బ్యూటిఫుల్ లవ్ ప్రపోజ్ సీన్‌లో భయంకరమైన ట్విస్ట్...

ఓ యువకుడు, తన ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేయాలనుకున్నాడు. అందుకోసం ఓ అందమైన ఐడియా వేశాడు.

news18-telugu
Updated: August 6, 2020, 5:20 PM IST
బ్యూటిఫుల్ లవ్ ప్రపోజ్ సీన్‌లో భయంకరమైన ట్విస్ట్...
కాలిన ఇంట్లోనే లవ్ ప్రపోజ్ చేస్తున్న యువకుడు (Image:Facebook/Belinati Antonio)
  • Share this:
ఓ యువకుడు, తన ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేయాలనుకున్నాడు. అందుకోసం ఓ అందమైన ఐడియా వేశాడు. ఎంచక్కా తన ఫ్లాట్ ని డెకరేట్ చేశాడు. అందమైన లవ్ సింబల్ బెలూన్స్ రెడీ చేశాడు. అందమైన టీ లైట్ క్యాండిల్స్ వందలకొద్దీ వెలిగించాడు. అలాగే, మంచి వైన్ సిద్ధం చేశాడు. ఆ తర్వాత ప్రపోజ్ చేయడానికి బొకే వగైరా సిద్దం చేశాడు. ఇల్లంతా ఓ రొమాంటిక్ మూడ్ లోకి తీసుకొచ్చాడు. అమ్మాయి ఫ్లాట్ లోకి రాగానే ఫ్లాట్ అయిపోయేలా అందంగా ముస్తాబు చేశాడు. యువతిని తీసుకుని రావడానికి వెళ్లాడు. తీరా ఇంటికి వచ్చేసరికి కారులో తనకంటే వేగంగా కొన్ని ఫైరింజన్లు వెళ్తున్నాయి. ఎవరి కొంపో కాలిందనుకున్నాడు. కానీ, తీరా తన ఫ్లాట్ దగ్గరికి వచ్చి చూసేసరికి కాలింతి తన ఇల్లేనని తెలిసింది. కొవ్వుత్తుల మంటలు పెద్దవై ఓ కర్టెన్‌కు అంటుకున్నాయి. అవి బెలూన్స్‌కు తగిలాయి. అలా ఇల్లు మొత్తం కాలిపోయింది. ఫైరింజన్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. ఇంతలో ట్విస్ట్ ఏంటంటే.. ఆ కాలిపోయిన ఇంట్లోనే అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి కూడా ఓకే చెప్పేసింది. జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం కోసం తాను ఓ రకమైన సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తే... దేవుడు మరో రకంగా సర్ ప్రైజ్ ఇచ్చాడు. యూకేలోని సౌత్ యార్క్ షైర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ తతంగం మొత్తాన్ని స్థానిక ఫైర్ డిపార్ట్ మెంట్ ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఇంకెవరూ ఇలాంటి ప్రయోగాలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 6, 2020, 5:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading