Home /News /trending /

MARADONA STOLEN HUBLOT WATCH LOST IN DUBAI FOUND IN ASSAM SIVASAGAR HERE IS WHAT HAPPENED MKS

Maradona watch : దటీజ్ ఇండియన్ పోలీస్! -Dubai పరువు కాపాడిన Assam ఖాకీలు -ఏం జరిగిందంటే..

మారడోనా వాచ్, నిందితుడు వాజీద్ హుస్సేన్

మారడోనా వాచ్, నిందితుడు వాజీద్ హుస్సేన్

నేరగాళ్లను డీల్ చయడంతో తమను మించిన తోపులు లేరని ఇండియన్ పోలీస్ కారల్ ఎగరేసే సందర్భం ఇవాళ చోటుచేసుకుంది. దుబాబ్ పోలీసుల కళ్లుగప్పిన నేరస్తుడు చివరికి భారతీయ పోలీసుల ముందు బేజారైపోయాడు. ఫుట్ బాల్ దిగ్గజం డిగో మారడోనా.. చేతి గడియారం.. దుబాయ్.. అస్సాం.. పదాలను కలిపితే..

ఇంకా చదవండి ...
చేసిన పాపం ఊరికే పోదని.. దేశాలు దాటినా, సముద్రాల ఆవల దాగున్నా పాపఫలం అనుభవించక తప్పదని పెద్దలు చెప్పే మాట మరోసారి రుజువైంది. అయితే ఈసారి ఘనత మాత్రం ఇండియన్ పోలీసులకే దక్కుతుంది. నేరగాళ్లను డీల్ చయడంతో తమను మించిన తోపులు లేరని ఇండియన్ పోలీస్ కారల్ ఎగరేసే సందర్భం ఇవాళ చోటుచేసుకుంది. దుబాబ్ పోలీసుల కళ్లుగప్పిన నేరస్తుడు చివరికి భారతీయ పోలీసుల ముందు బేజారైపోయాడు. ఫుట్ బాల్ దిగ్గజం డిగో మారడోనా.. చేతి గడియారం.. దుబాయ్.. అస్సాం.. విడివిడిగా ఉండే ఈ పదాలను కలిపితే గొప్ప క్రైమ్ కహాని అవుతుంది. ఆ కహానీలో అసలు కథకుణ్ని అస్సాం పోలీసులు ఎట్టకేలకు బంధించారు. ప్రపంచవ్యాప్తంగా వైరలవుతోన్న ఈ కథనం వివరాలివి..

అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం డీగో మారడోనా గతేడాది గుండెపోటుతో చనిపోవడం తెలిసిందే. ఆటలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన మారడోనా సంపద కూడా భారీగానే పోగేసినా, రకరకాల అలవాట్లతో, ఆరోగ్య సమస్యలతో చాలా వరకు పోగొట్టుకున్నాడు. అయితే చనిపోయేనాటికి కూడా ఆయన దగ్గర ఎన్నెన్నో విలువైన వస్తువులున్నాయి. వాటిలో ఒకటే ఖరీదైన హుంబ్లోట్ వాచ్. ప్రత్యేక ఎడిషన్ గా రూపొందిన ఆ చేతి గడియారమంటే డిగోకు మహా ఇష్టం. దాని విలువ దాదాపు రూ.20 లక్షలు. మారడోనా మరణం తర్వాత..

karimnagar మేయర్ సునీల్ రావు సంచలన ప్రకటన.. అదే జరిగితే పదవికి రాజీనామా..ఫుట్ బాల్ దేవుడికి సంబంధించిన పలు ఖరీదైన వస్తువులను దుబాయ్ కి చెందిన ఓ కంపెనీ వేలం పాటలో సొంత చేసుకుంది. దుబాయ్ కేంద్రంగా మారడోనా మ్యూజియం ఏర్పాటు చేయాలనుకున్న సదరు కంపెనీ ఆ వస్తువులను లాకర్ లో భద్రపర్చింది. కాగా, ఈ ఏడాది ఆగస్టులో ఆ ఖరీదైన వాచ్ మాయమైపోయింది. లాకర్ రహస్యాలు బాగా తెలిసినవాళ్లే ఈ చోరీకి పాల్పడి ఉంటారనే అనుమానాలు వచ్చాయి. దీంతో దుబాయ్ పోలీసులు.. ఆ సంస్థలో పనిచేసే సెక్యూరిటీ గార్డులు అందరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. అలా విచారణ ఎదుర్కొన్నవాళ్లలో వాజీద్ హుస్సేన్ ఒకడు. అస్సాంకు చెందిన వాజీద్.. దుబాయ్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ మారడోనా వాచ్ చోరీ కేసులో విచారణ ఎదుర్కొన్నాడు. కానీ దుబాయ్ పోలీసులకు ఆధారాలేవీ దొరక్కపోవడంతో వాజీద్ సహా సెక్యూరిటీ గార్డులు అందరినీ విడిచిపెట్టేశారు. ఆ తర్వాత..

Hyderabad : వామ్మో! ఆ మహిళల మలద్వారంలో బంగారం పేస్ట్ -ఇలాంటిది తొలిసారి..మారడోనా వాచ్ చోరీ జరిగిన చాలా రోజులకుగానీ వాజీద్ హుస్సేన్ సెలవుపై ఇండియాకు తిరిగొచ్చాడు. అస్సాంలోని శివసాగర్ కు చెందిన అతను.. తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదనే సాకుతో దుబాయ్ నుంచి వచ్చేశాడు. అయితే, తొలి నుంచీ వాజీద్ పై అనుమానాలుండటంతో దుబాయ్ పోలీసులు.. భారత పోలీసుల సహాయం కోరారు. ప్రపంచ ప్రఖ్యాత మారడోనా వాచ్ కావడంతో ఈ చోరీ కేసు దుబాయ్ ప్రతిష్టకు సవాలుగా మారడంతో అలా ఈ కేసులోకి భారతీయ పోలీసులు ఎంటరయ్యారు. అస్సాం పోలీసులు తమదైన శైలిలో వాజీద్ హుస్సేన్ ను విచారించగా అసలు నిజం నిమిషాల్లోనే బయటపడింది. మారడోనా వాచ్ కొట్టేసింది తానేనని అతను నేరం ఒప్పుకున్నాడు.

Gen Bipin Rawat ఎక్కడున్నా భారత్ అభివృద్దిని చూస్తారు -UP బహిరంగ సభలో PM Modi


దుబాయ్ లో చోరీకి గురైన మారడోనా వాచ్ ను అస్సాం పోలీసులు కనిపెట్టిన తీరును, వాజీద్ హుస్సేన్ అరెస్టుతోపాటు గడియారాన్ని రికవరీ చేసిన విధానాన్ని వివరిస్తూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ శనివారం నాడు ప్రకటన చేశారు. అంతర్జాతీయ సహకారంతోనే ఈ ఆపరేషన్ విజయవంతమైనట్లు అస్సాం సీఎం గౌరవప్రదంగా చెప్పినప్పటికీ, నెటిజన్లు మాత్రం ఈ క్రెడిట్ ముమ్మాటికీ ఇండియన్ పోలీసులకే దక్కాలని, మారడోనా వాచీ దొంగను దుబాయ్ పోలీసులు వదిలేస్తే, భారతీయ పోలీసులు చాకచక్యంగా పట్టుకోగలిగారని కామెంట్లు వస్తున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Assam, Dubai, Police, Watch price

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు