్ కార్డు రూపంలో పెళ్లిరోజు వడ్డించే బోజనాల లిస్ట్ ను ఆ కార్డులో పొందుపరిచింది. ఆ ఆధార్ కార్డులాంటి మెనూ కార్డును సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఇంతకీ అలా ఎందుకు చేశారన్నది అడిగితే వారు చెప్పింది విని అంతా శభాష్ అంటున్నారు.

ఇంకా చదవండి ...
    పెళ్లికి వచ్చిన అతిథులకు విచిత్రంగా ఓ మొక్కను బహుమతిగా ఇచ్చి, పెంచాలని చెప్పిన జంటలను చూసి ఉంటారు. పెళ్లి కార్డులోనే ఏకంగా తన అభిమాన హీరోనో, రాజకీయ నేత ఫొటోలనో ముద్రించుకున్న అరుదైన సంఘటనల గురించి విని ఉంటారు. ఓ గిఫ్ట్ బాక్సులో పెళ్లి కార్డును ఉంచి ఓ వీడియోనే వివాహ ఆహ్వాన పత్రికగా పంపిన గాలి జనార్థనరెడ్డి కుమార్తె పెళ్లి విశేషాల గురించి కూడా వినే ఉంటారు. అయితే తాజాగా ఓ జంట తమ పెళ్లి రోజునే ఓ వైవిధ్యాన్ని చాటిచెప్పింది. దేశానికంతటికీ స్పూర్థినివ్వాలని సంకల్పించింది. అనుకున్నదే తడవుగా ఓ ఆధార్ కార్డు రూపంలో పెళ్లిరోజు వడ్డించే బోజనాల లిస్ట్ ను ఆ కార్డులో పొందుపరిచింది. ఆ ఆధార్ కార్డులాంటి మెనూ కార్డును సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఇంతకీ అలా ఎందుకు చేశారన్నది అడిగితే వారు చెప్పింది విని అంతా శభాష్ అంటున్నారు.

    పశ్చిమ బెంగాల్ కు చెందిన గోగోల్ షాహా, సుబర్ణ దాస్ ల పెళ్లి ఫిబ్రవరి 1న జరిగింది. ఈ పెళ్లికి బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. అయితే పెళ్లికి వచ్చిన వారిందరికీ భోజనాలు చేసే సమయంలో ఓ కార్డును అందించారు. ఎవరిదో ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా.? ఏంటీ అని అంతా ఆ కార్డును పరిశీలనగా చూశారు. అయితే అది ఆధార్ కార్డు కాదనీ, తాము తినబోయే వివాహవిందులో వడ్డించబోయే ఆహారపదార్థాలని తెలిసి అవాక్కయ్యారు. ఇదేదో బాగుందే, ఇలాంటి ఐడియా ఎందుకు వచ్చింది.? అని ఆ కొత్త పెళ్లి జంటను అడిగితే వారు చెప్పింది విని వారిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.



    ’వాస్తవానికి ఈ ఆలోచన నా భార్య సుబర్ణదే. మోదీ సంకల్సించిన డిజిటల్ ఇండియాకు మద్దతుగా మేం నిలవాలనుకున్నాం. అందుకే ఇలాంటి ఆలోచన చేశాం. వేరే ఇతర సందర్భాలకు బదులుగా పెళ్లి రోజే మంచిదని మేం ఇద్దరం నిర్ణయించుకున్నాం. అందుకే ఆధార్ కార్డును పోలి ఉండే వివాహ విందు మెనూను రూపొందించాం. సోషల్ మీడియాలో మాకు చాలా ప్రశంసలు వస్తున్నాయి. ఇంత స్పందన వస్తుందని మేం ఊహించలేదు‘ అని వరుడు గోగోల్ వ్యాఖ్యానించడం గమనార్హం.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Love marriage, Trending videos, VIRAL NEWS, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు