పాలరాతి పిల్లోస్... నిజమైనవాటిలాగే కనిపిస్తాయ్...

తల కింద మెత్తటి దిండు లేనిదే కొందరికి నిద్ర పట్టదు. ఆ పాలరాతి దిండును తలకింద పెట్టుకుంటే మాత్రం... రాయిని పెట్టుకున్నట్లే... ఎందుకో తెలుసుకుందాం.

news18-telugu
Updated: January 20, 2020, 1:12 PM IST
పాలరాతి పిల్లోస్... నిజమైనవాటిలాగే కనిపిస్తాయ్...
పాలరాతి పిల్లోస్... నిజమైనవాటిలాగే కనిపిస్తాయ్... (credit - Instagram - fageras_sculpture)
  • Share this:
మనందరిలో ఏవో ఒక టాలెంట్స్ ఉంటాయి. మనలో కొందరం మాత్రమే వాటిని బయట పెట్టే ఛాన్స్ దొరుకుతుంది. అలా... నార్వేకి చెందిన శిల్ప కళాకారుడు హాకన్ ఆంటోన్ ఫాగెరాస్‌కి తన టాలెంట్ ప్రదర్శించే ఛాన్స్ దొరికింది. అందరిలా ఏవో ఒక శిల్పాలు చెక్కేయకుండా... ఇంట్లో తలగడను తలపించే దిండ్లను పాలరాళ్లతో తయారుచెయ్యాలని అనుకున్నాడు. న్యూమాటిక్ హామర్ (అదో రకం సుత్తి లాంటి పనిముట్టు) ఇతర పనిముట్లతో... పాలరాళ్లను చక్కటి మెలితిరిగిన వంపులున్న దిండ్లలా తయారుచేస్తున్నాడు. ఈ విషయం చెప్పకుండా మనం ఆ దిండ్లను చూస్తే... అవి నిజమైనవే అనుకుంటాం. ఎందుకంటే... అవి వంపులు తిరిగి ఉండటం వల్ల, అలా కనిపించడం వల్ల.


2018 నుంచీ ఫాగెరాస్... ఇలాంటి పిల్లోలను తయారుచేస్తున్నాడు. ఎంతో రియలిస్టిక్‌గా ఉండే వాటిని... కళల పట్ల ఆసక్తి ఉండేవారు ఇష్టపడి కొనుక్కుంటున్నారు.

1975లో పుట్టిన ఫాగెరాస్... ఓస్లో నేషనల్ అకాడెమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, ది నేషనల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌ కార్యక్రమాలకు హాజరయ్యాడు. తన ప్రతిభను ఓస్లోలోని జరిగే ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తూ... చాలా మంది ప్రశంసలు పొందుతూ... ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్నాడు.


View this post on Instagram

What do you think? Finished?

A post shared by Håkon Anton Fagerås (@fageras_sculpture) on

Published by: Krishna Kumar N
First published: January 20, 2020, 1:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading